...
...
Next Story

Allu Arjun Vizag: వైజాగ్‌లో అల్లు అర్జున్ అభిమానసముద్రం- బన్నీ కారును బైకులపై చేజ్ చేసిన ఫ్యాన్స్- నిలిచిపోయిన ట్రాఫిక్!

Allu Arjun Fans Chase His Car In Vizag: వైజాగ్ ఐనాక్స్ ఇనార్బిట్ మాల్‌లో ఏఏఏ (AAA) సినిమాస్‌ను అల్లు అర్జున్ ఘనంగా ప్రారంభించారు. సముద్ర తీరం తరహాలో విశాఖ వీధులన్నీ అభిమానుల కోలాహలంతో కిటకిటలాడగా, అల్లు అర్జున్ కారును ఫ్యాన్స్ చేజ్ చేయడం, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడం వంటివి జరిగాయి.

Published on: Aug 10, 2026, 14:34:06 IST
Advertisement

Allu Arjun Fans Chase His Car In Vizag: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాకతో విశాఖపట్నం సముద్ర తీరం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. నగరంలోని ఇనార్బిట్ మాల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 'ఏఏఏ సినిమాస్' (AAA Cinemas) మల్టీప్లెక్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన బన్నీకి అభిమానులు అపూర్వ స్వాగతం పలికారు.

కారు చేజింగ్, హ్యాంగ్ అవుట్.. రచ్చ లేపిన ఫ్యాన్స్!

వైజాగ్‌లో అల్లు అర్జున్ అభిమానసముద్రం- బన్నీ కారును బైకులపై చేజ్ చేసిన ఫ్యాన్స్- నిలిచిపోయిన ట్రాఫిక్!
వైజాగ్‌లో అల్లు అర్జున్ అభిమానసముద్రం- బన్నీ కారును బైకులపై చేజ్ చేసిన ఫ్యాన్స్- నిలిచిపోయిన ట్రాఫిక్!

అభిమానుల రద్దీతో బీచ్ రోడ్డు ప్రాంతంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విశాఖ విమానాశ్రయం నుంచి బీచ్ రోడ్డు మీదుగా ఇనార్బిట్ మాల్‌కు వెళ్లే దారిపొడవునా అభిమానులు పండగ వాతావరణం సృష్టించారు. అల్లు అర్జున్ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ను వందలాది మంది అభిమానులు బైక్‌లపై ఛేజ్ చేస్తూ అనుసరించారు.

అభిమానుల ఉత్సాహాన్ని చూసిన అల్లు అర్జున్ కారు సన్‌రూఫ్ నుంచి బయటకు వచ్చి చేతులు ఊపుతూ అభివాదం చేశారు. వైజాగ్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ తొలుత భారీ ర్యాలీ నిర్వహిద్దామని భావించినప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు అనుమతి నిరాకరించారు.

సహకరించాలని అభిమానుల సంఘం సోషల్ మీడియా ద్వారా కోరినప్పటికీ, బన్నీని స్వయంగా చూడాలనే ఆత్రుతతో వేలాది మంది రోడ్లపైకి చేరుకోవడంతో కాసేపు వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భద్రతా సిబ్బంది, పోలీసులు కష్టపడి జనాలను అదుపు చేయాల్సి వచ్చింది.

'గంగోత్రి' జ్ఞాపకాలు..

మల్టీప్లెక్స్ ప్రారంభించిన అనంతరం స్టేజ్‌పై అభిమానులతో అల్లు అర్జున్ ముచ్చటించారు. "నాకు విశాఖతో ఎన్నో ఏళ్ల అనుబంధం ఉంది. గంగోత్రి సినిమా షూటింగ్ కోసం ఇక్కడ రోడ్లపై తిరిగిన రోజులు నాకింకా గుర్తున్నాయి. ఏదో ఒక రోజు ఇక్కడ మాల్ వస్తుందని, అందులో నా మల్టీప్లెక్స్ ఓపెన్ చేస్తానని అప్పట్లో కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు కనీసం బయట కాలు పెట్టలేని పరిస్థితి వచ్చింది" అని అల్లు అర్జున్ చెప్పారు.

అభిమానుల కోసం స్టేజ్ పైనే సెల్ఫీలు!.. 'రాకా' మూవీ అప్‌డేట్!

"నేను నేరుగా 'రాకా' షూటింగ్ స్పాట్ నుంచే ఇక్కడికి వచ్చాను. నా ఫ్యాన్స్‌ను కలవడానికి వైజాగ్ వెళ్లాలని చెప్పి స్పెషల్‌గా బ్రేక్ తీసుకున్నాను. మిమ్మల్ని చూశాక మళ్లీ ముంబై వెళ్లిపోతాను" అని బన్నీ ప్రకటించడంతో హాల్ అంతా ఈలలతో నిండిపోయింది.

అత్యంత భారీ బడ్జెట్‌తో

కాగా ఈ క్రేజీ సైన్స్ ఫిక్షన్ చిత్రం రాకాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ భామ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.

భారీ అంచనాలతో

ఇక భారీ అంచనాలతో తెరకెక్కుతున్న అల్లు అర్జున్, అట్లీ, దీపికా పదుకొణె కాంబో మూవీ రాకా 2027 డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe