...
...
Next Story

బిగ్ బాస్‌లో సెకండ్ రన్నరప్‌గా డిమాన్ పవన్- 15 లక్షల సూట్‌కేస్‌తో అవుట్- రెమ్యూనరేషన్‌తో కలిపి సామాన్యుడి సంపాదన ఇదే!

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ ఇవాళ (డిసెంబర్ 21) ముగియనుంది. సాయంత్రం 7 గంటలకు గ్రాండ్‌గా ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలేలో టాప్ 3 ఫైనలిస్ట్‌గా, సెకండ్ రన్నరప్‌గా డీమాన్ పవన్ బయటకు వెళ్లిపోయాడు. రూ. 15 లక్షల సూట్‌కేస్ తీసుకుని ఎలిమినేట్ అయ్యాడు. డీమాన్ పవన్ రెమ్యూనరేషన్, సంపాదన చూద్దాం.

Published on: Dec 21, 2025, 21:37:39 IST
Advertisement

బుల్లితెర ప్రేక్షకులను గత 105 రోజులుగా అలరించిన బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ సంచలన ముగింపు దిశగా సాగుతోంది. ఇవాళ ఆదివారం (డిసెంబర్ 2) రాత్రి జరుగుతున్న గ్రాండ్ ఫినాలేలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.

15 లక్షల సూట్‌కేస్‌తో

బిగ్ బాస్‌లో సెకండ్ రన్నరప్‌గా డిమాన్ పవన్- 15 లక్షల సూట్‌కేస్‌తో అవుట్- రెమ్యూనరేషన్‌తో కలిపి సామాన్యుడి సంపాదన ఇదే!
బిగ్ బాస్‌లో సెకండ్ రన్నరప్‌గా డిమాన్ పవన్- 15 లక్షల సూట్‌కేస్‌తో అవుట్- రెమ్యూనరేషన్‌తో కలిపి సామాన్యుడి సంపాదన ఇదే!

టైటిల్ ఫేవరెట్లలో ఒకడిగా, మాస్ ఆడియెన్స్‌లో బలమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న డీమాన్ పవన్, విన్నర్ రేసు నుంచి తప్పుకుంటూ అందరికీ షాక్ ఇచ్చాడు. అయితే, డిమాన్ ఉత్త చేతులతో కాకుండా.. ఏకంగా రూ. 15 లక్షల నగదు ఉన్న సూట్‌కేస్‌ను ఎంచుకుని స్మార్ట్ డీల్ చేసుకున్నాడు.

ఆటలో ట్విస్ట్.. పవన్ షాకింగ్ నిర్ణయం!

ప్రతీ సీజన్‌లోనూ ఫైనలిస్టులకు నగదు ఆఫర్ చేయడం రివాజే. గతంలో సోహెల్ వంటి వారు ఇలాగే నగదు తీసుకుని బయటకు వచ్చి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆ అవకాశం డీమాన్ పవన్‌కు దక్కింది.

ఇద్దరి మధ్య గట్టిపోటీ

బిగ్ బాస్ 9 తెలుగు ఫైనల్ రేసులో కల్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామిల మధ్య గట్టి పోటీ ఉండటంతో రిస్క్ తీసుకోవడం కంటే చేతికి అందుతున్న మొత్తాన్ని తీసుకోవడమే ఉత్తమమని పవన్ భావించినట్లు తెలుస్తోంది. హీరో రవితేజ సిల్వర్ సూట్ కేస్ ఆఫర్ చేయడంతో, తన కుటుంబ పరిస్థితులు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రెమ్యునరేషన్ ప్లస్ రూ. 15 లక్షలు!

ఈ లెక్కన బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌లో 15 వారాలు ఉన్నందుకు మొత్తంగా డీమాన్ పవన్ రూ. 10 లక్షల 50 వేలు సంపాదించినట్లు తెలుస్తోంది. ఇక టాప్ 3గా రూ. 15 లక్షలు తీసుకోవడంతో డీమాన్ పవన్ సంపాదన మరింత పెరిగింది. అలా టోటల్‌గా బిగ్ బాస్ ద్వారా డీమాన్ పవన్ రూ. 25 లక్షల 50 వేలు సంపాదించినట్లు అర్థం చేసుకోవచ్చు.

డీమాన్ పవన్ సంపాదన

అంటే, బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ రూ. 50 లక్షల్లో దాదాపుగా సగానికిపైగా కామనర్‌గా వచ్చిన డీమాన్ సంపాదించుకున్నాడు. ఒక సామాన్యుడు బిగ్ బాస్‌లో ఇంత డబ్బు రాబట్టుకోవడం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. ఇకపోతే హౌజ్‌లోకి సామాన్యుడిగా అడుగు పెట్టిన డీమాన్ తన ఆటతో యోధుడిగా నిలిచాడని అతని అభిమానులు అంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe