OTT Comedy: ఓటీటీలోకి వచ్చిన డార్క్ కామెడీ థ్రిల్లర్- బార్‌లో మద్యం తాగే భార్యలు, అంతుచిక్కని రహస్యాలు- ఎక్కడ చూడాలంటే?

Bibi Payra OTT Streaming: వైవాహిక జీవితంలో విసిగిపోయి సరికొత్త నిర్ణయాలు తీసుకున్న ఇద్దరు మహిళల కథతో తెరకెక్కిన డార్క్ కామెడీ థ్రిల్లర్ సినిమా బిబి పాయ్‌రా ఓటీటీలోకి వచ్చేసింది. స్వాస్తిక ముఖర్జీ, పావలి దామ్ లీడ్ రోల్స్ చేసిన బిబి పాయ్‌రా ఓటీటీ స్ట్రీమింగ్ ఎక్కడో ఇక్కడ తెలుసుకుందాం.

Published on: Jun 7, 2026, 15:25:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Dark Comedy Thriller Bibi Payra OTT Release: చలనచిత్ర రంగంలో మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలకు, వినూత్నమైన కథాంశాలకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రాంతీయ భాషల్లో వస్తున్న విలక్షణమైన ప్రయోగాలు ఓటీటీల పుణ్యమా అని భాషా బేధం లేకుండా దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.

ఓటీటీలోకి వచ్చిన డార్క్ కామెడీ థ్రిల్లర్- బార్‌లో మద్యం తాగే భార్యలు, అంతుచిక్కని రహస్యాలు- ఎక్కడ చూడాలంటే?
ఓటీటీలోకి వచ్చిన డార్క్ కామెడీ థ్రిల్లర్- బార్‌లో మద్యం తాగే భార్యలు, అంతుచిక్కని రహస్యాలు- ఎక్కడ చూడాలంటే?

అంతుచిక్కని రహస్యాలు

ఈ క్రమంలోనే థియేటర్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్న లేటెస్ట్ బెంగాలీ డార్క్ కామెడీ థ్రిల్లర్ చిత్రం 'బిబి పాయ్‌రా' (Bibi Payra) ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. బార్‌లో మద్యం తాగే ఇద్దరి భార్యల చుట్టూ, వారి జీవితాల్లోని అంతు చిక్కని రహస్యాలతో ఈ సినిమా సాగుతుంది.

ఆ ఇద్దరి తిరుగుబాటు.. హద్దులు దాటిన సాహసం

బిబి పాయ్‌రా సినిమా కథాంశం చాలా ఆసక్తికరంగా సాగుతుంది. సమాజంలోనూ, కుటుంబంలోనూ తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతూ, నిరుత్సాహకరమైన వైవాహిక జీవితాలను గడుపుతున్న ఇద్దరు సాధారణ మహిళల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

రోజువారీ జీవితంలోని ఒత్తిడి, భర్తల ప్రవర్తనతో విసిగిపోయిన వీరు ఒకానొక దశలో తమ జీవితాలను తమ చేతుల్లోకి తీసుకోవాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. తమ గమ్యాన్ని మార్చుకోవడానికి వారు వేసిన అడుగులు, తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఊహించని మలుపులు తిరుగుతాయి.

డార్క్ కామెడీ శైలీలో

స్వతంత్రంగా బతకాలనే ఆశతో వారు వేసిన ప్లాన్ కాస్తా మిస్ ఫైర్ అయి, గందరగోళ పరిస్థితులకు దారితీస్తుంది. ఈ క్రమంలో జరిగే పొరపాట్లు, ఎదురయ్యే ఇబ్బందులను దర్శకుడు అత్యంత వినోదాత్మకంగా, డార్క్ కామెడీ (Dark Comedy) శైలిలో తెరకెక్కించారు.

ఈ ప్రయాణంలో వారికి అనుకోని వ్యక్తులు సహాయం చేయడంతో కథ మరింత రసవత్తరంగా మారుతుంది. అయితే, వారు సాధించాలనుకున్న స్వేచ్ఛ చివరికి ఎలాంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీసిందనేది ఈ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

వెండితెరపై నటీనటుల మెరుపులు

ఈ చిత్రానికి ప్రధాన బలం ఇందులోని స్టార్ కాస్టింగ్ అనే చెప్పాలి. టాలెంటెడ్ నటీమణులు స్వాస్తిక ముఖర్జీ, పావలి దామ్ తమ నటనతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లారు. వీరితో పాటు రూపాలీ రాయ్ భట్టాచార్య, భబాని బోస్ ముఖర్జీ, అనిర్బన్ చక్రవర్తి, అనింద్య సేన్‌గుప్తా, సుబ్రత్ దత్తా, లోక్‌నాథ్ డే, అంకిత మాఝీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించారు.

బాక్సాఫీస్ నుంచి ఓటీటీ దాకా

మధ్యతరగతి జీవితాల్లోని రహస్యాలను, సమాజపు వైరుధ్యాలను ఈ పాత్రల ద్వారా దర్శకుడు అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఐఎమ్‌డీబీ నుంచి పదికి 6.6 రేటింగ్ సొంతం చేసుకుంది.

ఇలాంటి బిబి పాయ్‌రా ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ప్రముఖ బెంగాలీ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ హోయ్‌చోయ్‌లో బిబి పాయ్‌రా ఓటీటీ రిలీజ్ అయింది. జూన్ 5 నుంచి హోయ్‌చోయ్‌లో బిబి పాయ్‌రా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

హోయ్‌చోయ్ ఓటీటీలో

ప్రస్తుతం కేవలం ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో బెంగాలీ భాషలో మాత్రమే బిబి పాయ్‌రా ఓటీటీలో అందుబాటులో ఉంది. థియేటర్లలో మిస్ అయిన వారు సస్పెన్స్, డార్క్ హ్యూమర్, మహిళా సాధికారిత వంటి అంశాలతో సాగే బిబి పాయ్‌రా సినిమాను హోయ్‌చోయ్ ఓటీటీలో ఎంచక్కా చూసేయొచ్చు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More