Alia Bhatt Workout And Diet Before Cannes 2026: ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న 79వ కేన్స్ చలనచిత్రోత్సవాల్లో (Cannes 2026) భారతీయ తారల సందడి మామూలుగా లేదు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ బ్యూటీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో ప్రపంచ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది.
అలియా భట్ ఫిట్‌నెస్ ట్రైనర్ కరణ్ సాహ్నీ

అయితే, రెడ్ కార్పెట్‌పై అలియా భట్ ధరిస్తున్న ఖరీదైన డిజైనర్ డ్రెస్సుల కంటే, వాటిని మోయడానికి ఆమె సిద్ధం చేసిన 'శరీర సౌష్టవం' వెనుక ఉన్న శ్రమ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కేవలం గ్లామర్ మాత్రమే కాదు, ఫిట్‌నెస్ వెనుక ఉన్న అలియా భట్ పక్కా ప్లానింగ్‌ను ఆమె ఫిట్‌నెస్ ట్రైనర్ కరణ్ సాహ్నీ బయటపెట్టారు.
జిమ్మిక్కులు కాదు.. జిమ్‌లో కఠిన కసరత్తులు
అలియా భట్ తన శరీరాన్ని మార్చుకోడానికి ఎంత కష్టపడుతుందో తెలిపే ఒక వీడియోను కరణ్ సాహ్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. "కేన్స్ కోసం అలియా సిద్ధమవుతోంది.. ఫలితం రావాలంటే పని చేయాల్సిందే" అంటూ ఆయన రాసుకొచ్చారు. ఈ వీడియోలో అలియా భట్ 'కాలిస్థెనిక్స్' (Callisthenics) తరహా వర్కౌట్లు చేస్తూ కనిపించింది.
భుజాలు ఎంతో ఆకర్షణీయంగా
ముఖ్యంగా జిమ్నాస్టిక్ రింగ్స్‌పై వేలాడుతూ చేసే వ్యాయామాలు ఆమె భుజాలు, చేతులను టోన్ చేయడానికి ఎంతగానో తోడ్పడ్డాయి. దీనివల్ల అలియా భట్ ధరించే 'స్ట్రాప్‌లెస్','డీప్ నెక్' గౌన్లలో ఆమె భుజాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉపయోగిస్తూ
అంతేకాకుండా, హెవీ డ్యూటీ రెసిస్టెన్స్ బ్యాండ్స్ ఉపయోగిస్తూ స్క్వాట్స్ చేయడం, బరువులు ఎత్తడం వంటివి అలియా భట్ శరీర దృఢత్వాన్ని పెంచాయి. సరదా విషయం ఏంటంటే, ఈవెంట్ల మధ్య దొరికే విరామంలో కూడా ఆమె విశ్రాంతి తీసుకోకుండా, తన పడకగదిలో పైజామాలు ధరించి కూడా బ్యాండ్ వర్కౌట్లు చేశానని అలియా భట్ స్వయంగా కామెంట్ చేయడం గమనార్హం.
తెలుగు ఇంటి చిరుతిండి.. అలియా గ్లో సీక్రెట్!
సాధారణంగా సెలబ్రిటీలు విదేశీ డైట్ ఫాలో అవుతారని మనం అనుకుంటాం. కానీ, అలియా భట్ తన చర్మ సౌందర్యం (స్కిన్ గ్లో) కోసం దేశీ చిట్కానే వాడుతోంది. నెయ్యి, బెల్లం, వేరుశనగ పప్పులతో చేసిన ఒక ప్రత్యేకమైన స్నాక్ తాను రెగ్యులర్‌గా తింటానని అలియా భట్ వెల్లడించింది.
మనకు దొరికే పల్లీ పట్టీ
{{/usCountry}}సాధారణంగా సెలబ్రిటీలు విదేశీ డైట్ ఫాలో అవుతారని మనం అనుకుంటాం. కానీ, అలియా భట్ తన చర్మ సౌందర్యం (స్కిన్ గ్లో) కోసం దేశీ చిట్కానే వాడుతోంది. నెయ్యి, బెల్లం, వేరుశనగ పప్పులతో చేసిన ఒక ప్రత్యేకమైన స్నాక్ తాను రెగ్యులర్‌గా తింటానని అలియా భట్ వెల్లడించింది.
మనకు దొరికే పల్లీ పట్టీ
{{/usCountry}}తెలుగు రాష్ట్రాల్లో మనకు దొరికే పల్లీ పట్టీ లేదా సున్నుండల వంటి పోషక విలువలున్న తిండికి ఇది దగ్గరగా ఉండటం విశేషం. ఈ స్వదేశీ పోషకాలే అలియా భట్ చర్మం నిగనిగలాడటానికి ప్రధాన కారణమని ఆమె చెబుతోంది.
ఐదు లుక్స్.. ఐదు హిట్స్!
ఈసారి కేన్స్‌లో అలియా భట్ మొత్తం ఐదు విభిన్నమైన గెటప్స్‌లో కనిపించి ఫ్యాషన్ మొఘల్స్‌ను ఆశ్చర్యపరిచింది.
పీచ్ తమారా రాల్ఫ్ గౌన్: సుదీర్ఘమైన షిఫాన్ దుపట్టా ట్రైల్‌తో ఆమె ఒక దేవకన్యలా మెరిసింది.
యశ్ పాటిల్ క్రియేషన్: చేతితో పెయింట్ చేసిన ఈ డ్రెస్ ఫ్రెంచ్ రివియెరాకు నివాళిగా నిలిచింది.
తరుణ్ తహిలియాని ఐవరీ ఎన్‌సెంబుల్: ఆధునిక రాచరికపు లుక్‌లో అలియా సిల్క్ చీరలో అదరగొట్టింది.
డానియెల్ ఫ్రాంకెల్ బ్లూ గౌన్: ఒక సిండ్రెల్లాను తలపించేలా ఈ లుక్ సాగింది.
గాలా డిన్నర్ గౌన్: విక్టోరియన్ స్టైల్, భారతీయ బ్రొకేడ్ ఫ్యాబ్రిక్ మేళవింపుతో తరుణ్ తహిలియాని రూపొందించిన ఈ ఆఫ్‌షోల్డర్ గౌన్ హైలైట్‌గా నిలిచింది.
అలియా భట్ ఫొటోలు వైరల్
నిర్విరామంగా సాగిన ఈ కేన్స్ ఫ్యాషన్ ప్రయాణంలో అలియా భట్ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూనే, భారతీయ సంస్కృతిని ప్రపంచ వేదికపై ఘనంగా చాటిచెప్పింది. దీంతో అలియా భట్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. కేన్స్ 2026లో అలియా భట్ చర్మ సౌందర్యం వెనుక ఉన్న రహస్యం ఏమిటి?
అలియా భట్ నెయ్యి, బెల్లం, వేరుశనగ పప్పులతో చేసిన దేశీ స్నాక్‌ను తన డైట్‌లో భాగంగా తీసుకుంటోంది. ఇది ఆమె చర్మానికి సహజమైన మెరుపును ఇస్తోందని ఆమె తెలిపింది.
2. అలియా భట్ ఫిట్‌నెస్ ట్రైనర్ ఎవరు?
కరణ్ సాహ్నీ అలియా భట్ ఫిట్‌నెస్ ట్రైనర్. ఆయన 'ది ట్రైబ్ ఇండియా' కో-ఫౌండర్ కూడా. కాన్స్ కోసం ఆయన అలియాకు ప్రత్యేకమైన ఫంక్షనల్ స్ట్రెంగ్త్, కోర్ స్టెబిలిటీ ట్రైనింగ్ ఇచ్చారు.
3. కేన్స్ 2026లో అలియా ధరించిన ముఖ్యమైన డ్రెస్సులు ఏమిటి?
అలియా తరుణ్ తహిలియాని రూపొందించిన ఐవరీ చీర-గౌన్, తమారా రాల్ఫ్ పీచ్ గౌన్, డానియెల్ ఫ్రాంకెల్ బ్లూ గౌన్ వంటి ఐదు రకాల విభిన్నమైన దుస్తుల్లో మెరిసింది.