...
...
Next Story

బిగ్ బాస్ 12 విజేతగా యూట్యూబర్- 50 లక్షల ప్రైజ్ మనీతోపాటు ఖరీదైన కారు- ఓటీటీ సిరీస్ నుంచి స్టార్ హీరో దర్శన్ మూవీ వరకు!

ఉత్కంఠభరితంగా సాగిన బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 గ్రాండ్ ఫినాలేలో గిల్లీ నటా విజేతగా నిలిచారు. కిచ్చా సుదీప్ చేతుల మీదుగా ట్రోఫీని అందుకున్న ఈ యూట్యూబర్ భారీ నగదు బహుమతితో పాటు కారును సొంతం చేసుకున్నారు. దీంతో బిగ్ బాస్ కన్నడ 12 విన్నర్ గిల్లీ నటా హాట్ టాపిక్‌గా మారాడు.

Published on: Jan 19, 2026, 11:20:51 IST
Advertisement

కన్నడ బుల్లితెర ప్రేక్షకులను గత కొన్ని వారాలుగా అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ కన్నడ 12 సీజన్ ముగింపు వేడుక ఆదివారం (జనవరి 18) సాయంత్రం అత్యంత వైభవంగా జరిగింది. కలర్స్ కన్నడ, జియో హాట్‌స్టార్ ఓటీటీలో ప్రసారమైన ఈ గ్రాండ్ ఫినాలేలో, అభిమానులు ఆశించినట్లుగానే పాపులర్ కంటెస్టెంట్ గిల్లీ నటా టైటిల్ విజేతగా నిలిచారు.

అంచనాలు నిజం చేస్తూ.. గిల్లీ నటా గెలుపు!

బిగ్ బాస్ 12 విజేతగా యూట్యూబర్- 50 లక్షల ప్రైజ్ మనీతోపాటు ఖరీదైన కారు- ఓటీటీ సిరీస్ నుంచి స్టార్ హీరో దర్శన్ మూవీ వరకు!
బిగ్ బాస్ 12 విజేతగా యూట్యూబర్- 50 లక్షల ప్రైజ్ మనీతోపాటు ఖరీదైన కారు- ఓటీటీ సిరీస్ నుంచి స్టార్ హీరో దర్శన్ మూవీ వరకు!

బిగ్ బాస్ హోస్ట్ కిచ్చా సుదీప్ గిల్లీ నటా చేయి పైకెత్తి 12వ సీజన్ విజేతగా ప్రకటించగానే ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో జరిగిన అనధికారిక పోల్స్, వెబ్‌సైట్ సర్వేలు ముందు నుంచే గిల్లీ నటా గెలుస్తారని జోస్యం చెప్పాయి.

ఓటింగ్ ముగిసిన కొద్ది గంటలకే ఆయన విజయం ఖాయమని నెటిజన్లు సోషల్ మీడియాను ఊపేశారు. తీరా గ్రాండ్ ఫినాలేలో వారి అంచనాలే నిజమయ్యాయి. రక్షిత శెట్టి ఫస్ట్ రన్నరప్‌గా నిలవగా, అశ్విని గౌడ సెకండ్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు.

కానుకల వర్షం.. భారీ ప్రైజ్ మనీ!

ఇక ఫినాలే రేసులో ఉన్న ధనుష్ గౌడ, మ్యూటెంట్ రఘు, కావ్య వరుసగా ఆరు, ఐదు, నాలుగో స్థానాల్లో ఎలిమినేట్ అయ్యారు. ఇక బిగ్ బాస్ కన్నడ 12 సీజన్ విజేతగా నిలిచిన గిల్లీ నటాకు రూ. 50 లక్షల నగదు బహుమతితో పాటు సరికొత్త మారుతి సుజుకి విక్టోరిస్ కారు లభించింది.

ఆ కారు ఖరీదు సుమారుగా రూ. 10 నుంచి 20 లక్షల వరకు ఉంటుందని సమాచారం. అలాగే, బిగ్ బాస్ 12 కన్నడ రన్నరప్‌గా నిలిచిన రక్షిత శెట్టికి రూ. 25 లక్షల ప్రైజ్ మనీ దక్కింది.

ఆరంభం నుంచి కామెడీతో

యూట్యూబ్‌లో కామెడీ స్కెచ్‌లతో కెరీర్ ప్రారంభించిన గిల్లీ నటా.. తన ప్రతిభతో అనతి కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టి ‘కామెడీ కిలాడిగలు సీజన్ 4’లో రన్నరప్‌గా నిలిచారు.

‘డాన్స్ కర్ణాటక డాన్స్’, ‘భర్జరీ బ్యాచిలర్స్’ వంటి షోలతో పాటు కొన్ని ఓటీటీ వెబ్ సిరీస్‌లలోనూ యూట్యూబర్ గిల్లీ నటా నటించారు. స్టార్ హీరో దర్శన్ నటించిన ‘ది డెవిల్’ సినిమాతో వెండితెరపై కూడా మెరిశారు. అయితే, బిగ్ బాస్ సీజన్ 12 గిల్లీ నటాను కన్నడనాట ప్రతి ఇంటికీ చేరువ చేసింది.

గిల్లీ నటా సంపాదన

ఇదిలా ఉంటే యూట్యూబర్ నుంచి ఓటీటీ సిరీస్, స్టార్ హీరో దర్శన్‌తో సినిమా వరకు మంచి కెరీర్ సాగించిన గిల్లీ నటా బిగ్ బాస్ కన్నడ 12 ద్వారా సుమారు రూ. 60 నుంచి 70 లక్షల వరకు సంపాదించినట్లు సమాచారం.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks