...
...
Next Story

Alia Bhatt: ఇంటర్నేషనల్ స్టార్‌ల పోజులు- అలియా భట్‌పై ట్రోలింగ్- నా మెదడు పదేళ్లు వెనక్కి వెళ్లిందంటూ హీరోయిన్ రిప్లై!

Alia Bhatt On Trolling Over Gone Girl At Bafta: బాఫ్టా (BAFTA) వేడుకల్లో తన ఇంటర్వ్యూపై వచ్చిన విమర్శలకు బాలీవుడ్ స్టార్ అలియా భట్ ఎట్టకేలకు స్పందించారు. 'గాన్ గర్ల్' సినిమా ట్విస్ట్ గురించి తను ఇచ్చిన సమాధానంపై నెటిజన్లు చేసిన ట్రోల్స్‌కు తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు.

Published on: Feb 28, 2026, 06:24:48 IST
Advertisement

గ్లోబల్ వేదికలపై మన తారలు మెరిసినప్పుడు ప్రశంసలతో పాటు కొన్నిసార్లు విమర్శలు కూడా ఎదురవుతుంటాయి. రీసెంట్‌గా జరిగిన బాఫ్టా 2026 అవార్డుల వేడుకలో తన అందంతో మెస్మరైజ్ చేసిన అలియా భట్ ఓ సినిమాపై చేసిన కామెంట్లతో ట్రోలింగ్‌కు గురైంది.

గాన్ గర్ల్ సినిమా గురించి

ఇంటర్నేషనల్ స్టార్‌ల పోజులు- అలియా భట్‌పై ట్రోలింగ్- నా మెదడు పదేళ్లు వెనక్కి వెళ్లిందంటూ హీరోయిన్ రిప్లై!
ఇంటర్నేషనల్ స్టార్‌ల పోజులు- అలియా భట్‌పై ట్రోలింగ్- నా మెదడు పదేళ్లు వెనక్కి వెళ్లిందంటూ హీరోయిన్ రిప్లై!

ఈ అవార్డు వేడుకల్లో ప్రజెంటర్‌గా అలరించిన అలియా భట్ ఒక ఇంటర్వ్యూలో 'గాన్ గర్ల్' సినిమా గురించి మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా ఈ విషయంపై బాఫ్టా అలియా తన మనసు విప్పారు.

ఏం జరిగిందంటే?

బాఫ్టా 2026 రెడ్ కార్పెట్ మీద ఒక ఇంటర్వ్యూయర్ అలియాను పలకరిస్తూ.. "మీకు బాగా నచ్చిన సినిమా ట్విస్ట్ ఏది?" అని అడిగారు. అలియా భట్ కాస్త తడబడుతూ 'గాన్ గర్ల్' సినిమా పేరు చెప్పారు. ఆ సమయంలో అలియా భట్ ముఖకవళికలు, బాడీ లాంగ్వేజ్ చూసి.. అసలు ఆమె ఆ సినిమా చూశారా? లేదా కావాలనే ఇంటర్నేషనల్ స్టార్‌లా పోజు కొడుతున్నారా? అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు.

"నా మెదడు పదేళ్ల వెనక్కి వెళ్లింది"

ఈ విమర్శలపై ప్రముఖ ఫ్యాషన్ కామెంటేటర్ 'డైట్ సబ్య'తో అలియా భట్ మాట్లాడారు. "దీని గురించి ఇంతగా ఎందుకు చర్చించుకుంటున్నారు? నా ఎక్స్‌ప్రెషన్స్ వల్లేనా?" అని ప్రశ్నించిన అలియా, అసలు ఆ క్షణంలో తన మెదడులో ఏం నడుస్తుందో వివరించారు.

"నిజానికి 'గాన్ గర్ల్' సినిమా విడుదలై పదేళ్లు దాటిపోయింది. నేను ఆ సినిమా చూసి కూడా చాలా కాలమైంది. ఇంటర్వ్యూయర్ ఆ సినిమాలో మోనోలాగ్ గురించి, ఫ్లోర్ క్లీన్ చేసే సీన్ గురించి అడుగుతుంటే.. నా మెదడు ఆ పాత జ్ఞాపకాలను వెతుక్కోవడానికి పదేళ్ల వెనక్కి వెళ్లింది. ఆ సమయంలో నా ముఖంలో కనిపించిన తడబాటు అదే" అలియా భట్ వివరణ ఇచ్చారు.

అంత కూల్ అమ్మాయిని కాదు

ఇదిలా ఉంటే, అలియా భట్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వైఆర్ఎఫ్ (YRF) స్పై యూనివర్స్‌లో వస్తున్న లేడీ ఓరియెంటెడ్ స్పై థ్రిల్లర్ 'ఆల్ఫా' (Alpha)లో అలియా భట్ నటిస్తున్నారు.

కీలక పాత్రలు

ఆల్ఫా సినిమాలో బాబీ డియోల్, శర్వారీ వాఘ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనితో పాటు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో కలిసి 'లవ్ అండ్ వార్' అనే భారీ పీరియడ్ డ్రామాలోనూ అలియా భట్ నటిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe