Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ తెలుగు 10 సీజన్లో మరో భారీ ట్విస్ట్. ఈ సీజన్ కు అంతకుముందున్న సీజన్లలా కాకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేశామని మేకర్స్ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు. ఎంత ఊహించినా కూడా దానికి మించి గేమ్ ఉంటుందనే పబ్లిసిటీ చేస్తున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ 10 తెలుగు షో చూస్తే అదే నిజమనిపిస్తోంది.
కెప్టెన్ వర్షిణి

బిగ్ బాస్ 10 తెలుగు నాలుగో సీజన్ కెప్టెన్ గా వర్షిణి బాధ్యతలు తీసుకుంది. అసలు కెప్టెన్సీ కంటెండర్ లాస్ట్ టాస్క్ లో అమన్ గెలిచాడు. నిజానికి అమన్ కెప్టెన్ కావాలి. ఆ టాస్క్ గెలిచిన తర్వాత అమన్ గట్టిగట్టిగా విజయనాదం కూడా చేశాడు. కానీ అప్పుడే బిగ్ బాస్ ఓ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చాడు.
మ్యాజిక్ కీ
బిగ్ బాస్ 10 తెలుగు నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ కంప్లీట్ కాగానే హౌస్ లోకి బిగ్ బాస్ ఓ మ్యాజిక్ కీ పంపించాడు. అది వర్షిణికి చెందిన పవర్ కు సంబంధించిన మ్యాజిక్ కీ. ఆ కీతో వర్షిణి తన పవర్ ను అన్ లాక్ చేసింది. గెలిచిన వాళ్ల విక్టరీని దక్కించుకోవడమే ఆ పవర్. ఆ పవర్ ను వాడుకున్న వర్షిణి.. అమన్ విక్టరీని తీసుకొని ఇంటి కెప్టెన్ అయింది.
బిగ్ బాస్ ఓటింగ్
మరోవైపు బిగ్ బాస్ 10 తెలుగు అనషిఫియల్ ట్రెండ్స్ ప్రకారం ఓటింగ్ లోనూ భలే ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్లు మారుతూనే ఉన్నారు. ఈ నాలుగో వారం నామినేషన్లలో మొత్తం తొమ్మిది మంది ఉన్నారు. త్రిగుణ్, రోహిత్, ముఖేష్, శాలిని, చరణ్, సృష్టి, నరేష్, దేబ్జానీ, అమన్ నామినేషన్లలో ఉన్నారు.
ఈ తొమ్మిది మంది కంటెస్టెంట్ల నుంచి ఈ వారం ఒకరు ఎలిమినేట్ కావాల్సిందే. ఫస్ట్ సృష్టి డేంజర్ జోన్లోకి వెళ్లింది. ఆ తర్వాత మారిన ఓటింగ్ ట్రెండ్ తో దేబ్జానీ ఎలిమినేషన్ కు దగ్గరైంది. ఇప్పుడేమో అమన్ లాస్ట్ పొజిషన్ కు పడిపోయాడు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఉత్కంఠ రేపుతోంది.
టాప్ లో త్రిగుణ్
{{/usCountry}}ఈ తొమ్మిది మంది కంటెస్టెంట్ల నుంచి ఈ వారం ఒకరు ఎలిమినేట్ కావాల్సిందే. ఫస్ట్ సృష్టి డేంజర్ జోన్లోకి వెళ్లింది. ఆ తర్వాత మారిన ఓటింగ్ ట్రెండ్ తో దేబ్జానీ ఎలిమినేషన్ కు దగ్గరైంది. ఇప్పుడేమో అమన్ లాస్ట్ పొజిషన్ కు పడిపోయాడు. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఉత్కంఠ రేపుతోంది.
టాప్ లో త్రిగుణ్
{{/usCountry}}ఓటింగ్ లో టాప్ లో మాత్రం త్రిగుణ్ కు తిరుగులేదు. అతను మిగతా కంటెస్టెంట్లకు అందనంత ఎత్తులో నంబర్ వన్ గా కొనసాగుతున్నాడు. మిగతా కంటెస్టెంట్ల ఓటింగ్ శాతం కనీసం 15 కూడా దాటడం లేదు. కానీ త్రిగుణ్ ఓటింగ్ మాత్రం 50కి దగ్గరగా ఉండటం మామూలు విషయం కాదు. రోహిత్, అమన్, అపూర్వ కలిసి త్రిగుణ్ ను టార్గెట్ చేశారు. దీంతో త్రిగుణ్ కు ఓటింగ్ అమాంతం పెరిగిందని చెప్పొచ్చు.