ఓటీటీలోకి ఓ తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ వచ్చేస్తోంది. ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్ డైరెక్టర్ మారుతి నిర్మించిన సినిమా ఇది. త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ కానున్న ఆ తెలుగు చిత్రమే ‘బ్యూటీ’. ఈ సినిమాకు 8.8 ఐఎండీబీ రేటింగ్ ఉంది. ఈ చిత్రం ఏ ఓటీటీలోకి, ఎప్పుడు వస్తుందో ఓ లుక్కేయండి.
బ్యూటీ ఓటీటీ

తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్ బ్యూటీ ఓటీటీలో అడుగుపెట్టనుంది. ఈ కొత్త సినిమా జనవరి 2న డిజిటల్ డెబ్యూ చేయనుంది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో అంకిత్ కొయ్య, నీలఖి, నరేష్ వీకే, వాసుకీ తదితరులు నటించారు. ఈ సినిమాకు ఆర్వీ సుబ్రహ్మణ్యం డైరెక్టర్.
మారుతి ప్రొడ్యూసర్
రాజాసాబ్ సినిమాతో థియేటర్లను షేక్ చేయడానికి వచ్చేస్తున్నాడు డైరెక్టర్ మారుతి. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీ కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు మారుతి. ఈ బ్యూటీ సినిమానే మారుతి నిర్మించాడు. థియేటర్లో ఇది సెప్టెంబర్ 19, 2025న రిలీజ్ అయింది. ఇప్పుడు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి వస్తుంది. ఈ మూవీలో వచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది.
బ్యూటీ స్టోరీ
ప్రాణంగా పెంచుకున్న కూతురు ప్రేమ పేరుతో పారిపోతే ఆ తండ్రి బాధ ఎలా ఉంటుందనే ఎమోషన్ తో తెరకెక్కిన రొమాంటిక్ థ్రిల్లర్ బ్యూటీ. నారాయణ (నరేష్)ది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. క్యాబ్ డ్రైవర్ గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తాడు. అతనికి కూతురు అలేఖ్య (నీలఖి) అంటే ప్రాణం. ఆమె ఏం అడిగినా తెచ్చిస్తుంటాడు.
ప్రేమతో మలుపు
అలేఖ్య లవ్ స్టోరీతో కథలో మలుపు చోటు చేసుకుంటుంది. పెట్ ట్రైనర్ అర్జున్ (అంకిత్)తో నీలఖికి పరిచయం ఏర్పడుతుంది. వీళ్ల పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే ఓ రోజు తన కూతురు, అర్జున్ తో అసభ్యకరంగా వీడియో కాల్ మాట్లాడుతుండటం చూసి తల్లి (వాసుకీ) దెబ్బలు కొడుతుంది. దీంతో అర్జున్, అలేఖ్య ఇంటి నుంచి పారిపోతారు.
{{/usCountry}}అలేఖ్య లవ్ స్టోరీతో కథలో మలుపు చోటు చేసుకుంటుంది. పెట్ ట్రైనర్ అర్జున్ (అంకిత్)తో నీలఖికి పరిచయం ఏర్పడుతుంది. వీళ్ల పరిచయం ప్రేమగా మారుతుంది. అయితే ఓ రోజు తన కూతురు, అర్జున్ తో అసభ్యకరంగా వీడియో కాల్ మాట్లాడుతుండటం చూసి తల్లి (వాసుకీ) దెబ్బలు కొడుతుంది. దీంతో అర్జున్, అలేఖ్య ఇంటి నుంచి పారిపోతారు.
{{/usCountry}}తన కూతురును వెతుక్కుంటూ నారాయణ కూడా వెళ్తాడు. మరోవైపు అమ్మాయిలను లైంగికంగా వేధించే ముఠా ఒకటి ఉంటుంది. ఈ ముఠా నుంచి అలేఖ్యకు ఎదురైన ఇబ్బందులు ఏంటీ? కూతురిని నారాయణ కలుసుకున్నాడా? అన్నది తెలియాలంటే బ్యూటీ మూవీ చూడాల్సిందే. తెలుగులో మంచి రొమాంటిక్ థ్రిల్లర్ చూడాలనుకునే ఓటీటీ ఆడియన్స్ కు బ్యూటీ మంచి ఆప్షన్.