...
...
Next Story

Allu Arjun Raaka: అల్లు అర్జున్ రాకా లుక్‌పై ట్రోలింగ్- విక్రమ్ ఐ నుంచి జూనియర్ ఎన్టీఆర్ శక్తి దాకా కాపీ అంటూ సెటైర్లు!

Allu Arjun Raaka Look Trolling On Social Media: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన 44వ పుట్టినరోజు సందర్భంగా రాకా మూవీ ఫస్ట్ లుక్‌తో ప్రేక్షకులను పలకరించారు. అట్లీ దర్శకత్వంలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా రాకా పోస్టర్, బన్నీ లుక్‌పై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఆ వివరాలపై లుక్కేద్దాం.

Published on: Apr 8, 2026, 13:56:38 IST
Advertisement

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే కానుకగా ఈ చిత్రానికి 'రాకా' (Raaka) అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

అల్లు అర్జున్ రాకా లుక్‌పై ట్రోలింగ్- విక్రమ్ ఐ నుంచి జూనియర్ ఎన్టీఆర్ శక్తి దాకా కాపీ అంటూ సెటైర్లు!
అల్లు అర్జున్ రాకా లుక్‌పై ట్రోలింగ్- విక్రమ్ ఐ నుంచి జూనియర్ ఎన్టీఆర్ శక్తి దాకా కాపీ అంటూ సెటైర్లు!

ఈ సందర్భంగా దర్శకుడు అట్లీ ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. "ఇది కేవలం సినిమా కాదు, నాలో ఒక భాగం. దాదాపు 18 ఏళ్లుగా ఈ ఐడియాను నా మనసులోనే దాచుకున్నాను. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ కథ రూపుదిద్దుకుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే," అంటూ అట్లీ తన ఆనందాన్ని పంచుకున్నారు.

గగుర్పాటు కలిగించే లుక్.. బన్నీ రిస్క్ చేస్తున్నారా?

రాకా పోస్టర్‌లో అల్లు అర్జున్ లుక్ అత్యంత భయంకరంగా, ఊహకందని విధంగా ఉంది. కళ్లకు దట్టమైన కాటుక, గుండు, నెరిసిన గడ్డం, మీసాలతో బన్నీ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. అన్నింటికంటే ముఖ్యంగా, అల్లు అర్జున్ ముఖాన్ని తోడేలు తరహాలో ఉండే గోర్ల చేత్తో కవర్ చేసుకోవడం ఈ సినిమా 'సైన్స్ ఫిక్షన్' (Sci-Fi) నేపథ్యమని స్పష్టం చేస్తోంది.

కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉండి, వరుస కమర్షియల్ హిట్లు కొడుతున్న సమయంలో ఇలాంటి డీ-గ్లామర్, ప్రయోగాత్మక పాత్రను ఎంచుకోవడం అల్లు అర్జున్ ధైర్యానికి నిదర్శనమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇది ఒకవైపు అయితే, మరోవైపు రాకా టైటిల్, అల్లు అర్జున్ లుక్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.

'ఐ' నుంచి 'శక్తి' దాకా.. కాపీ ఆరోపణలు!

విక్రమ్ 'ఐ' మూవీ: సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'ఐ' సినిమాలో విక్రమ్ లుక్‌ను ఇది పోలి ఉందని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టులు పెడుతున్నారు.

కార్తీ 'కాశ్మోరా': కార్తీ నటించిన 'కాశ్మోరా' (Kaashmora) సినిమాలోని విలన్ లుక్‌ను అల్లు అర్జున్ కాపీ కొట్టారని కొందరు ఎద్దేవా చేస్తున్నారు.

శక్తి సినిమా విలన్: ఆశ్చర్యకరంగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'శక్తి' సినిమాలో విలన్ పేరు కూడా 'రాకా' (Daniel Kaleb పాత్ర). దీంతో టైటిల్‌తో పాటు లుక్ కూడా అక్కడి నుంచే తీసుకున్నారా? అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మెర్సల్, కాశ్మోరా సినిమాల మిశ్రమమే ఈ 'రాక' అని రెడ్డిట్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో చర్చ నడుస్తోంది.

దీపికా పదుకొణె హీరోయిన్

సన్ పిక్చర్స్ భారీ వ్యయంతో నిర్మిస్తున్న రాకా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటిస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్, దీపికా జోడీ వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు.

2027లో ప్రపంచవ్యాప్తంగా

అయితే, అల్లు అర్జున్-దీపికా పదుకొణె- అట్లీ కాంబినేషన్ మూవీ రాకా 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని సమాచారం.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe