అపర కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ తన 31వ పుట్టినరోజును (ఏప్రిల్ 10) గుజరాత్‌లోని జాంనగర్‌లో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుక కేవలం వినోదానికే పరిమితం కాకుండా, ఆయన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జంతు సంరక్షణ ప్రాజెక్ట్ 'వంటారా' (Vantara) విస్తరణలో భాగంగా 'వంటారా యూనివర్సిటీ'ని కూడా ఇదే వేదికపై ప్రారంభించారు. పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణపై అనంత్ చూపుతున్న శ్రద్ధకు నిదర్శనంగా ఈ విశ్వవిద్యాలయం నిలవనుంది.
భజనలో మునిగిపోయిన రణ్‌వీర్ సింగ్, గౌరీ ఖాన్

సాధారణంగా అంబానీ ఇళ్లలో పార్టీలు అంటే పాశ్చాత్య సంగీతం, డ్యాన్స్‌లు ఉంటాయని అందరూ ఊహిస్తారు. కానీ, అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలు ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తి పారవశ్యంతో సాగడం విశేషం. ఈ వేడుకలో ఏర్పాటు చేసిన భజన కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీతా అంబానీ పక్కనే కూర్చున్న రణ్‌వీర్ పూర్తి భక్తిశ్రద్ధలతో భజన పాడుతూ కనిపించారు.
మరోవైపు షారుఖ్ ఖాన్ సతీమణి గౌరీ ఖాన్, తన కుమారుడు అబ్రామ్ ఖాన్‌తో కలిసి అనంత్ అంబానీ పుట్టినరోజు వేడుకలోని భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. చేతులు జోడించి ప్రశాంతంగా భక్తి గీతాలను వింటున్న గౌరీ ఖాన్ వీడియోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సెలబ్రిటీలు సైతం తమ హోదాలను పక్కన పెట్టి ఆధ్యాత్మికతలో లీనమవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
గర్బా ఆడిన జాన్వీ కపూర్.. కేక్ కటింగ్ సందడి
బాలీవుడ్ బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ కూడా ఈ భజన వేడుకలో సందడి చేశారు. సంప్రదాయబద్ధమైన లాంగ్ స్కర్ట్, టాప్ ధరించిన జాన్వీ కపూర్ భజన సమయంలోనే తోటి అతిథులతో కలిసి గ్రేస్‌ఫుల్‌గా గర్బా డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత రణ్‌వీర్ సింగ్, జాన్వీ కపూర్ కలిసి అనంత్ అంబానీతో కేక్ కట్ చేయించారు. బ్లూ కలర్ ఫార్మల్ సూట్‌లో రణ్‌వీర్ మెరవగా, ఎత్నిక్ వేర్‌లో జాన్వీ చాలా అందంగా మెరిసిపోయారు.
"దేశాన్ని ముందుకు నడిపిస్తాడు": సల్మాన్ ఖాన్ ప్రశంసలు
ఈ పుట్టినరోజు వేడుకలకు బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ కొత్త లుక్‌లో హాజరయ్యారు. సోడాద్దాలు ధరించి విభిన్నమైన స్టైల్లో కనిపించిన సల్మాన్, అనంత్ అంబానీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా అనంత్‌ను ఆకాశానికెత్తేస్తూ సల్మాన్ ఒక పోస్ట్ పెట్టారు.
{{/usCountry}}ఈ పుట్టినరోజు వేడుకలకు బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ కొత్త లుక్‌లో హాజరయ్యారు. సోడాద్దాలు ధరించి విభిన్నమైన స్టైల్లో కనిపించిన సల్మాన్, అనంత్ అంబానీకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా అనంత్‌ను ఆకాశానికెత్తేస్తూ సల్మాన్ ఒక పోస్ట్ పెట్టారు.
{{/usCountry}}"ఒకవేళ మీ జ్ఞాపకశక్తి తక్కువగా ఉంటే ఈ మాటను రాసి పెట్టుకోండి. ఈ వ్యక్తి (అనంత్) భవిష్యత్తులో దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తాడు. మనసు, మేథస్సు ఉన్న అంబానీ మన అనంత్. అతను చాలా స్వచ్ఛమైన మనసు కలిగిన వ్యక్తి" అని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు.
షారుఖ్ ఖాన్ అభినందనలు
అలాగే, కింగ్ ఖాన్ షారుఖ్ సైతం అనంత్ అంబానీకి విషెస్ తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "అనంత్ అంబానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు చేస్తున్న మంచి పనులను ఇలాగే కొనసాగించు. సానుకూల దృక్పథంతో ఉంటూ ప్రజల ముఖాల్లో చిరునవ్వులు నింపుతూ ఉండు. భగవంతుడు నీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలి" అని షారుఖ్ ఖాన్ ఆకాంక్షించారు.