...
...
Next Story

తమిళంలో మంచి ఆదరణ దక్కింది.. తెలుగులో రిలీజ్ చేయాలని డిమాండ్ ఎక్కువైంది.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్

అనుపమ పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ తమిళ చిత్రం బైసన్. చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కబడ్డీ నేపథ్యంలో సాగుతుంది. అక్టోబర్ 24న తెలుగులో బైసన్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన బైసన్ ప్రెస్ మీట్‌లో హీరోయన్ అనుపమ పరమేశ్వరన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Published on: Oct 22, 2025, 12:35:02 IST
Advertisement

వరుసపెట్టి సినిమాలతో దూసుకుపోతోంది బ్యూటిపుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. ఇటీవలే పరదా సినిమాతో పర్వాలేదనిపించుకున్న అనుపమ పరమేశ్వరన్ కిష్కింధపురి వంటి హారర్ థ్రిల్లర్‌తో సక్సెస్ కొట్టింది. ఇప్పుడు తెలుగులో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది అనుపమ పరమేశ్వరన్.

అనుపమ పరమేశ్వరన్ తమిళ చిత్రం

తమిళంలో మంచి ఆదరణ దక్కింది.. తెలుగులో రిలీజ్ చేయాలని డిమాండ్ ఎక్కువైంది.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్
తమిళంలో మంచి ఆదరణ దక్కింది.. తెలుగులో రిలీజ్ చేయాలని డిమాండ్ ఎక్కువైంది.. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్

హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తమిళంలో నటించిన చిత్రం బైసన్. ఈ సినిమాలో చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ విక్రమ్ హీరోగా చేశాడు. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన బైసన్ సినిమా అదివరకే తమిళంలో రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో బైసన్ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.

అనుపమ పరమేశ్వరన్ కామెంట్స్

అక్టోబర్ 24న తెలుగు రాష్ట్రాల థియేటర్లలో బైసన్ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన బైసన్ ప్రెస్ మీట్‌లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ పలు విశేషాలు చెప్పుకొచ్చింది.

మొదటి చిత్రంలో నేను నటించాలి

అనుపమ పరమేశ్వరన్ మాట్లాడుతూ .. "మారి సెల్వరాజ్ గారి మొదటి చిత్రంలో నేను నటించాల్సింది. కానీ, అప్పుడు బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక ఉండేది. ఇప్పుడు ఆయన తీసిన ‘బైసన్’ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. ఈ మూవీతో నేను చాలా నేర్చుకున్నాను" అని అనుపమ పరమేశ్వరన్ తెలిపింది.

డిమాండ్ ఎక్కువైంది

"ధృవ్‌తో నటించడం నాకు గర్వంగా ఉంది. నివాస్ మాకు అద్భుతమైన పాటలు, మ్యూజిక్ ఇచ్చారు. మా మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న జగదంబే బాలాజీ గారికి థాంక్స్. అక్టోబర్ 24న ‘బైసన్’ తెలుగులో రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయాలి" అని కోరారు బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్.

బోస్, బాలాజీ గారి పట్టుదల

ఇదే ఈవెంట్‌లో నీలం స్టూడియోస్ వీపీఆర్ మాట్లాడుతూ .. "మా ‘బైసన్’ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్న బాలాజీ గారికి థాంక్స్. బోస్, బాలాజీ గారి పట్టుదల వల్లే తెలుగులో ఇంత గ్రాండ్‌గా ఈ చిత్రం రాబోతోంది. అందరూ మా సినిమాను తప్పకుండా చూడండి" అని కోరారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks