బిచ్చగాడు సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఆయన సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉంది. అందుకే ఆయన ప్రతి సినిమాను తమిళంతోపాటు తెలుగులోనూ థియేట్రికల్ రిలీజ్ చేస్తుంటారు. ఇక పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి.
పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో

సస్పెన్స్, క్రైమ్, రొమాంటిక్, హారర్, కామెడీ వంటి రెగ్యులర్ జోనర్స్‌లో కాకుండా పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కించే సినిమాల్లో డ్రామా బాగా ఎలివేట్ అయింతే మూవీ అంతలా ఆదరణ పొందుతుంది. అలాంటి సినిమానే భద్రకాళి. ఈ సినిమా తమిళంలో శక్తి తిరుమగన్‌గా తెరకెక్కింది. తెలుగులో మాత్రం సెప్టెంబర్ 19న భద్రకాళి టైటిల్‌తో రిలీజ్ చేశారు.
బ్రోకర్‌గా హీరో విజయ్ ఆంటోనీ
విజయ్ ఆంటోనీ బ్రోకర్‌గా నటించిన భద్రకాళి సినిమాలో హరిణి సుందరరాజన్, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపాలనీ, రవీంద్ర, సెల్ మురుగన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అరుణ్ ప్రభు కథ, దర్శకత్వం వహించిన భద్రకాళి సినిమాను విజయ్ ఆంటోనీ కార్పొరేషన్ బ్యానర్‌పై హీరో విజయ్ ఆంటోనీ నిర్మాతగా నిర్మించారు.
800 కోట్ల భూ స్కామ్ చుట్టూ
భద్రకాళి సినిమా రూ. 800 కోట్ల భూమి స్కామ్, ఓ బ్రోకర్ చుట్టూ సాగే కథగా తెరకెక్కింది. కేంద్ర మంత్రికి సంబంధించిన 800 కోట్లను పట్టుకునే క్రమంలో బ్రోకర్ దగ్గరి నుంచి వేల కోట్లు బయటపడటం వంటి ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో భద్రకాళి మూవీ మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.5 రేటింగ్ వచ్చింది.
భద్రకాళి ఓటీటీ స్ట్రీమింగ్
మరి ఇలాంటి భద్రకాళి ఓటీటీలోకి వచ్చేయనుంది. అది కూడా మరికొన్ని గంటల్లో భద్రకాళి ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. జియో హాట్‌స్టార్‌లో రేపటి నుంచి అంటే అక్టోబర్ 24 నుంచి భద్రకాళి ఓటీటీ ప్రీమియర్ కానుంది. శుక్రవారం అర్థరాత్రి నుంచే భద్రకాళి మూవీని డిజిటల్ స్ట్రీమింగ్ చేయనుంది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.
నాలుగు భాషల్లో రిలీజ్
{{/usCountry}}మరి ఇలాంటి భద్రకాళి ఓటీటీలోకి వచ్చేయనుంది. అది కూడా మరికొన్ని గంటల్లో భద్రకాళి ఓటీటీ స్ట్రీమింగ్ అవనుంది. జియో హాట్‌స్టార్‌లో రేపటి నుంచి అంటే అక్టోబర్ 24 నుంచి భద్రకాళి ఓటీటీ ప్రీమియర్ కానుంది. శుక్రవారం అర్థరాత్రి నుంచే భద్రకాళి మూవీని డిజిటల్ స్ట్రీమింగ్ చేయనుంది డిస్నీ ప్లస్ హాట్‌స్టార్.
నాలుగు భాషల్లో రిలీజ్
{{/usCountry}}అంతేకాకుండా భద్రకాళి నాలుగు భాషల్లో డిజిటల్ ప్రీమియర్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వంటి నాలుగు భాషల్లో భద్రకాళి ఓటీటీ రిలీజ్ కానుంది. తమిళంలో భద్రకాళి మూవీ శక్తి తిరుమగన్ టైటిల్‌తో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది.
జియో హాట్‌స్టార్ ఓటీటీలో
భద్రకాళి ఒక డిఫరెంట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. తన తెలివితేటలతో ఓ పవర్ బ్రోకర్ రాజకీయ నాయకులను ఎలా శాసించాడో చెప్పే కథ ఇది. మంచి పొలిటికల్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు భద్రకాళి సినిమాను జియో హాట్‌స్టార్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.