...
...
Next Story

OTT Thrillers: ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన బెస్ట్ 6 థ్రిల్లర్స్- వేర్వేరు జోనర్లు- ప్రియమణి క్రైమ్ టు హారర్ సర్వైవల్!

Must Watch OTT Thrillers To This Weekend: వీకెండ్‌లో ఇంటిల్లిపాదీ కలిసి లేదా ఒంటరిగా ఉత్కంఠభరితమైన థ్రిల్లర్లు చూడాలనుకుంటున్నారా? జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్, జీ5లలో 6 బెస్ట్ సినిమాలు, సిరీస్‌లు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. వాటి ఐఎమ్‌డీబీ రేటింగ్స్, జోనర్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

Published on: Nov 21, 2026, 14:39:43 IST
Advertisement

Best 6 OTT Thrillers To Watch This Weekend: వీకెండ్ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల సినీ ప్రియుల చూపు ఓటీటీ వేదికల వైపే ఉంటుంది. రొటీన్ కమర్షియల్ సినిమాల కంటే సీటు అంచున కూర్చోబెట్టే క్రైమ్, సస్పెన్స్, హారర్, సైకలాజికల్ థ్రిల్లర్లను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. అలాంటి వారి కోసం మంచి ఐఎమ్‌డీబీ (IMDb) రేటింగ్ సాధించిన బెస్ట్ 6 ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి.

జియో హాట్‌స్టార్‌లో హారర్, సర్వైవల్ థ్రిల్లర్ల సందడి

అబ్సెషన్ (Obsession - ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.8):

ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన బెస్ట్ 6 థ్రిల్లర్స్- వేర్వేరు జోనర్లు- ప్రియమణి క్రైమ్ టు హారర్ సర్వైవల్!
ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన బెస్ట్ 6 థ్రిల్లర్స్- వేర్వేరు జోనర్లు- ప్రియమణి క్రైమ్ టు హారర్ సర్వైవల్!

అమెరికన్ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ ఇది. బేర్ అనే యువకుడు 'వన్ విష్ విల్లో' వద్ద నిక్కీ అనే అమ్మాయి ప్రేమను కోరుకుంటాడు. ఆ కోరిక నెరవేరినా, నిక్కీ ప్రవర్తన విపరీతమైన వ్యామోహంగా (Obsession) మారడంతో కథ ప్రమాదకర మలుపు తిరుగుతుంది. జియో హాట్‌స్టార్‌లో తెలుగు భాషలోనూ అబ్సెషన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

యెల్లోజాకెట్స్ (Yellowjackets - ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.7):

ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన సైకలాజికల్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఇది. హైస్కూల్ బాలికల సాకర్ జట్టు ప్రయాణిస్తున్న విమానం కెనడాలోని దట్టమైన, నిర్మానుష్య అడవుల్లో కూలిపోతుంది. ఆ ఘోర ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన అమ్మాయి, అడవిలో బతికేందుకు చేసే పోరాటమే ఈ కథ. ఇటీవలే జియో హాట్‌స్టార్‌లో ఈ సిరీస్ నాలుగో సీజన్ ఓటీటీ రిలీజ్ అయింది. ప్రస్తుతం నాలుగో సీజన్ మొదటి ఎపిసోడ్ అందుబాటులో ఉంది.

ఇంకార్ (Inkaar - ఐఎమ్‌డీబీ రేటింగ్: 6.1):

అర్జున్ రాంపాల్, చిత్రాంగద సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ రొమాంటిక్ థ్రిల్లర్ 'ఇంకార్'. కార్పొరేట్ ప్రపంచంలోని రాజకీయాలు, ఉన్నత శిఖరాలకు చేరాలనే ఆశయాలు, పని ప్రదేశంలో ఎదురయ్యే వేధింపుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇటీవలే జియో హాట్‌స్టార్ లైబ్రరీలో ఈ సినిమా చేరింది.

నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోల్లో ఇన్వెస్టిగేటివ్ మజా

ది బ్లూ రోడ్ (The Blue Road - ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.4):

తెలుగు ఓటీటీ ప్రేక్షకులు మలయాళ క్రైమ్ థ్రిల్లర్లను ఎప్పుడూ ఆదరిస్తుంటారు. సంజాద్ పీఎస్ దర్శకత్వంలో వచ్చిన మలయాళ కాప్ డ్రామా థ్రిల్లర్ 'గోళం' అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఓ ఐటీ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) అనుమానాస్పద మరణం చుట్టూ సాగే పోలీసు దర్యాప్తు ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది.

జీ5లో ప్రియమణి, అర్జున్ రాంపాల్ సస్పెన్స్ డ్రామా

బ్లైండ్ గేమ్ (Blind Game - ఐఎమ్‌డీబీ రేటింగ్: 5.7): తెలుగు హీరోయిన్, జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి, బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటించిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ బ్లైండ్ గేమ్. 2014లో వచ్చిన మలయాళ సూపర్ హిట్ చిత్రం 'సెవెన్త్ డే' (7th Day) ఆధారంగా దీన్ని తెరకెక్కించారు. మనాలిలో రూ. 5 కోట్ల నగదు మాయం కావడం, ఓ మిస్టరీ డెత్, సస్పెండ్ అయిన పోలీస్ అధికారి విచారణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. జీ5 (ZEE5)లో బ్లైండ్ గేమ్ ఓటీటీ రిలీజ్ అయింది.

3 ఓటీటీల్లో

హారర్ నుంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ల వరకు విభిన్న జోనర్లలో ఉన్న ఈ బెస్ట్ 6 థ్రిల్లర్ సినిమాలు, సిరీస్‌లు వీకెండ్‌లో మంచి వినోదాన్ని అందిస్తాయి. అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 ఓటీటీల్లో వీటిని ఎంచక్కా చూసేయొచ్చు.

 

ABOUT THE AUTHOR

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks