...
...
Next Story

M4M: తెలుగులో మర్డర్ మిస్టరీగా ఎం4ఎం- హీరోయిన్‌గా అమెరికన్ నటి- కాన్స్ ఫిల్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్- 5 భాషల్లో రిలీజ్!

M4M Released In 5 Languages: తెలుగులో తెరకెక్కిన మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఎం4ఎంలో అమెరికన్ నటి జో శర్మా హీరోయిన్‌గా చేయడం విశేషంగా మారింది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఇదివరకే ప్రదర్శించిన ఎం4ఎం సినిమాను పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం.

Published on: Apr 7, 2026, 13:55:14 IST
Advertisement

ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో తెరకెక్కిన తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం (M4M – Motive for Murder)’ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అమెరికన్ నటి జో శర్మా, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “M4M (Motive for Murder)” పాన్ ఇండియా సినిమాగా ఐదు భాష‌ల్లో విడుద‌ల కానుంది.

5 భాషల్లో రిలీజ్

తెలుగులో మర్డర్ మిస్టరీగా ఎం4ఎం- హీరోయిన్‌గా అమెరికన్ నటి- కాన్స్ ఫిల్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్- 5 భాషల్లో రిలీజ్!
తెలుగులో మర్డర్ మిస్టరీగా ఎం4ఎం- హీరోయిన్‌గా అమెరికన్ నటి- కాన్స్ ఫిల్ ఫెస్టివల్‌లో స్క్రీనింగ్- 5 భాషల్లో రిలీజ్!

ఈ చిత్రాన్ని డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో నిర్మించారు. మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై, మెక్‌విన్ గ్రూప్ యూఎస్ఏ (McWin Group USA) సహకారంతో ఎం4ఎం సినిమాను రూపొందించారు. భారతదేశంలో ఈ చిత్రాన్ని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ (PVR Inox Pictures) సంస్థ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయనుంది.

పాన్ ఇండియా స్థాయిలో

అమెరికాలో విడుదల బాధ్యతలను టెక్‌ఫ్లిక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ (TekFlix Entertainment), నార్త్ ఇండియా రిలీజ్ హక్కులను జేవీఈఎల్ ఎంటర్‌టైన్‌మెంట్ (JVEL Entertainment) సంస్థలు తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో “ఎం4ఎం” చిత్రం పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శన

థియేటర్లలో విడుదలకు ముందే ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. ప్రముఖ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా పాలయిస్ సీ థియేటర్(Palais C Theatre)లో ప్రైవేట్ స్క్రీనింగ్ నిర్వహించగా, ముంబైలోని ఐఎమ్‌పీపీఏ ప్రీవ్యూ థియేటర్‌లో ప్రత్యేక ప్రదర్శన జరిగింది. ఇలా ప్రదర్శించిన ఎం4ఎం సినిమాకు సినీ వర్గాల నుంచి మంచి స్పందన లభించింది.

హీరోయిన్ జో శర్మా ప్రమోషన్స్

"మే 8న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా ఐదు భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నాం. ప్ర‌పంచవ్యాప్తంగా విడుద‌ల కానుంది. విడుద‌ల‌కు ముందే మా సినిమా కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడటం గర్వకారణం. ఎం4ఎం ప్రీమియర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. థ్రిల్లింగ్ కథనం, సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి" అని దర్శక నిర్మాత మోహన్ వడ్లపట్ల విశ్వాసం వ్యక్తం చేశారు.

తెలుగులో హీరోయిన్‌గా అమెరికన్ నటి

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉత్కంఠభరిత అనుభూతికి గురిచేసే తెలుగు మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా “ఎం4ఎం” ప్రత్యేక గుర్తింపు పొందుతుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అలాగే, తెలుగు సస్పెన్స్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అయిన ఎం4ఎం సినిమాలో అమెరికన్ నటి జో శర్మా హీరోయిన్‌గా చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe