Avika Gor On TV Serials Re Entry: బుల్లితెరపై 'బాలికా వధు' (తెలుగులో 'చిన్నారి పెళ్లికూతురు') సీరియల్‌తో ఇంటింటికీ పరిచయమైన నటి అవికా గోర్. ఆ తర్వాత 'ఉయ్యాల జంపాల' చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టి వరస విజయాలు సాధించింది.
చిన్నారి పెళ్లి కూతురు కామెంట్స్

అయితే, గత కొంతకాలంగా పాత్రల ఎంపిక విషయంలో ఈ భామ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. తాజాగా తన కెరీర్, సినిమాల్లో నటించే పాత్రల గురించి బ్యూటిఫుల్ హీరోయిన్ అవికా గోర్ ఆసక్తికర విషయాలు పంచుకుంది.
సినిమాలో ఫర్నిచర్‌లా మారే ఉద్దేశం లేదు!
చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు అవికా గోర్ తెలిపింది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటిగా తనలోని ప్రతిభను నిరూపించుకునే అవకాశం ఉన్న ప్రాజెక్టులకే ఓటు వేస్తున్నట్లు పేర్కొంది.
నా సామర్థ్యాన్ని చూపించేలా
"ప్రేక్షకులు నా నుంచి ఎప్పుడూ మంచి నటనను ఆశిస్తారు. అందుకే సినిమాలో కేవలం ఒక 'ఫర్నిచర్'లా లేదా షోపీస్‌లా మిగిలిపోయే పాత్రలను నేను చేయలేను. ఒక నటిగా నా సామర్థ్యాన్ని చూపించేలా, కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రలనే ఎంచుకుంటాను. కథల ఎంపిక విషయంలో ఇకపై కూడా చాలా కఠినంగా ఉంటాను" అని అవికా గోర్ స్పష్టం చేసింది.
మన తెలుగు చిత్రసీమలోనూ హీరోయిన్లకు కేవలం పాటలకే ప్రాధాన్యమిచ్చే పరిస్థితిపై గతంలో అనేక చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో అవికా గోర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
'ఖత్రోన్ కే ఖిలాడీ 15'లో సందడి
ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సాహసాల ఓటీటీ రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ 15' ద్వారా అవికా గోర్ బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది. గతంలో 2019లో వచ్చిన సీజన్ 9లో పాల్గొన్న ఆమె, ఈసారి అంతకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.
{{/usCountry}}ప్రముఖ దర్శకుడు రోహిత్ శెట్టి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సాహసాల ఓటీటీ రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ 15' ద్వారా అవికా గోర్ బుల్లితెరపైకి రీఎంట్రీ ఇచ్చింది. గతంలో 2019లో వచ్చిన సీజన్ 9లో పాల్గొన్న ఆమె, ఈసారి అంతకంటే ఎక్కువ ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది.
{{/usCountry}}ఈ ఓటీటీ షో మానసికంగా, శారీరకంగా ఎంతో కష్టమైనప్పటికీ, సీజన్ 9తో పోలిస్తే ఈసారి ఎదుర్కొంటున్న స్టంట్లు తనకు పెద్దగా భయం కలిగించలేదని ఆమె చెప్పింది. భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుతూ, ఆగస్టు 7న విడుదల కానున్న ఒక పంజాబీ మ్యూజిక్ వీడియోలో తాను నటించినట్లు వెల్లడించింది.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
దీనితో పాటు మళ్లీ టీవీ సీరియళ్లలోకి కూడా రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని సంకేతాలిచ్చింది అవికా గోర్. సరైన సమయం వచ్చినప్పుడు ఆ వివరాలను అధికారికంగా ప్రకటిస్తానని తెలిపింది. ప్రస్తుతం 'ఖత్రోన్ కే ఖిలాడీ 15' కలర్స్ టీవీతో పాటు జియోహాట్‌స్టార్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
టీవీ సీరియళ్లలోకి రీ ఎంట్రీ
అలాగే, ఇటీవల అగ్లీ స్టోరీ మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించింది అవికా గోర్. ఇందులో హీరోగా నందు చేశాడు. తెలుగు సైకలాజికల్ బోల్డ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన అగ్లీ స్టోరీ సినిమాకు 7.1 ఐఎమ్‌డీబీ రేటింగ్ వచ్చింది. అగ్లీ స్టోరీ సినిమా కూడా జియో హాట్‌స్టార్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. సినిమాలతో అలరించిన అవికా గోర్ ఇప్పుడు మళ్లీ టీవీ సీరియళ్లలోకి రీ ఎంట్రీ ఇవ్వనుండటం ఇంట్రెస్టింగ్‌గా మారింది.