...
...
Next Story

మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్- కొత్త సంవత్సరంలో ఓటీటీలో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు ఇవే- తెలుగులో 4 స్ట్రీమింగ్!

మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ 2026 రానుంది. ఈ సందర్భంగా కొత్త సంవత్సరంలో పలు ఇంట్రెస్టింగ్ ఓటీటీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. సైన్స్ ఫిక్షన్ నుంచి కోర్టు రూమ్ డ్రామాల వరకు ఆ ఓటీటీ సినిమాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్‌లో ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Dec 31, 2025, 18:47:28 IST
Advertisement

2025 ఏడాది ముగింపుకు చేరుకుంది. మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ 2026 వచ్చేయనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీ సంస్థలు సరికొత్త వినోదంతో రెడీగా ఉన్నాయి. థ్రిల్లర్స్, రొమాంటిక్ డ్రామాలు, యాక్షన్ సినిమాలు.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ ఓటీటీ సినిమాలు ఉన్నాయి. ఈ న్యూ ఇయర్ ఓటీటీలో చూడాల్సిన ది బెస్ట్ సినిమాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

స్ట్రేంజర్ థింగ్స్ 5 ఓటీటీ

మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్- కొత్త సంవత్సరంలో ఓటీటీలో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు ఇవే- తెలుగులో 4 స్ట్రీమింగ్!
మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్- కొత్త సంవత్సరంలో ఓటీటీలో చూడాల్సిన 7 బెస్ట్ సినిమాలు ఇవే- తెలుగులో 4 స్ట్రీమింగ్!

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్న 'స్ట్రేంజర్ థింగ్స్' సీజన్ 5 ఫినాలే ఎపిసోడ్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. హాకిన్స్‌ను రక్షించేందుకు వెక్నాతో సాగే ఈ చివరి పోరాటం సైన్స్ ఫిక్షన్ ప్రియులకు పండుగే అని చెప్పాలి. ఈ ఫ్రాంఛైజీ మొత్తం న్యూ ఇయర్‌లో చూసేందుకు బెస్ట్ ఆప్షన్. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది.

నెట్‌ఫ్లిక్స్‌లో సరికొత్త థ్రిల్

మలయాళ మిస్టరీ థ్రిల్లర్ 'ఎకో' డిసెంబర్ 31న నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. తెలుగులో కూడా ఓటీటీ రిలీజ్ అయిన ఎకో మూవీ అడవుల మధ్య సాగే ఈ కథ. అందులో దాగి ఉన్న రహస్యాలు ఆడియన్స్‌ను ఉత్కంఠకు గురిచేస్తాయి.

లవ్ ఫ్రమ్ 9 టు 5 ఓటీటీ

ఇక ఆఫీస్ పాలిటిక్స్, ప్రేమ నేపథ్యంలో సాగే సినిమా 'లవ్ ఫ్రమ్ 9 టు 5'. జనవరి 1 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో లవ్ ఫ్రమ్ 9 టు 5 ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ప్రస్తుతానికి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో ఈ సినిమా ఓటీటీలోకి రానుంది.

కోర్టు రూమ్ డ్రామా ‘హక్’

యామీ గౌతమ్, ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రల్లో నటించిన 'హక్' (Haq) జనవరి 2న నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తోంది. చారిత్రాత్మక షా బానో కేసు ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం, సామాజిక అంశాలపై గంభీరమైన చర్చను లేవనెత్తుతుంది. ఈ సినిమా కూడా చూసేందుకు మంచి ఎంపిక.

మోగ్లీ ఓటీటీ

దీంతోపాటు తమిళ స్పోర్ట్స్ డ్రామా 'లవ్ బియాండ్ వికెట్' కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుంది. జియో హాట్‌స్టార్‌లో జనవరి 1న ఎల్‌బీడబ్ల్యూ ఓటీటీ ప్రీమియర్ కానుంది. తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న ఈ సిరీస్ మంచి వినోదం అందించనుంది.

120 బహదూర్ ఓటీటీ

దేశభక్తి నేపథ్యంలో ఫర్హాన్ అఖ్తర్ నటించిన వార్ డ్రామా '120 బహదూర్' జనవరి 16న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. 1962 నాటి రెజాంగ్‌లా యుద్ధ వీరుల సాహస గాథను ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపించనుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe