...
...
Next Story

Kavya Anirudh: త్వరలో కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ పెళ్లి? కన్ఫర్మ్ చేసిన బాబాయ్ మహేంద్రన్! ఆయన ఏమన్నారంటే?

Y Gee Mahendran Confirms Kavya Maran Anirudh Ravichander Wedding: ఎస్ఆర్‌హెచ్ సీఈఓ కావ్య మారన్, అగ్ర సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ వివాహం చేసుకోవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో వారి పెళ్లి వార్త నిజమేనంటూ అనిరుధ్ బాబాయ్, సీనియర్ నటుడు వై.జీ. మహేంద్రన్ కన్ఫర్మ్ చేసినట్లు టాక్ నడుస్తోంది.

Published on: Jun 28, 2026, 19:21:03 IST
Advertisement

Y Gee Mahendran Confirms Kavya Maran Anirudh Ravichander Wedding: సోషల్ మీడియాలో గత కొంతకాలంగా వినిపిస్తున్న మోస్ట్ సెన్సేషనల్ రూమర్‌కు ఎట్టకేలకు ఒక క్లారిటీ వచ్చింది. ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సీఈఓ కావ్య మారన్, సౌత్ ఇండియన్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నారనే వార్త ఇప్పుడు చిత్ర పరిశ్రమతో పాటు క్రీడా లోకంలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

అనిరుధ్ బాబాయ్ వ్యాఖ్యలు

త్వరలో కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ పెళ్లి? కన్ఫర్మ్ చేసిన బాబాయ్ మహేంద్రన్! ఆయన ఏమన్నారంటే?
త్వరలో కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ పెళ్లి? కన్ఫర్మ్ చేసిన బాబాయ్ మహేంద్రన్! ఆయన ఏమన్నారంటే?

ఈ ప్రేమ పక్షుల పెళ్లి వ్యవహారంపై ఇప్పటివరకు ఇరు కుటుంబాలు నేరుగా పెదవి విప్పకపోయినప్పటికీ, అనిరుధ్ బాబాయ్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలాన్ని చేకూర్చాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో కావ్య మారన్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ మ్యాచ్ జరుగుతుంటే కెమెరాలన్నీ ఆమె హావభావాల వైపే చూస్తుంటాయి.

టాలీవుడ్ స్టార్ హీరోలకు ఉండే రేంజ్‌లో కావ్యకు ఇక్కడ ఫ్యాన్ బేస్ ఉంది. మరోవైపు అనిరుధ్ సైతం 'జెర్సీ', 'దేవర' వంటి ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఈ ఇద్దరు సెలబ్రిటీలు ఒకటవుతున్నారనే వార్త తెలుగు అభిమానులను ఎంతో ఆకట్టుకుంటోంది.

పెళ్లి వార్తను ధ్రువీకరించిన అనిరుధ్ బాబాయ్

ఈ ఇద్దరి పెళ్లి గురించిన ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో అనిరుధ్ బాబాయ్, ప్రముఖ నటుడు వై.జీ. మహేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒక ప్రముఖ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ పెళ్లి విషయాన్ని దాదాపు ఖరారు చేశారు.

"అనిరుధ్ చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న కుర్రాడు. వాడు ఒక పెద్ద ఇంటికి అల్లుడిగా వెళ్తున్నాడు. నాకు అందిన సమాచారం ప్రకారం ఈ పెళ్లి జరగడం ఖాయం. ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగాయి" అని వై.జీ. మహేంద్రన్ వెల్లడించారు.

కావ్యపై ప్రశంసలు

ఈ ఇద్దరి జోడీ అద్భుతంగా ఉంటుందని, పెళ్లయ్యాక ఇద్దరూ కలిసి మ్యూజిక్ బిజినెస్ రంగంలో అడుగుపెడితే బాగుంటుందని వైజీ మహేంద్రన్ ఆకాంక్షించారు. అయితే పెళ్లి తేదీ, వేదిక వంటి వివరాలను మాత్రం ఆయన దాటవేశారు.

2025 వైరల్ పోస్ట్.. తెరపైకి రజనీకాంత్ రాయబారం!

అనిరుధ్, కావ్య మారన్ డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం ఈనాటిది కాదు. గత ఏడాది (2025) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో ఒక పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది. వీరిద్దరూ ఏడాదికి పైగా ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

అనిరుధ్‌కు బంధువైన సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా రంగంలోకి దిగి, కావ్య తండ్రి కళానిధి మారన్‌తో పెళ్లి సంబంధం మాట్లాడారనే వార్తలు కూడా అప్పట్లో గుప్పుమన్నాయి. అయితే ఆ సమయంలో ఈ వార్తలను అనిరుధ్ కొట్టిపారేశారు. "పెళ్లా? నవ్వకండి.. దయచేసి ఇలాంటి పుకార్లను ప్రచారం చేయడం ఆపండి" అని అనిరుధ్ ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

డేటింగ్‌పై ఇవ్వని స్పష్టత

అప్పట్లో ఆయన పెళ్లి వార్తలను ఖండించినప్పటికీ, కావ్య మారన్‌తో డేటింగ్ చేస్తున్నారా లేదా అనే విషయంపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాగా, కోలీవుడ్‌లో తిరుగులేని మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న అనిరుధ్ రవిచందర్.. 2012లో వచ్చిన '3' సినిమాలోని 'వై దిస్ కొలవెరి డి' పాటతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత రజనీకాంత్, విజయ్, అజిత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సినిమాలకు బ్లాక్‌బస్టర్ ఆల్బమ్స్ అందించారు. ఇటీవల వచ్చిన 'లియో', 'ఇండియన్ 2', 'వేట్టయాన్', 'విడాముయార్చి', 'కూలీ' చిత్రాలతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది.

ఇక కావ్య మారన్ విషయానికొస్తే.. భారతదేశంలోని అతిపెద్ద మీడియా సంస్థల్లో ఒకటైన 'సన్ గ్రూప్' అధినేత కళానిధి మారన్ కుమార్తె. సన్ టీవీ నెట్‌వర్క్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ బాధ్యతలను పూర్తిగా తానై చూసుకుంటున్నారు.

సంగీత సామ్రాజ్యం.. వ్యాపార సామ్రాజ్యాల కలయిక

వ్యాపార, సంగీత రంగాల్లో అగ్రస్థానంలో ఉన్న ఈ ఇద్దరు సెలబ్రిటీలు వైవాహిక బంధంతో ఒకటి కాబోతుండటం ఇరు రంగాల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి ఈ వైరల్ న్యూస్‌పై అనిరుధ్ గానీ, కావ్య గానీ అధికారికంగా ఎప్పుడు స్పందిస్తారో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe