...
...
Next Story

ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమా- షార్ట్ ఫిల్మ్ కాంబినేషన్‌లో మూవీ- బర్త్‌డేకి ప్రకటన!

టాలీవుడ్ బ్యూటిపుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటిస్తోన్న లేటెస్ట్ మూవీని తాజాగా ఆమె పుట్టినరోజు (ఫిబ్రవరి 18) సందర్భంగా మేకర్స్ ప్రకటించారు. ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఆర్జే షాన్ దర్శకత్వం వహించనున్నారు. ప్రేరణ అరోరా, శివిన్ నారంగ్, కిరణ్ బల్లపల్లి నిర్మాతలుగా ఉన్నారు.

Published on: Feb 19, 2026, 09:06:11 IST
Advertisement

టాలీవుడ్‌ మోస్ బ్యూటిపుల్ హీరోయిన్స్‌లలో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. అందంతోపాటు అదిరిపోయే అభినయంతో ఆకట్టుకునే అనుపమ పరమేశ్వరన్‌కు యూత్‌లో ఫుల్ క్రేజ్ ఉంది. అఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన అనుపమ పరమేశ్వరన్ ప్రేమమ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

పాన్ ఇండియా స్థాయిలో

ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమా- షార్ట్ ఫిల్మ్ కాంబినేషన్‌లో మూవీ- బర్త్‌డేకి ప్రకటన!
ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా అనుపమ పరమేశ్వరన్ కొత్త సినిమా- షార్ట్ ఫిల్మ్ కాంబినేషన్‌లో మూవీ- బర్త్‌డేకి ప్రకటన!

ఇక కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ సంపాదించుకుంది బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్. ఇటీవలే పరదా, కిష్కింధపురి, టిల్లు స్క్వేర్, బైసన్ వంటి చిత్రాలో వరుసగా ఆడియెన్స్‌ను అలరించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటు వివిధ భాషల్లో వరుస సినిమాలతో దూసుుకపోతోంది అనుపమ పరమేశ్వరన్.

సంయుక్త నిర్మాణం

ఇలా పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందిన అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో కొత్త ఫీచర్ ఫిల్మ్‌తో రానుంది. ఎస్‌ కే గీ ఎంటర్‌టైన్‌మెంట్ (Ess Kay Gee Entertainment), బెంచ్‌మార్క్ స్టో రీటెల్లర్స్ (Benchmark Storytellers) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఇంటెన్స్ సైకలాజికల్ థ్రిల్లర్

ఈ చిత్రానికి ఆర్జే షాన్ (RJ Shaan) దర్శకత్వం వహించనుండగా.. శివిన్ నారంగ్, ప్రేరణ అరోరా, కిరణ్ బల్లపల్లి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ప్రముఖ స్టూడియోతో భాగస్వామ్యంగా ఈ సినిమా నిర్మితమవుతుంది. ఈ ప్రాజెక్ట్ ఒక ఇంటెన్స్ సైకాలజికల్ థ్రిల్లర్‌గా రూపొందనుంది.

షార్ట్ ఫిల్మ్ కాంబినేషన్‌లో

గతంలో అనుపమ పరమేశ్వరన్–షాన్ కాంబినేషన్‌లో వచ్చిన షార్ట్ ఫిల్మ్‌కు అద్భుత స్పందన రావడంతో.. ఇప్పుడు అదే జోడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇద్దరి కాంబోలో ఓటీటీ హిట్ తర్వాత బిగ్ స్క్రీన్‌పై ఈ కాంబో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.

అనుపమ పుట్టినరోజు సందర్భంగా

ఇటీవలే 'జటాధర' మూవీని నిర్మించిన ఎస్కేజీ ఎంటర్‌టైన్‌మెంట్ తమ సంస్థ నిర్మాణంను మరింత విస్తరిస్తోంది. నిర్మాత ప్రేరణ అరోరా గతంలో రుస్తుం, టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ, ప్యాడ్ మ్యాన్, పరి వంటి విజయవంతమైన చిత్రాలతో జాతీయ స్థాయి గుర్తింపు పొందారు.

అనుపమ సూపర్ హిట్స్

ఇక అనుపమ పరమేశ్వరన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రేమమ్, కార్తికేయ 2, రాక్షసుడు, టిల్లు స్క్వేర్ వంటి హిట్ సినిమాలతో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో మంచి క్రేజ్ సంపాదించారు. ప్రస్తుతం దక్షిణ భారత సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటీమణుల్లో ఒకరిగా అనుపమ కొనసాగుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe