...
...
Next Story

OTT Telugu Today: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్- బామ్మ కథతో క్రిమినల్‌ను పట్టుకునే ఎస్సై!

Today OTT Telugu Release Movie: ఓటీటీలోకి ఇవాళ తెలుగు ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ బామ్మ చెప్పిన కథ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఈ సినిమాలో ఒకప్పుడు కామెడీతో అలరించిన బాబు మోహన్, వై విజయ కీలక పాత్రలు పోషించారు. మరి బామ్మ చెప్పిన కథ ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Feb 15, 2026, 14:34:05 IST
Advertisement

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ బాబు మోహన్, నటి వై విజయ కాంబినేషన్‌కు మంచి క్రేజ్ ఉంది. 90స్ సమయంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సీన్స్ చాలా వరకు నవ్వించి మెప్పించాయి. అలాంటి సూపర్ హిట్ కామెడీ కాంబినేషన్ ఓటీటీ తెరపై ఎంట్రీ ఇచ్చింది.

ఓటీటీ ఆడియెన్స్ ముందుకు

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్- బామ్మ కథతో క్రిమినల్‌ను పట్టుకునే ఎస్సై!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన తెలుగు ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్- బామ్మ కథతో క్రిమినల్‌ను పట్టుకునే ఎస్సై!

కామెడీతో నవ్వించిన బాబు మోహన్, వై విజయ సీరియస్ పాత్రలతో ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ బామ్మ చెప్పిన కథ. ఇది ఒక తెలుగు ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. తెలుగులో హారర్, కామెడీ, రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా వంటి తరహా జోనర్లలో సినిమాలు రెగ్యులర్‌గా ఎన్నో వస్తుంటాయి.

ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్

కానీ, ప్యామిలీ క్రైమ్ థ్రిల్లర్ వంటి జోనర్‌లో మూవీస్ రావడం చాలా అరుదు. ఈ బామ్మ చెప్పిన కథలో బాబు మోహన్, వై విజయతోపాటు సాయి సోహన్, వినీషా ప్రధాన పాత్రలు పోషించారు. బాబు మోహన్ ఎస్సై చలపతిగా చేస్తే.. వై విజయ బామ్ జగదాంబగా నటించింది.

బామ్మ చెప్పిన కథ స్టోరీ

నేరం జరగకముందే క్రిమినల్‌ను పట్టుకోవాలనుకునే ఎస్సై చలపతి. అలాంటి చలపతి ప్రతి రోజు ఓ ఇంట్లో జరుగుతన్న నేరాన్ని మాత్రం అరికట్టలేకపోతున్నారంటూ ఓ బామ్మ పోలీస్ స్టేషన్‌లోకు అడుగు పెడుతుంది. తాను రోజు ఓ రాక్షసుడుని చూస్తున్నాంటూ తన పక్కింట్లో జరిగే ప్యామిలీ స్టోరీని చెబుతుంది బామ్మ.

ట్విస్టులు

అయితే, బామ్మ చెప్పిన కథ ట్రైలర్ చూస్తుంటే సినిమా అంతా గృహ హింస, వేధింపులు, క్రైమ్ మిస్టరీ అంశాల చుట్టూ సాగుతుందని తెలుస్తోంది. సమాజంలో జరిగే హత్యలు, దోపిడీలు మాత్రమే కాదు ఇంట్లో భార్యపై భర్త చేసే అఘాయిత్యాలు కూడా నేరాలే అనే అంశంతో బామ్మ చెప్పిన కథ తెరకెక్కినట్లు అర్థమవుతోంది.

బామ్మ చెప్పిన కథ ఓటీటీ రిలీజ్

బామ్మ చెప్పిన కథ సినిమాకు గురు కిరణ్ బత్తుల దర్శకత్వం వహించారు. వీఎస్ విజన్స్ ప్రొడక్షన్ హౌజ్ బ్యానర్‌పై విజయ్ శాంతి శ్రీనివాస్ తాడిపర్తి ఈ సినిమాను నిర్మించారు. అయితే, బామ్మ చెప్పిన కథ ఓటీటీలోకి ఇవాళ (ఫిబ్రవరి 15) వచ్చేసింది.

అతి తక్కువ రన్‌టైమ్

ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఈటీవీ విన్‌లో బామ్మ చెప్పిన కథ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కేవలం 37 నిమిషాల 27 సెకన్ల రన్‌టైమ్‌తో నేడు బామ్మ చెప్పిన కథ ఓటీటీ రిలీజ్ అయింది.

ఈటీవీ విన్ ఓటీటీలో

అయితే, ప్రతివారం అతి తక్కువ నిడివితో సినిమాలు అందించే వీక్లీ ఓటీటీ సిరీస్ ఈటీవీ విన్ కథా సుధాలో భాగంగా బామ్మ చెప్పిన కథ డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. ఫ్యామిలీ డ్రామాతో క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న బామ్మ చెప్పిన కథ మూవీని ఎంచక్కా చూసేయొచ్చు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe