Madhunandan Poster Release Form Bigg Boss Trigun Janga: శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి నిర్మిస్తున్న లేటెస్ట్ తెలుగు చిత్రం ‘జంగా’. ఈ సినిమాలో బిగ్ బాస్ తెలుగు 10 కంటెస్టెంట్ త్రిగుణ్ హీరోగా చేస్తున్నాడు.
జంగా సినిమాలోని కీలక పాత్రలు

హీరో త్రిగుణ్‌తోపాటు నేహా పఠాన్, హీరోయిన్-నటి వరలక్ష్మీ శరత్ కుమార్, నటులు శ్రావణ్, మధునందన్ , గగన్ విహారి, చందు గౌడ, సీనియర్ నటుడు సమీర్, నాగ మహేష్,భూపాల్, రఘు కారుమంచి, రచ్చ రవి, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
రా అండ్ రస్టిక్ లుక్‌లో త్రిగుణ్
వీరందరి కాంబినేషన్‌లో వస్తోన్న జంగా సినిమాకు కెవిన్ గడ్డం(శ్రీహరి) కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ మధ్య త్రిగుణ్ బర్త్ డే స్పెషల్‌గా వదిలిన ‘జంగా’ పోస్టర్ అండ్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించిన త్రిగుణ్ అందరినీ ఆశ్చర్యపరిచాడు.
పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మధునందన్
ఇక తాజాగా జంగా సినిమా నుంచి మరొక పోస్టర్‌ను విడుదల చేశారు. జంగా మూవీలో కీలక పాత్రను పోషిస్తున్న నటుడు మధునందన్ కారెక్టర్‌ను రివీల్ చేశారు. మధునందన్ ఈ చిత్రంలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతోన్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది.
ఇంటెన్స్ లుక్‌తో మధునందన్ పోస్టర్
జంగాలోని మధునందన్ పోస్టర్లో ఆయన లుక్ చూస్తుంటే ఏదో తదేకంగా పరిశీలిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఆయన ఏం చేస్తున్నారు? అక్కడ ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
జంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్
{{/usCountry}}జంగాలోని మధునందన్ పోస్టర్లో ఆయన లుక్ చూస్తుంటే ఏదో తదేకంగా పరిశీలిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి ఆయన ఏం చేస్తున్నారు? అక్కడ ఏం జరిగింది? అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
జంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్
{{/usCountry}}ప్రస్తుతం జంగా చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జంగా సినిమాకి కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తుండగా.. వెంకట్ సి. దిలీప్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రసాద్ వర్మ, ప్రేమ్ రాజ్ మాటలు రాయగా.. కాసర్ల శ్యాం, పూర్ణాచారి, కళ్యాణ్ చక్రవర్తి పాటల్ని రాస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు 10లో త్రిగుణ్
అలాగే, ప్రవీణ్ పూడి జంగా సినిమాకు ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, హీరో త్రిగుణ్ తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ 10కి కంటెస్టెంట్‌గా వెళ్లిన విషయం తెలిసిందే. నాగార్జున హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ 10 తెలుగులో తనదైన స్టైల్ గేమ్‌తో త్రిగుణ్ మెప్పిస్తున్నాడు.
బిగ్ బాస్‌లో ఉండగానే రిలీజ్?
అయితే, త్రిగుణ్ బిగ్ బాస్‌కి వెళ్లకుముందే జంగా సినిమా షూటింగ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి త్రిగుణ్‌కు సంబంధించిన షూటింగ్ పూర్తయినట్లు అర్థం అవుతోంది. మరి త్రిగుణ్ బిగ్ బాస్ హౌజ్‌లో ఉండగానే జంగా సినిమా రిలీజ్ అవుతుందా..? లేదా బయటకొచ్చాకా విడుదల అవుతుందా? అనేది వేచి చూడాల్సిందే.