బాహుబలి ది ఎపిక్ 2 రోజుల కలెక్షన్స్: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి ది ఎపిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద హాట్ టాపిక్‌గా మారింది. బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కంక్లూజన్ వంటి రెండు బ్లాక్ బస్టర్లను ఒకే సినిమాగా బాహుబలి ది ఎపిక్ టైటిల్‌తో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
అడ్వాన్స్ బుకింగ్స్‌తో కలిపి

అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన బాహుబలి ది ఎపిక్ మూవీకి ఓపెనింగ్ కలెక్షన్స్ అదిరిపోయాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌తో కలిపి తొలిరోజున రూ. 10.8 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వచ్చాయి. వీటిలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా రూ. 1.15 కోట్లు వచ్చాయి.
ఏరియాల వారీగా
అలాగే, మొదటి రోజున వచ్చిన రూ. 9.65 కోట్ల నెట్ కలెక్షన్స్‌లలో తెలుగు నుంచి రూ. 7.9 కోట్లు, హిందీ బెల్ట్ ద్వారా రూ. 1.35 కోట్లు, కన్నడ నుంచి 2 లక్షలు, మలయాళం నుంచి 18 లక్షలు, తమిళంలో 2 లక్షల వరకు వసూళ్లు ఉన్నాయి.
రెండో రోజు పడిపోయిన కలెక్షన్స్
ఇక రెండో రోజున అంటే నవంబర్ 1న బాహుబలి ది ఎపిక్ సినిమాకు ఇండియాలో రూ. 7.1 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. అంటే మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజున దారుణంగా బాహుబలి ది ఎపిక్ వసూళ్లు పడిపోయాయి. రెండో రోజు వచ్చిన రూ. 7.1 కోట్లల్లో తెలుగు నుంచి 4.75 కోట్లు, హిందీ ద్వారా 1.65 కోట్లు వచ్చాయి.
26.42 శాతం తగ్గిన వసూళ్లు
అలాగే, తమిళంలో 5 లక్షలు, కన్నడలో 3 లక్షలు, మలయాళం ద్వారా 17 లక్షలుగా రెండో రోజు బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్ ఉన్నాయి. అయితే, తొలి రోజుతో పోలిస్తే రెండో రోజున బాహుబలి ది ఎపిక్ కలెక్షన్స్ 26.42 శాతం పడిపోయాయి. ఇక రెండు రోజుల్లో కలిపి భారతదేశంలో బాహుబలి ది ఎపిక్ సినిమాకు రూ. 17.9 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.
బాహుబలి ది ఎపిక్ థియేటర్ ఆక్యుపెన్సీ
ఇదిలా ఉంటే, రెండో రోజున తెలుగులో బాహుబలి ది ఎపిక్ మూవీకి మొత్తంగా 53.04 శాతం వరకు థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. దీంట్లో ఉదయం 37.34 శాతం, మధ్యాహ్నా 58.56 శాతం, సాయంత్రం 58.02 శాతం, రాత్రి 58.22 శాతంగా బాహుబలి ది ఎపిక్ నవంబర్ 1 థియేటర్ ఆక్యుపెన్సీ ఉంది.
లాంగెస్ట్ రన్‌టైమ్ ఉన్న
{{/usCountry}}ఇదిలా ఉంటే, రెండో రోజున తెలుగులో బాహుబలి ది ఎపిక్ మూవీకి మొత్తంగా 53.04 శాతం వరకు థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది. దీంట్లో ఉదయం 37.34 శాతం, మధ్యాహ్నా 58.56 శాతం, సాయంత్రం 58.02 శాతం, రాత్రి 58.22 శాతంగా బాహుబలి ది ఎపిక్ నవంబర్ 1 థియేటర్ ఆక్యుపెన్సీ ఉంది.
లాంగెస్ట్ రన్‌టైమ్ ఉన్న
{{/usCountry}}కాగా, అర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించిన బాహుబలి ది ఎపిక్ చిత్రం 225 నిమిషాల నిడివితో ఇప్పటివరకు నిర్మించిన లాంగెస్ట్ రన్‌టైమ్ ఉన్న భారతీయ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
బాహుబలి ది ఎపిక్ రోల్స్
ఇక బాహుబలి ది ఎపిక్ మూవీలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, తమన్నా భాటియా ప్రధాన పాత్రల్లో రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, సుబ్బరాజు, అడివి శేష్ ఇతర పాత్రల్లో మెప్పించారు.