...
...
Next Story

నాకు చాలా షార్ట్ టెంపర్, ఊరికే సమ్మన లెగుస్తది.. బిగ్ బాస్ శివాజీతో సీరియల్ విలన్ భరణి శంకర్ మాటలు

బిగ్ బాస్ 9 తెలుగు ఆరో వారం సీరియల్ విలన్ భరణి శంకర్ ఎలిమినేట్ అయిపోయాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో హీరో శివాజీ హోస్ట్‌గా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో బిగ్ బాస్ శివాజీ అడిగిన ప్రశ్నలకు తనకు చాలా షార్ట్ టెంపర్ అని భరణి శంకర్ చెప్పాడు.

Published on: Oct 20, 2025, 18:27:30 IST
Advertisement

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి ఆరో వారం అనూహ్యంగా సీరియల్ విలన్ భరణి శంకర్ ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. టాప్ 2 కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న భరణి శంకర్ ఎలిమినేట్ అవడం పట్ల అందరు షాక్ అయ్యారు. ఇక ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే.

భరణి శంకర్ ఎలిమినేట్ అనంతరం

నాకు చాలా షార్ట్ టెంపర్, ఊరికే సమ్మన లెగుస్తది.. బిగ్ బాస్ శివాజీతో సీరియల్ విలన్ భరణి శంకర్ మాటలు
నాకు చాలా షార్ట్ టెంపర్, ఊరికే సమ్మన లెగుస్తది.. బిగ్ బాస్ శివాజీతో సీరియల్ విలన్ భరణి శంకర్ మాటలు

ఈసారి బిగ్ బాస్ తెలుగు 9 బజ్ ఇంటర్వ్యూకు సీజన్ 8 కంటెస్టెంట్, హీరో శివాజీ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. ఎలిమినేట్ అనంతరం బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూకు హాజరయ్యాడు భరణి శంకర్. "బిగ్ బాస్ హౌజ్‌కి ఆటాడదాం అని వెళ్లాడు. కానీ, అక్కడికి వెళ్లాక ఇంటింటి రామాయణం సీరియల్ చూపించడం స్టార్ట్ చేశాడు. ఆయన ఎవరో కాదు భరణి గారు" అని ఇన్వైట్ చేశాడు శివాజీ.

భరణికి శివాజీ స్వీట్ ఇస్తాడు. మీ ఒక్కరికే ఇస్తే బాగుండదు ఇది మీ కూతురుకు (తనూజ) అని శివాజీ అంటాడు. తర్వాత ఇది ఎవరికి అని ఇంకోటి ఇస్తే దివ్యకు అని భరణి, ఇది తమ్ముడు అని శివాజీ అంటే.. రాము రాథోడ్‌కు అని భరణి అంటాడు. హౌజ్‌లో భరణి మెయింటేన్ చేసిన బాండింగ్స్‌ గురించి సెటైర్లు వేశాడు బిగ్ బాస్ శివాజీ.

ఎఫెక్ట్ పడిందని అనుకోవట్లేదు

"కుటుంబం అన్నగారి కుటుంబం" అని శివాజీ పాట పాడుతాడు. "నాకు ఎక్కడ నా గేమ్ మీద ఎఫెక్ట్ పడిందని నేను అనుకోవట్లేదు" అని భరణి అన్నాడు. "మీరు గేమ్ ఆడలేదు. బాండింగ్స్‌లోకి వెళ్లిపోయారు"అని శివాజీ అన్నాడు. "తనూజమ్మా ఎలా ఫీల్ అవుతుందో, దివ్య ఏమనుకుంటుందో ఏంటీది" అని శివాజీ అడిగాడు.

"పవర్ ఆస్త్రా వాడేసరికి మీకెందుకు వాడలేదు ఇమ్మాన్యుయెల్" అని శివాజీ అడిగాడు. "అదే అతని గేమ్ ప్లాన్" అని భరణి అన్నాడు. "సంజనను నామినేట్ చేస్తూ గట్టి గట్టిగా నేను త్యాగం చేస్తేనే ఇక్కడ ఉన్నావంటూ ఎందుకుంత సడెన్‌గా రియల్ భరణి బయటకొచ్చాడు" అని శివాజీ అడిగాడు.

"నాకు మాములుగానే చాలా షార్ట్ టెంపర్. ఊరికనే సమ్మన లెగుస్తది" అని భరణి శంకర్ అంటే శివాజీ సైలెంట్‌గా ఉన్నాడు. తర్వాత ఓ నెటిజన్ రాసిన ట్వీట్‌ను భరణితో చదివించాడు శివాజీ.

అదంతా సింపతీ కోసమా

అందులో దివ్యతో బాండింగ్ గురించి ఉంది. అదంతా సింపతీ కోసమా అని ఆ యూజర్ రాశాడు. అక్కడితో బిగ్ బాస్ శివాజీతో భరణి శంకర్ సీజన్ 9 బజ్ ఇంటర్వ్యూ ప్రోమో ముగిసింది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks