ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా అవతార్ 3. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఇండియాలో డిసెంబర్ 19న థియేటర్లలోకి రానుంది. కానీ, విదేశాల్లో ఈపాటికే అవతార్ 3 ప్రీమియర్ షోలు పడ్డాయి.
భిన్న రకాలుగా టాక్

అవతార్ వంటి బ్లాక్ బస్టర్ సిరీస్‌లో వచ్చిన ఈ మూడో చిత్రంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. కొందరు విమర్శకులు ఈ సినిమాను ‘బోరింగ్’ అని, ఇందులో విషయం లేదని కొట్టిపారేస్తుంటే.. సాధారణ ప్రేక్షకులు మాత్రం ఇది ఒక సరికొత్త అనుభూతి, విజువల్ వండర్ అంటూ పండగ చేసుకుంటున్నారు.
ఇలా ఎన్నో అంచనాలతో రిలీజ్ అవనున్న అవతార్ 3పై షాకింగ్ టాక్ వస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. మరి ఆడియెన్స్ ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారో అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్విటర్ రివ్యూలో తెలుసుకుందాం.
అత్యుత్తమ సినిమాగా
“ఇది సినిమా కాదు, ఒక గొప్ప అనుభూతి. అద్భుతమైన విజువల్స్, మనసును హత్తుకునే కథనంతో ఈ సినిమా సిరీస్‌లోనే అత్యుత్తమంగా నిలుస్తుంది. కాస్త సాగదీసినట్టు అనిపించినా, వెండితెరపై తప్పక చూడాల్సిన చిత్రం” అని ఒక నెటిజన్ తన రివ్యూ ఇచ్చారు.
మరికొందరు ప్రేక్షకులు విలన్ పాత్రల గురించి ఆసక్తికరంగా రాస్తున్నారు. క్వారిచ్‌తో పాటు కొత్త విలన్ వరాంగ్ మధ్య ఉండే కెమిస్ట్రీ బాగుందని అభిప్రాయపడుతున్నారు. “జేమ్స్ కామెరాన్ మమ్మల్ని ఏడిపించేశావ్.. నా ఫేవరెట్ మూవీ ఇదే” అంటూ ఒక సినీ అభిమాని ఎమోషనల్ అయ్యారు.
కొత్త విలన్.. నెక్ట్స్ లెవల్ యాక్షన్
అవతార్ 2లోని విజువల్స్ నచ్చిన వారికి అవతార్ 3 ఇంకా బాగా నచ్చుతుందని కొందరు చెబుతున్నారు. దాదాపు 3 గంటల నిడివి ఉన్నా ఎక్కడా బోర్ కొట్టలేదని, ముఖ్యంగా కొత్త విలన్ వరాంగ్ పాత్ర సినిమాకు హైలైట్ అని నెటిజన్లు పేర్కొంటున్నారు.
{{/usCountry}}అవతార్ 2లోని విజువల్స్ నచ్చిన వారికి అవతార్ 3 ఇంకా బాగా నచ్చుతుందని కొందరు చెబుతున్నారు. దాదాపు 3 గంటల నిడివి ఉన్నా ఎక్కడా బోర్ కొట్టలేదని, ముఖ్యంగా కొత్త విలన్ వరాంగ్ పాత్ర సినిమాకు హైలైట్ అని నెటిజన్లు పేర్కొంటున్నారు.
{{/usCountry}}“వరాంగ్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఆమె నటన, ఆ పాత్రలోని క్రూరత్వం సినిమాకు కొత్త ఊపిరి పోశాయి. అలాగే జేక్ సల్లీ పాత్రను ఈసారి ఒక యోధుడిగా, తండ్రిగా చాలా బలంగా చూపించారు” అని ప్రేక్షకులు విశ్లేషిస్తున్నారు.
3డిలో చూస్తేనే అసలైన మజా!
ఈ సినిమాను సాదాసీదా స్క్రీన్లపై కాకుండా 3D లేదా డాల్బీ అట్మోస్ ఉన్న థియేటర్లలో చూడాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. హై ఫ్రేమ్ రేట్ (HFR) టెక్నాలజీతో విజువల్స్ అత్యద్భుతంగా ఉన్నాయని, 45 నిమిషాల తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్ చూస్తే కళ్లు చెదిరిపోతాయని వివరిస్తున్నారు. హైదరాబాద్‌లోని మైత్రి విమల్ 70ఎమ్ఎమ్ వంటి మాస్ థియేటర్లలో సినిమా చూడటం ఒక ప్యూర్ సినిమాటిక్ మ్యాజిక్ అని లోకల్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
విమర్శకులు ఏమంటున్నారు?
ప్రేక్షకుల నుంచి ఇంతటి పాజిటివ్ స్పందన వస్తున్నా విమర్శకులు మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రముఖ వార్తా సంస్థ హిందుస్థాన్ టైమ్స్ తన రివ్యూలో సినిమాను విమర్శించింది.
“సింపుల్ కథను విజువల్స్‌తో కలిపి చెప్పడంలో జేమ్స్ కామెరాన్ గతంలో సక్సెస్ అయ్యారు. కానీ, ఈసారి ఆయన పట్టు కోల్పోయినట్టు అనిపిస్తోంది. కేవలం కొన్ని విజువల్స్ తయారు చేసి, వాటిని ఎలాగోలా అతికించి ఒక సినిమాగా మార్చినట్టు ఉంది తప్ప ప్రేక్షకులను కట్టిపడేసే బలమైన కథ లేదు” అని హిందూస్తాన్ టైమ్స్ పేర్కొంది.
సినిమా నేపథ్యం
ఇదిలా ఉంటే, 2009లో వచ్చిన ‘అవతార్’, 2022లో వచ్చిన ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఈ రెండు సినిమాలు చెరో 2 బిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు సాధించి చరిత్రలో నిలిచిపోయాయి.
ఇప్పుడు ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ కూడా అదే బాటలో పయనిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది. ఈ సినిమాలో శామ్ వర్తింగ్టన్, జో సల్దానా, స్టీఫెన్ లాంగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 19న అవతార్ 3 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.