OTT Survival Action Thriller Apex In Telugu: ప్రస్తుతం వెండితెర యుగం కంటే ఓటీటీ ఎరా ఎక్కువగా ప్రాముఖ్యత సంపాదించుకుంది. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లోకి ఎప్పటికప్పుడు కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. తాజాగా ఓటీటీలోకి సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఒకటి రిలీజ్ అయి అలరిస్తోంది.
ఆస్కార్ అవార్డ్ గెలుచుకున్న

ఆ సినిమానే అపెక్స్. హాలీవుడ్ సర్వైవల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అపెక్స్ అంటే తెలుగులో శిఖరం అనే అర్థం వస్తుంది. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ చార్లిజ్ థెరాన్ మెయిన్ లీడ్ రోల్ చేసింది. గతంలో 'మాన్‌స్టర్' సినిమాకు గాను ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చార్లిజ్ థెరాన్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.
'మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్', 'అటామిక్ బ్లోన్డ్' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చార్లిజ్ థెరాన్ ఇటీవలే ది ఓల్డ్ గార్డ్ 2 ఓటీటీ మూవీలోనూ మెరిశారు. ఇప్పుడు 'అపెక్స్' ద్వారా మరోసారి తన నటనతో మెస్మరైజ్ చేస్తోంది. 'ఎవరెస్ట్' వంటి అద్భుత చిత్రాలను తీసిన బల్తాసర్ కోర్మకూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
అపెక్స్ నటీనటులు
జెరెమీ రాబిన్స్ అందించిన కథను దర్శకుడు బల్తాసర్ కోర్మకూర్ అద్భుతంగా తెరకెక్కించారు. చెర్నిన్ ఎంటర్టైన్మెంట్, ఐఆర్వీకే స్టూడియోస్ వంటి ప్రముఖ బ్యానర్లు సంయుక్తంగా అపెక్స్ చిత్రాన్ని నిర్మించాయి. పీటర్ చెర్నిన్, జెన్నో టోపింగ్ వంటి హేమాహేమీలు నిర్మాతలుగా వ్యవహరించారు.
అపెక్స్ మూవీలో చార్లిజ్ థెరాన్‌తోపాటు టారోన్ ఎగర్టన్ మరో ప్రధాన పాత్ర పోషించాడు. వీరితోపాటు ఎరిక్ బనా, క్యాటిలన్ స్టేసీ, బెస్సీ హోలాండ్, జాక్ గర్ర్‌డ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు. యాక్షన్ అడ్వెంచర్ సర్వైవల్ థ్రిల్లర్‌గా వచ్చిన 'అపెక్స్' ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తోంది.
ప్రియుడిని కోల్పోయిన బాధ నుంచి
ప్రియుడిని కోల్పోయిన బాధలో ఉన్న సాషా అనే యువతి తనను తాను ఓదార్చుకోవడానికి ఆస్ట్రేలియాలోని దట్టమైన అడవుల్లో ఒంటరిగా ప్రయాణం మొదలుపెడుతుంది. అయితే, ఆ ప్రయాణం ఆమె ఊహించని మలుపు తిరుగుతుంది. ఒక క్రూరమైన కిల్లర్ (టారోన్ ఎగర్టన్) ఆమెను తన వేటగా భావించి వెంబడిస్తుంటాడు. ప్రాణాలను కాపాడుకోవడానికి ఆమె చేసిన సాహసాలు, ఆ కిల్లర్ ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టిందనేదే ఈ సినిమా ఇతివృత్తం.
{{/usCountry}}ప్రియుడిని కోల్పోయిన బాధలో ఉన్న సాషా అనే యువతి తనను తాను ఓదార్చుకోవడానికి ఆస్ట్రేలియాలోని దట్టమైన అడవుల్లో ఒంటరిగా ప్రయాణం మొదలుపెడుతుంది. అయితే, ఆ ప్రయాణం ఆమె ఊహించని మలుపు తిరుగుతుంది. ఒక క్రూరమైన కిల్లర్ (టారోన్ ఎగర్టన్) ఆమెను తన వేటగా భావించి వెంబడిస్తుంటాడు. ప్రాణాలను కాపాడుకోవడానికి ఆమె చేసిన సాహసాలు, ఆ కిల్లర్ ఎత్తుగడలను ఎలా తిప్పికొట్టిందనేదే ఈ సినిమా ఇతివృత్తం.
{{/usCountry}}మనుషులను వెంటాడి చంపే సీరియల్ కిల్లర్ దట్టమైన అడవిలోని ఓ రహస్య గుహలో వేలాడదీసి ఉంచుతాడు. ఆ రహస్య గుహలో నగ్నంగా ఎన్నో శవాలు ఉంటాయి. అదే గుహలోకి సాషాను కూడా బంధించి తీసుకొస్తాడు సీరియల్ కిల్లర్. ఆ తర్వాత ఏమైంది? సీరియల్ కిల్లర్‌తో సాషా ప్రాణ పోరాటం ఎలా? చేసిందనేది అపెక్స్‌లో ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్‌గా చూపించారు.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో
ఇంతటి ఎంగేజింగ్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ అపెక్స్ ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ 24 అంటే నిన్నటి నుంచే అపెక్స్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో నిన్న అపెక్స్ ఓటీటీ రిలీజ్ అయింది. గ్లోబల్ ఆడియన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ అపెక్స్ మూవీని ఓటీటీలోకి అందుబాటులోకి తెచ్చారు.
అంటే, డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయిన రోజునే తెలుగులో కూడా వచ్చేసింది అపెక్స్ సినిమా. తెలుగు ప్రేక్షకులు కూడా తమ సొంత భాషలో ఈ అపెక్స్ సినిమాను ఓటీటీలో ఎంజాయ్ చేసే అవకాశం ఉండటంతో మంచి వ్యూయర్‌షిప్ దక్కుతోంది. దీంతో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ ఇంట్రెస్టింగ్ మూవీగా అపెక్స్ నిలిచింది.