...
...
Next Story

Amri Movie: ఓటీటీ బోల్డ్ మూవీతో క్రేజ్-భారీ బయోపిక్‌లో అంజలి శివరామన్- అమ్రి ఫస్ట్ లుక్ రిలీజ్-నిర్మాతగా ప్రియాంక చోప్రా

Anjali Sivaraman Amri First Look Released: ఆధునిక భారతీయ చిత్రకళా చరిత్రను మలుపు తిప్పిన అమృత షేర్ గిల్ జీవిత కథ బయోపిక్‌గా రానుంది. మీరా నాయర్ తెరకెక్కిస్తున్న అమ్రి చిత్రంలో అంజలి శివరామన్ టైటిల్ రోల్ పోషిస్తుండగా, ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇవాళ అమ్రి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Published on: May 12, 2026, 11:54:07 IST
Advertisement

Anjali Sivaraman Amri First Look Released Today: భారతీయ చిత్రకళా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న 20 శతాబ్ధపు చిత్రకారిణి అమృత షేర్ గిల్. ఇటీవల ఆమె బయోపిక్ తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అమృత షేర్ గిల్ బయోపిక్ పనులు ఇప్పుడు వేగం పుంజుకున్నాయి.

అమృత షేర్ గిల్ బయోపిక్

ఓటీటీ బోల్డ్ మూవీతో క్రేజ్-భారీ బయోపిక్‌లో అంజలి శివరామన్- అమ్రి ఫస్ట్ లుక్ రిలీజ్-నిర్మాతగా ప్రియాంక చోప్రా
ఓటీటీ బోల్డ్ మూవీతో క్రేజ్-భారీ బయోపిక్‌లో అంజలి శివరామన్- అమ్రి ఫస్ట్ లుక్ రిలీజ్-నిర్మాతగా ప్రియాంక చోప్రా

'సలామ్ బాంబే', 'మాన్సూన్ వెడ్డింగ్' వంటి అంతర్జాతీయ స్థాయి చిత్రాలను అందించిన దర్శకురాలు మీరా నాయర్ తన లాంగెస్ట్ డ్రీమ్ ఈ ప్రాజెక్టును 'అమ్రి' (Amri) పేరుతో తెరకెక్కిస్తున్నారు. అమ్రి చిత్రంలో అమృత షేర్ గిల్ పాత్రలో ఎవరో నటిస్తున్నారనే ఆసక్తి అమితంగా పెరిగింది.

ఈ నేపథ్యంలో ఆ ఉత్కంఠకు తెరదించుతూ మంగళవారం (మే 12) అమ్రి సినిమా నుంచి అమృత షేర్ గిల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అమ్రి మూవీలో అమృత షేర్ గిల్ పాత్రలో ఓటీటీ బోల్డ్ మూవీతో క్రేజ్ తెచ్చుకున్న అంజలి శివరామన్ నటిస్తోంది. ఇవాళ అమ్రి నుంచి అంజలి శివరామన్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ లుక్ అచ్చం అమృత షేర్ గిల్‌లాగే ఉంది.

ఓటీటీ బోల్డ్ మూవీ

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సిరీస్ క్లాస్, మూవీ బ్యాడ్ గర్ల్‌తో మంచి క్రేజ్ తెచ్చుకున్న అంజలి శివరామన్ ఈ బయోపిక్‌లో అమృత షేర్ గిల్ పాత్రలో కనిపించడం ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది. అంజలి మాత్రమే కాకుండా ఈ సినిమాలో హాలీవుడ్, బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ కూడా నటించనున్నారట.

మెగా ప్రాజెక్టులో మెరిసిపోనున్న తారలు

ఇక గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్ కూడా ఈ చిత్రంలో 'మేడమ్ అజూరీ' అనే కీలక పాత్ర పోషించడమే కాకుండా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గానూ బాధ్యతలు చేపట్టారు. జిమ్ సర్బ్, అంజనా వసన్ వంటి ప్రతిభావంతులు కూడా ఇందులో ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

చిత్రకారిణి స్ఫూర్తితో దర్శకురాలి ప్రయాణం

లేడీ డైరెక్టర్ మీరా నాయర్ ఈ ప్రాజెక్టును కేవలం ఒక సినిమాగా కాకుండా తన వ్యక్తిగత గౌరవంగా భావిస్తున్నారు. ఈ సందర్భంగా మీనా నాయర్ మాట్లాడుతూ.. "నేను గత కొన్ని దశాబ్దాలుగా తీసిన ప్రతి సినిమా వెనుక అమృత షేర్ గిల్ చిత్రకళా స్ఫూర్తి ఉంది. ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో ఎలా చూడాలో ఆమె నాకు నేర్పారు. భారతీయ సామాన్యుల జీవితాలను ఆమె తన కుంచెతో బంధించిన తీరు నన్ను ఎప్పుడూ కదిలిస్తుంది. యూరోపియన్ శిక్షణ పొందినప్పటికీ భారతీయ ఆత్మను ఆవిష్కరించిన ఆమె ధైర్యమే నా సినిమాలకు మూలం" అని భావోద్వేగంగా పేర్కొన్నారు.

20వ శతాబ్దపు సంచలనం.. అమృత షేర్ గిల్

అమృత షేర్ గిల్ అంటే కేవలం ఒక చిత్రకారిణి మాత్రమే కాదు. 20వ శతాబ్దంలోనే సమాజ కట్టుబాట్లను ఎదురించి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ధైర్యవంతురాలు. పారిస్‌లోని ప్రతిష్టాత్మక 'అకాడెమీ డెస్ బ్యూక్స్-ఆర్ట్స్'లో ప్రవేశం పొందిన అతిపిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించారు.

కేవలం 28 ఏళ్లకే అమృత షేర్ గిల్ కన్నుమూసినా, ఆమె వదిలి వెళ్లిన 'గ్రూప్ ఆఫ్ త్రీ గర్ల్స్', 'ది బ్రైడ్స్ టాయిలెట్' వంటి చిత్రాలు నేటికీ కోట్లాది రూపాయల ధర పలుకుతున్నాయి. భారతీయ మహిళల వాస్తవిక స్థితిగతులను, గ్రామీణ భారతపు సౌందర్యాన్ని ఆమె చూపిన తీరు అద్వితీయం.

హంగేరీ నుంచి భారత్ వరకు షూటింగ్

'అమ్రి' చిత్రం 20వ శతాబ్దపు తొలినాళ్ల నాటి పరిస్థితులను ప్రతిబింబించేలా హంగేరీ, ఫ్రాన్స్, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. మీరా నాయర్‌తో పాటు క్లారా రోయర్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందించారు. మిరాబై, పాపర్‌టౌన్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ భారీ బయోపిక్‌ను నిర్మిస్తున్నాయి.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks