...
...
Next Story

Baa Baa Black Sheep Review: బా బా బ్లాక్ షీప్ రివ్యూ- మేఘాలయ అందాలు, సీక్రెట్ బాక్స్ వేట- క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

Baa Baa Black Sheep Review And Rating In Telugu: చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై వేణు దోనేపూడి నిర్మాణంలో తెరకెక్కిన లేటెస్ట్ తెలుగు మూవీ బా బా బ్లాక్ షీప్ అక్టోబర్ 9న థియేటర్లలోకి వచ్చింది. పూర్తిగా మేఘాలయ అందాల నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ కామెడీ ఎలా ఉందో నేటి బా బా బ్లాక్ షీప్ రివ్యూలో చూద్దాం.

Published on: Oct 10, 2026, 11:09:14 IST
Advertisement

Baa Baa Black Sheep Movie Review And Rating In Telugu:

బా బా బ్లాక్ షీప్ రివ్యూ- మేఘాలయ అందాలు, సీక్రెట్ బాక్స్ వేట- క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
బా బా బ్లాక్ షీప్ రివ్యూ- మేఘాలయ అందాలు, సీక్రెట్ బాక్స్ వేట- క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?

టైటిల్: బా బా బ్లాక్ షీప్

న‌టీన‌టులు: టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయె, రాజా ర‌వీంద్ర‌, అక్ష‌య్ లగుసాని, విష్ణు ఓయ్‌, కార్తికేయ‌, విస్మ‌య శ్రీ, మాల్వీ మ‌ల్హోత్రా, స‌మృద్ధి ఆర్య‌ల్‌, శుభలేఖ సుధాకర్, జార్జ్ మరియన్, కె.ఎల్. దామోదర్ ప్రసాద్, శివన్నారాయణ, అనీష్ కురువిల్లా త‌దిత‌రులు

ద‌ర్శ‌క‌త్వం: గుణి మంచికంటి

సంగీతం: ఎల‌క్ట్రానిక్ కిలి, ఆనంద్ (ఆర్కాడొ)

సినిమాటోగ్రఫీ: అజయ్ అబ్రహం జార్జ్

ఎడిటింగ్: విజయ్ ముక్తవరపు

నిర్మాత‌: వేణు దోనేపూడి

బ్యాన‌ర్‌: చిత్రాల‌యం స్టూడియోస్

ర‌న్ టైమ్‌: 135 నిమిషాలు

విడుదల తేది: అక్టోబర్ 9

దర్శకుడు గుణి మంచికంటి తెరకెక్కించిన విభిన్న తెలుగు క్రైమ్ కామెడీ చిత్రం 'బా బా బ్లాక్ షీప్' అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలైంది. అక్షయ్ లగుసాని, విష్ణు ఓయ్, ఉపేంద్ర లిమాయె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ వేణు దోనేపూడి నిర్మించారు.

దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా మేఘాలయ రాష్ట్రంలో పూర్తి సినిమా చిత్రీకరణను చేసుకున్న సినిమాగా బా బా బ్లాక్ షీప్ రికార్డ్ సాధించింది. వినోదంతో పాటు థ్రిల్లింగ్ అంశాలతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరించిందో నేటి బా బా బ్లాక్ షీప్ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

మరోవైపు సత్యనారాయణ అలియాస్ సత్తిపండు (విష్ణు ఓయ్) తన ప్రేయసి మేరి (సమృద్ధి)ని పెళ్లి చేసుకోవడానికి మేఘాలయ వెళ్తాడు. పెళ్లికి ముందు స్నేహితుడు సందీప్ (అక్షయ్ లగుసాని)తో కలిసి పార్టీ చేస్తుండగా పోలీసుల ఎంట్రీతో గందరగోళం నెలకొంటుంది. అక్కడ నుంచి పారిపోయే క్రమంలో కారు ప్రమాదం జరిగి సందీప్‌కు ఒక సీక్రెట్ బాక్స్ దొరుకుతుంది.

సీక్రెట్ బాక్స్‌లో ఏముంది?

ఆ బాక్స్ తీసుకెళ్లిన కాసేపటికే పెళ్లి పందిరిలో గ్యాంగ్‌స్టర్ జాన్ ప్రత్యక్షమై సత్తిపండును, సందీప్‌ను కిడ్నాప్ చేస్తాడు. ఆ బాక్స్ తిరిగి ఇవ్వకపోతే సత్తిపండును ప్రాణాలతో ఉంచనని బెదిరిస్తాడు. స్నేహితుడిని కాపాడుకోవడానికి సందీప్ తన మరో ఫ్రెండ్ జాన్వీ (విస్మయ శ్రీ)తో కలిసి ఆ పెట్టె కోసం వేట మొదలుపెడతాడు. అసలు ఆ సీక్రెట్ బాక్స్‌లో ఏముంది? చివరికి అది దొరికిందా? సత్తిపండు పెళ్లి సజావుగా జరిగిందా? లేదా? అనేది తెలియాలంటే? బా బా బ్లాక్ షీప్ చూడాల్సిందే.

నవ్వుల విందుగా సాగే క్రైమ్ థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లే!

దర్శకుడు గుణి మంచికంటి ఎంచుకున్న క్రైమ్ కామెడీ పాయింట్ చాలా బాగా ఆకట్టుకుంటుంది. కథనం సాగే తీరు, పాత్రల రూపకల్పన ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తాయి. తక్కువ బడ్జెట్ పరిమితులు ఉన్నప్పటికీ, మేఘాలయ ప్రకృతి దృశ్యాలను తెరపై చాలా అందంగా ఆవిష్కరించారు. చాలా వరకు విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.

క్లైమాక్స్ ట్విస్ట్ అలా

క్లైమాక్స్ సన్నివేశాలు, చివరలో ఇచ్చిన సీక్వెల్ మలుపు కథకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. స్క్రీన్‌ప్లేలో పాత్రలు కాస్త ఎక్కువ కావడం, కొన్ని చోట్ల పాత క్రైమ్ కామెడీ సినిమాలను గుర్తుకు తెచ్చేలా ఉండడం చిన్న లోపాలుగా కనిపిస్తాయి. క్లైమాక్స్‌లో ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.

అజ‌య్ అబ్ర‌హం జార్జ్ సినిమాటోగ్ర‌ఫీ బావుంది. మేఘాలయ లోయలను అద్భుతంగా చూపించారు. ఎల‌క్ట్రానిక్ కిలి, ఆనంద్ (ఆర్కాడొ) అందించిన పాట‌లు, నేపథ్య సంగీతం సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా మారింది. స‌మ‌య‌మే ఇంద్ర‌జాలం.. వే వేల.. అజా మేరి జాన్ పాటలు ఆడియెన్స్‌కు రిలాక్స్‌నిస్తాయి.

అక్షయ్ ఎనర్జీ.. ఆకట్టుకునే విష్ణు కామెడీ టైమింగ్!

సందీప్ పాత్రలో అక్షయ్ లగుసాని తన డాన్సులు, ఎనర్జిటిక్ నటనతో చాలా బాగా మెప్పించాడు. సత్తిపండుగా విష్ణు ఓయ్ తనదైన ప్రత్యేకమైన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. 'యానిమల్' ఫేమ్ ఉపేంద్ర లిమాయె గ్యాంగ్‌స్టర్ పాత్రలో తన మార్కు‌తో ఆకట్టుకున్నాడు.

ఫైనల్‌గా చెప్పాలంటే?

ఇక విస్మయ శ్రీ, మాల్వీ మల్హోత్రా, రాజా రవీంద్ర, శుభలేఖ సుధాకర్, టిను ఆనంద్ అందరూ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. ఫైనల్‌గా చెప్పాలంటే అక్కడక్కడ చిన్నపాటి లోపాలున్నప్పటికీ ట్విస్ట్స్ అండ్ టర్న్స్, కామెడీతో మెప్పించే క్రైమ్ కామెడీ సినిమా బా బా బ్లాక్ షీప్.

రేటింగ్: 2.75/5

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks