...
...
Next Story

Uppal Balu Bigg Boss 10: షాకింగ్.. ప్లేట్ తిప్పేసిన ఉప్పల్ బాలు- బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2లో జడ్జ్‌ల తప్పు లేదంటూ వీడియో!

Uppal Balu Bigg Boss Telugu 10 Agnipariksha 2: బిగ్ బాస్ తెలుగు 10కి కామనర్స్‌ను పంపించేందుకు నిర్వహించిన అగ్ని పరీక్ష 2లో ఉప్పల్ బాలుపై జడ్జెస్ వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదం అయింది. అయితే ఇప్పటివరకు జడ్జెస్‌ను ఆరోపించిన ఉప్పల్ బాలు అందరికి షాక్ ఇస్తూ వారి తప్పేం లేదన్న వీడియో వైరల్ అవుతోంది.

Published on: Aug 21, 2026, 22:45:08 IST
Advertisement

Uppal Balu Bigg Boss Telugu 10 Agnipariksha 2: ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ సందడి మొదలైంది. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఈసారి కూడా సెలబ్రిటీలతోపాటు కామనర్స్‌ను కూడా హౌజ్‌లోకి పంపనున్నారు.

15 మంది ఫైనలిస్టులు

షాకింగ్.. ప్లేట్ తిప్పేసిన ఉప్పల్ బాలు- బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2లో జడ్జ్‌ల తప్పు లేదంటూ వీడియో!
షాకింగ్.. ప్లేట్ తిప్పేసిన ఉప్పల్ బాలు- బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2లో జడ్జ్‌ల తప్పు లేదంటూ వీడియో!

అందుకోసం ఇప్పటికే బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 కూడా మొదలైపోయింది. అంతేకాకుండా ఈపాటికే హౌజ్‌లోకి పంపించేందుకు 15 మంది అగ్ని పరీక్ష 2 ఫైనలిస్టులను సెలెక్ట్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, బిగ్ బాస్ అంటేనే ఎప్పుడో ఏదో ఒక వివాదం రాజుకూనే ఉంటుంది.

అలా ఈ బిగ్ బాస్ 10 తెలుగు సీజన్‌కి సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్స్ ఉప్పల్ బాలు ద్వారా సరికొత్త కాంట్రవర్సీ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 ఆడిషన్ సమయంలో ఉప్పల్ బాలును హీరో, జడ్జ్ నవదీప్ చాలా అవమానకరంగా మాట్లాడాడని ఉప్పల్ బాలు ఆరోపించాడు.

వల్గర్ వీడియోస్ అంటూ

అలాగే, వల్గర్ వీడియోస్ చేసేవాన్ని హౌజ్‌లోకి పంపి ఎలాంటి సందేశం ఇవ్వాలని నవదీప్ అన్న వీడియోలో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. ఈ విషయం మీద ఎంతోమంది ఉప్పల్ బాలుకు సపోర్ట్ చేశారు. తన ఫ్యామిలీ కోసం అలాంటి వీడియోలు చేశానని చెప్పిన కూడా జడ్జెస్ వినకుండా అవమానించడం కరెక్ట్ కాదని, అతని గురించి తెలిసి ఆడిషన్‌కు ఎందుకు పిలవడం అని విమర్శలు గుప్పించారు.

అయితే, ఉప్పల్ బాలు పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2లో జడ్జెస్ తప్పేం లేదంటూ ఉప్పల్ బాలు మాట్లాడిన కొత్త వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఆ వీడియో అగ్ని పరీక్ష 2 ఆడిషన్స్‌లో ఎలిమినేట్ అయిన తర్వాత ఇచ్చిన వీడియోలా అనిపిస్తోంది.

ఆ వీడియోలో.. "నేను బిగ్ బాస్‌కు ఎందుకు వచ్చానంటే అదొక కల. బిగ్ బాస్‌ను కొన్ని కోట్లమంది చూస్తుంటారు. అందులో నేను ఎందుకు కనిపించొద్దు. అందరు వెళ్తున్నారు.. నేనెందుకు వెళ్లకూడదు. నాకు వెళ్లేంత టాలెంట్ ఎందుకు లేదు అని నేను ట్రై చేశా" అని ఉప్పల్ బాలు చెప్పాడు.

జడ్జెస్‌గా కూర్చోవడం అంత ఈజీ కాదు

ఉప్పల్ బాలు కంటిన్యూ చేస్తూ.. "అలా బిగ్ బాస్ అగ్ని పరీక్ష నాకు ఒక మెమోరీ అనిపించింది. మరోసారైన వస్తదేమో అని ట్రై చేస్తాను. ఇక్కడివరకు వచ్చిన హ్యాపీగా ఉంది. కానీ, నిజం చెప్పాలంటే హౌజ్‌లో ఎందుకు లేనని చాలా బాధపడ్డా. జడ్జెస్.. మీరు చేసింది న్యాయమే.. ఎందుకంటే జడ్జెస్‌గా కూర్చోవడం అంత ఈజీకాదు" అని వేలితో లైక్ సింబల్ ఇస్తూ తెలిపాడు.

"బిగ్ బాస్‌లో చాలా మంది కప్పులు కొట్టినోళ్లు ఉన్నారు. వీళ్లను పెట్టారంటే టాలెంట్ ఉంది కాబట్టే పెట్టారు" అని ఉప్పల్ బాలు మాట్లాడిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన జనాలంతా ముక్కునవేలేసుకుంటున్నారు. ఇలా ప్లేట్ తిప్పేశావ్ ఏంటీ బాలు అంటూ సపోర్ట్ చేసిన నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

నాగార్జునకు రిక్వెస్ట్

ఉప్పల్ బాలు ఆడిషన్ తర్వాత జడ్జెస్‌ది తప్పు లేదని అనడం, బయటకొచ్చిన తర్వాత నవదీప్‌పై ఆరోపణలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, ఆగస్ట్ 20న కూడా తనను బిగ్ బాస్‌లోకి తీసుకోవాలని, ఒక్క ఛాన్స్ ఇవ్వండని అటు స్టార్ మాను, ఇటు నాగార్జునకు ఉప్పల్ బాలు రిక్వెస్ట్ కూడా పెట్టుకోవడం గమనార్హం.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe