Ayesha Khan Dhurandhars: వారే అసలైన ఓజీ ధురంధర్స్- తెలుగు హీరోయిన్ ఆయేషా ఖాన్ కామెంట్స్- చెంపదెబ్బ కావాలంటూ పోస్ట్!
Ayesha Khan On Dhurandhar 2 Team: బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ‘ధురంధర్ 2’ విజయోత్సవంలో తెలుగు హీరోయిన్ అయేషా ఖాన్ సందడి చేశారు. రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్, సారా అర్జున్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ రాసుకొచ్చారు. చెంపదెబ్బ కూడా కావాలంటూ ఆయేషా ఖాన్ పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ బాలీవుడ్ సెన్సేషన్‌గా మారాడు. రణ్‌వీర్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ధురంధర్ 2’ ప్రభంజనం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ముంబైలో ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్‌లో ‘ధురంధర్‌లోని షరారత్’ సాంగ్ ఫేమ్, టాలీవుడ్ హీరోయిన్ అయేషా ఖాన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ధురంధర్ 2 సినిమా విజయాన్ని ఆస్వాదిస్తూ, చిత్ర బృందంతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఆయేషా ఒక ఎమోషనల్ నోట్ రాశారు.

ఓజీ ధురంధర్స్‌తో
ఓజీ ధురంధర్స్‌తో అంటూ ఆ ఫొటోలను షేర్ చేసినన ఆయేషా ఖాన్ హీరో రణ్‌వీర్ సింగ్ గురించి "నేను మొదటి రోజు నుంచే మీ ఫ్యాన్‌ని. మీరు మరెన్నో విజయాలు అందుకోవాలి" అని పేర్కొన్నారు. దర్శకుడు ఆదిత్య ధర్ గురించి చెబుతూ.. "సార్, మీతో చేసిన ప్రతి సంభాషణ నా జీవితాంతం గుర్తుంటుంది. మీ పనితనం, వ్యక్తిగత జీవితాన్ని మీరు బ్యాలెన్స్ చేసే విధానం చూస్తుంటే ఆశ్చర్యమేస్తుంది. అందుకే దేవుడు మిమ్మల్ని ఇలా దీవించారు" అని ప్రశంసించారు.
సౌమ్య టాండన్ చెంపదెబ్బ కావాలట!
యామీ గౌతమ్ నుంచి ఎంతో నేర్చుకున్నానని, సారా అర్జున్ మెరిసిపోయే నక్షత్రమని ఆయేషా ఖాన్ కొనియాడారు. ఈ నోట్‌లో అయేషా ఖాన్ చేసిన ఒక వ్యాఖ్య అందరినీ నవ్విస్తోంది. సినిమాలో అక్షయ్ ఖన్నాను సౌమ్య టాండన్ కొట్టే ఒక పాపులర్ సీన్‌ను ఉద్దేశించి.. "సౌమ్య మేడమ్, మీతో చెంపదెబ్బ తినేందుకు నేను వెయిట్ చేస్తున్నాను. ఆ దెబ్బ తింటేనే కదా మనం స్టార్ అయిపోయామని తెలిసేది!" అంటూ సరదాగా రాసుకొచ్చారు.
‘షరారత్’తో పెరిగిన క్రేజ్
రణ్‌వీర్ సింగ్ ధురంధర్ సినిమాలో ‘షరారత్’ అనే వెడ్డింగ్ సాంగ్ ఇప్పుడు కూడా సోషల్ మీడియాను ఊపేస్తోంది. కరాచీలో జరిగే ఒక విలాసవంతమైన వివాహ వేడుకలో డ్యాన్సర్లుగా అయేషా ఖాన్, క్రిస్టల్ డిసౌజా చేసిన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. శశ్వత్ సచ్‌దేవ్ సంగీతం అందించిన ఈ పాట యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో దూసుకుపోతోంది.
కన్నీళ్లు తెప్పించిన ప్రయాణం
ఇక తన కెరీర్ గురించి కూడా ఆయేషా ఖాన్ భావోద్వేగంగా స్పందించారు. "నా ప్రయాణం అంత సులభంగా సాగలేదు. కానీ వెనక్కి తిరిగి చూసుకుంటే నా ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. నన్ను నమ్మిన కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్ ఛాబ్రాకు కృతజ్ఞతలు. తప్పులు చేస్తూనే నేర్చుకుంటాను, నా ప్రేక్షకులను గర్వపడేలా చేస్తాను" అని ఆమె మాటిచ్చారు.
ఆయేషా ఖాన్ తెలుగు సినిమాలు
ఇదిలా ఉంటే, ఆయేషా ఖాన్ ‘ముఖచిత్రం’, ‘ఓం భీమ్ బుష్’, ‘మనమే’ వంటి తెలుగు సినిమాల్లోనూ హీరోయిన్‌గా నటించి మెప్పించారు. ఇప్పుడు రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ ఇద్దరు అసలైన ఓజీ ధురంధర్స్ అంటూ పేర్కొన్న ఆయేషా ఖాన్ పోస్ట్ వైరల్ అవుతోంది.
ABOUT THE AUTHORChetupelli Sanjiv Kumarచెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More

E-Paper


