Ayesha Khan Reply To Trolls Amid Arrest: నీట్ (NEET) పరీక్షల లీకేజీ అక్రమాలపై దేశవ్యాప్తంగా సాగుతున్న విద్యార్థి ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ప్రముఖ బాలీవుడ్ నటి, తెలుగు హీరోయిన్ ఆయేషా ఖాన్‌ను ముంబై పోలీసులు వ్యాన్‌లోకి నెట్టి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
ఆయేషాను ఈడ్చుకెళ్లిన పోలీసులు

జులై 22న ముంబై దాదర్‌లో జరుగుతున్న విద్యార్థుల నిరసన ప్రదర్శనలో పాల్గొనేందుకు తన సోదరుడు, స్నేహితులతో కలిసి వెళ్లారు ఆయేషా ఖాన్. అయితే నిరసన ప్రదర్శన ప్రారంభించకముందే పోలీసులు ఆమెను అకారణంగా ఈడ్చుకెళ్లి వోర్లీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
"ఆత్మగౌరవం ముఖ్యం".. ట్రోలర్‌కు రీసౌండింగ్ కౌంటర్!
పోలీసుల కస్టడీకి సంబంధించిన వీడియోలను ఆయేషా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ఒక నెటిజన్ "ఇకపై నీకు బాలీవుడ్‌లో ఎలాంటి అవకాశాలు రావు" అంటూ ఆమెను బెదిరించే ప్రయత్నం చేశాడు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఆయేషా, ఆత్మగౌరవంతో కూడిన ఘాటు సమాధానం ఇచ్చారు.
"నా ఆత్మగౌరవాన్ని కోల్పోవడం కంటే నా కెరీర్‌ను కోల్పోవడానికే సిద్ధంగా ఉన్నాను. ఇలాంటి బెదిరింపులు వేరే ఎవరికైనా ఉపయోగించుకోండి, ధన్యవాదాలు, బై బై" అని ఆయేషా ఖాన్ గట్టిగా బదులిచ్చారు.
పోలీసు వ్యాన్‌లో ఏమి జరిగింది?
తాము శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తే పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆయేషా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దాదర్ నుంచి వోర్లీకి తీసుకెళ్లే క్రమంలో తానెలాంటి తప్పు చేశానో చెప్పమని ఎంత అడిగినా అధికారులు సమాధానం ఇవ్వలేదని వాపోయారు.
"నలుగురైదుగురు మహిళా పోలీసులు నన్ను బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్‌లోకి నెట్టారు. మేము ఏ తప్పు చేశామని అరెస్ట్ చేశారో చెప్పాలని ఎంత అడిగినా వారి నుంచి ఎలాంటి జవాబు లేదు" అని ఆయేషా ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని, కనీస ప్రాథమిక హక్కులను కాలరాస్తూ పౌరులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆమె అన్నారు.
విద్యార్థులు నిరాహార దీక్షలు
{{/usCountry}}"నలుగురైదుగురు మహిళా పోలీసులు నన్ను బలవంతంగా ఈడ్చుకెళ్లి వ్యాన్‌లోకి నెట్టారు. మేము ఏ తప్పు చేశామని అరెస్ట్ చేశారో చెప్పాలని ఎంత అడిగినా వారి నుంచి ఎలాంటి జవాబు లేదు" అని ఆయేషా ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్య హక్కు అని, కనీస ప్రాథమిక హక్కులను కాలరాస్తూ పౌరులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఆమె అన్నారు.
విద్యార్థులు నిరాహార దీక్షలు
{{/usCountry}}నీట్ ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌తో కలిసి విద్యార్థులు నిరాహార దీక్షలు చేపట్టారు.
దీక్ష విరమించిన సోనమ్ వాంగ్‌చుక్
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, పరీక్షా విధానంలో పారదర్శక సంస్కరణలు తీసుకురావాలని దేశవ్యాప్తంగా విద్యార్థి లోకం డిమాండ్ చేస్తోంది. అయితే, తాజాగా సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్షను విరమించుకున్నారు.