Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ హోస్ట్ నాగార్జునకు మళ్లీ కోపమొచ్చింది. వీకెండ్ ఎపిసోడ్ లో ఆయన మరోసారి ఆవేశంతో ఊగిపోయారు. ఈ సారి ముఖేష్ గౌడ, వర్షిణిపై ఫస్ట్ కోపం చూపించారు. వాళ్లకు దిమ్మతిరిగేలా షాకిచ్చారు. మరోవైపు నరేష్ ను ముఫాసా అంటూ ఆకాశానికి ఎత్తేశారు.
నరేష్ ముఫాసా

బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లేటెస్ట్ వీకెండ్ ప్రోమోలో జబర్దస్త్ నరేష్ పై హోస్ట్ నాగార్జున ప్రశంసలు కురిపించారు. ఆట అదిరిపోయిందని, నీ అభిమానులు గుండెల్లో పెట్టుకుంటున్నారని నాగ్ చెప్పారు. నరేష్ దొంగతనం చేస్తే ఎవరూ కనిపెట్టలేరని అన్నారు. అది డైమండ్స్ అయినా లేదా ఆడపిల్లల మనసులైనా అని నాగార్జున సరదాగా కౌంటర్ వేశారు.
ముఖేష్ పై ఫైర్
ఇక బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో టాప్ కంటెస్టెంట్లలో ఒకరైన ముఖేష్ గౌడపై నాగార్జున ఫైర్ అయ్యారు. ‘‘నువ్వు జెంటిల్మెన్ అనుకున్నా. కానీ కాదని తెలిసింది’’ అంటూ నాగార్జున తిట్టారు. ఆ మాటలు ఏంటీ? ఆ బిహేవివర్ ఏంటీ? అని ముఖేష్ గౌడకు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేశారు నాగార్జున.
వర్షిణి ఏం చేశావ్?
మరోవైపు ఈ వారం టాస్క్ ల్లో దారుణంగా ఫెయిల్ అయిన వర్షిణిపైనా నాగార్జున మండిపడ్డారు. అసలు బరువులు మోయలేకపోయావని, ఛాన్స్ దొరికితే ఏం చేశావని ప్రశ్నించాడు. ఏం పీకావని అడిగిన నీతు పీకి చూపించిందని వర్షిణికి నాగార్జున దిమ్మతిరిగే కౌంటర్ వేశారు. దీంతో వర్షిణి కన్నీళ్లు పెట్టుకుంది.
శాలిని రీ ఎంట్రీ
అలాగే హౌస్ లోకి శాలిని రీ ఎంట్రీ గురించి కూడా కంటెస్టెంట్లను నాగార్జున అడిగారు. ఈ విషయం రాంప్రసాద్ ను అడగ్గా.. శాలిని తిరిగి రావడం తనకు ఇష్టం లేదని కుండబద్ధలు కొట్టాడు. అసలు రాంప్రసాద్ ఫస్ట్ నుంచి ఇదే మాట మీద ఉన్నాడు. శాలినిని హౌస్ లో తిరిగి చూసిన తర్వాత రాంప్రసాద్ షాక్ అయ్యాడు.
ఇవాళ ఎలిమినేషన్
{{/usCountry}}అలాగే హౌస్ లోకి శాలిని రీ ఎంట్రీ గురించి కూడా కంటెస్టెంట్లను నాగార్జున అడిగారు. ఈ విషయం రాంప్రసాద్ ను అడగ్గా.. శాలిని తిరిగి రావడం తనకు ఇష్టం లేదని కుండబద్ధలు కొట్టాడు. అసలు రాంప్రసాద్ ఫస్ట్ నుంచి ఇదే మాట మీద ఉన్నాడు. శాలినిని హౌస్ లో తిరిగి చూసిన తర్వాత రాంప్రసాద్ షాక్ అయ్యాడు.
ఇవాళ ఎలిమినేషన్
{{/usCountry}}బిగ్ బాస్ తెలుగు 10వ సీజన్ లో ఏడో వారం డబుల్ ఎలిమినేషన్లో భాగంగా ఇవాళ ఒకరు ఇంటికి వెళ్లిపోతున్నారని తెలిసింది. గ్లామరస్ బ్యూటీ దక్షి గుత్తికొండ ఈ రోజు (అక్టోబర్ 24) ఎలిమినేట్ అవుతుందని టాక్. రేపు అంటే సండే రోజు వర్షిణి కూడా తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని సమాచారం.
మరి ఈ రోజు ఎపిసోడ్ ఎలిమినేషన్లో బిగ్ బాస్ ఎలాంటి ట్విస్ట్ ఇస్తాడో చూడాలి.