క్రాంతి, అవి తేజ్, ప్రదీప్, సుపర్ణ, పవని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఫెయిల్యూర్ బాయ్స్. ఇతర కీలక పాత్రల్లో సుమన్, నాజర్, తనికెళ్ల భరణి నటించారు. ఈ చిత్రాన్ని శ్రీ గురుదక్షిణ మూర్తి ఫిలింస్ బ్యానర్‌పై విఎస్‌ఎస్ కుమార్, ధన శ్రీనివాస్ జామి, లక్ష్మి వెంకట్ రెడ్డి నిర్మించారు.
ఫెయిల్యూర్ బాయ్స్ రిలీజ్ డేట్

వెంకట్ త్రినాథ రెడ్డి ఉసిరిక దర్శకత్వం వహించిన ఫెయిల్యూర్ బాయ్స్ మూవీకి విజయ్ సంగీతం అందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "ఫెయిల్యూర్ బాయ్స్" సినిమా డిసెంబర్ 12వ తేదీన గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమైంది.
బాబు మోహన్ సపోర్ట్
విడుదల తేదీ దగ్గరవుతున్న సమయంలో చిత్ర బృందం ఫెయిల్యూర్ బాయ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కమెడియన్, నటుడు బాబు మోహన్ ఫెయిల్యూర్ బాయ్స్ సినిమాకు సపోర్ట్‌గా నిలిచారు. ఈ సందర్భంగా మూవీకి బెస్ట్ విషెస్ అందించారు.
అద్భుతంగా ఉండబోతుంది
ఫెయిల్యూర్ బాయ్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బాబు మోహన్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈ సినిమా ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ సినిమాకు పాటలు ఎంతో బలాన్ని చేకూరుస్తాయి. ప్రేక్షకులంతా ఇటువంటి సినిమాలను సపోర్ట్ చేసి విజయాన్ని అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాను" అని అన్నారు.
యుద్ధ వీరులు మా నిర్మాతలు
హీరో అవితేజ్ మాట్లాడుతూ.. "ఫెయిల్యూర్ అంటే విజయానికి మరొక మెట్టు. ఫెయిల్యూర్ బాయ్స్ అనే చిత్రం ఒక యుద్ధం అనుకుంటే ఆ యుద్ధంలో యుద్ధ వీరులు మా నిర్మాతలు. ఎందుకంటే ఈ చిత్రానికి వారే హీరోలు" అని అన్నారు.
వెన్నెముకల నిలబడతారు
"ఒక నిర్మాత సంస్థను నడిపించడం అంత సులువైన విషయం కాదు. సినిమాలోని క్వాలిటీ చూస్తే అది మీకు అర్థమవుతుంది. సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. ఒక సినిమాకు నిర్మాత వెన్నెముకల నిలబడతారు. ఈ సినిమాని నిర్మాతలు మాకు అలా నిలబడ్డారు" అని అవి తేజ్ తెలిపారు.
రోజుకు ఒక్క సీన్ మాత్రమే
{{/usCountry}}"ఒక నిర్మాత సంస్థను నడిపించడం అంత సులువైన విషయం కాదు. సినిమాలోని క్వాలిటీ చూస్తే అది మీకు అర్థమవుతుంది. సినిమాను ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీశారు. ఒక సినిమాకు నిర్మాత వెన్నెముకల నిలబడతారు. ఈ సినిమాని నిర్మాతలు మాకు అలా నిలబడ్డారు" అని అవి తేజ్ తెలిపారు.
రోజుకు ఒక్క సీన్ మాత్రమే
{{/usCountry}}"మా చిత్ర దర్శకులు నాకు కథ చెప్పినప్పుడు నాకు సెట్ అవుతుందా లేదా అనుకున్నాను. కానీ, దర్శకులు నన్ను ప్రతి విషయంలో గైడ్ చేస్తూ నాతో సరైన అవుట్ పుట్ వచ్చేలా, నటించేలా చేశారు. రోజుకు ఒక్క సీన్ మాత్రమే ప్లాన్ చేసేవారు" అని అవి తేజ్ పేర్కొన్నారు.
డ్యాన్స్ బాగా చేస్తాడు
"నా స్నేహితుడు ప్రదీప్ ఎంతో టాలెంట్ ఉన్న నటుడు. సెట్‌లో ప్రదీప్ ఉంటే ఆ ఎనర్జీ వేరేలా ఉంటుంది. చాలా బాగా డాన్స్ చేస్తాడు. తనను తాను వెండి తెరపై చూసుకోవాలని ఎన్నో కలలు కన్నాడు. అంత సరదా మనిషి ఈరోజు మన మధ్య లేడు" అని ఎమోషనల్ అయ్యారు హీరో అవి తేజ్.
అతనికి అంకితం
"దయచేసి ఎవరు తమ జీవితంలో జరిగే సంఘటనలకు తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. మీ కుటుంబం గురించి ఆలోచించండి. ఈ సినిమాను అతనికి (ప్రదీప్) అంకితం చేస్తున్నాము" అంటూ అవి తేజ్ తన స్పీచ్ ముగించారు.