...
...
Next Story

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఆ నటుడు ఔట్.. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్.. ఎవరో తెలుసా?

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 సెకండ్ వీక్ ఎలిమినేషన్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. సీనియర్ నటుడు ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యాడని తెలిసింది. ఈ వారం సింగిల్ ఎలిమినేషనే ఉంటుందని కూడా టాక్ వినిపిస్తోంది.

Published on: Sep 19, 2026, 14:06:11 IST
Advertisement

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10 సెకండ్ వీక్ ఎలిమినేషన్ లో పెద్దగా ట్విస్ట్ ఏం లేదని తెలిసింది. అందరూ అనుకున్నట్లుగానే, ఓటింగ్ ట్రెండ్స్ ఎక్స్ పెక్ట్ చేసినట్లుగానే నటుడు కృష్ణుడు బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్లు అవబోతున్నట్లు సమాచారం. వీకెండ్ ఎపిసోడ్ లో అతను ఇంటికి వెళ్లిపోతున్నాడని టాక్.

బిగ్ బాస్ 10 తెలుగు

బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఆ నటుడు ఔట్.. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్.. ఎవరో తెలుసా? (youtube/starmaa)
బిగ్ బాస్ తెలుగు 10 నుంచి ఆ నటుడు ఔట్.. ఈ వారం సింగిల్ ఎలిమినేషన్.. ఎవరో తెలుసా? (youtube/starmaa)

బిగ్ బాస్ 10 తెలుగు రెండో వారంలో మొత్తం 11 మంది నామినేట్ అయ్యారు. హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు 11 మంది నామినేషన్లో ఉన్నారు. రోహిత్, త్రిగుణ్, ముఖేష్ గౌడ, రాంప్రసాద్, దేబ్జానీ, శాలిని, ఝాన్సీ, సృష్టి, సుధీర్, వర్షిణి, కృష్ణుడు నామినేషన్లో ఉన్నారు.

బిగ్ బాస్ ఓటింగ్

బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ రెండో వారం అనఫిషియల్ ఓటింగ్ ట్రెండ్స్ చూస్తే నటుడు కృష్ణుడు లాస్ట్ ప్లేస్ లోనే కొనసాగుతున్నాడు. ఈ వారం ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అతను చివరి స్థానంలోనే ఉన్నాడు. ఇప్పుడు ఇదే క్రమంలో అతను బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అవబోతున్నాడనే కీలక సమాచారం అందింది.

రెండు వారాలు

వినాయకుడు సినిమాలో హీరోగా ఎంటర్ టైన్ చేసిన కృష్ణుడు.. మరికొన్ని చిత్రాల్లో కమెడియన్ రోల్స్ ప్లే చేసిన సంగతి తెలిసిందే. కెరీర్ లో సెకండ్ ఛాన్స్ కోసమంటూ హౌస్ లో అడుగుపెట్టిన కృష్ణుడు అక్కడ రెండు వారాలు మాత్రమే ఉండగలిగాడు. సెకండ్ వీక్ ఎలిమినేట్ అవుతున్నాడని తెలిసింది.

సైలెంట్ గా

ఎక్కువగా హౌస్ లో సైలెంట్ గా ఉండిపోయాడు కృష్ణుడు. టాస్క్ లు ఆడే ఛాన్స్ రాలేదు. కానీ తన కామెడీతోనైనా హౌస్ లో ఎంటర్ టైన్ చేశాడా? అంటే.. అదీ కూడా లేదనే విమర్శలు వస్తున్నాయి. అందుకే జనాలు అతనికి ఓటు వేయలేదనే టాక్ వినిపిస్తోంది.

సింగిల్ ఎలిమినేషన్

ఇక బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో రెండో వారంలోనూ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే చర్చ సాగింది. కృష్ణుడితో పాటు వర్షిణి లేదా సృష్టిలో ఒకరిని బయటకు పంపించేస్తారనే ప్రచారం వినిపించింది. కానీ ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉందని తాజాగా అనఫిషియల్ అప్డేట్ తెలిసింది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks