బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ జోరుగా సాగుతోంది. ఊహించని ట్విస్టులు, ఎలిమినేషన్స్, నామినేషన్స్ అరుపులతో వాడి వేడిగా సాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 పదకొండు వారాలు పూర్తి చేసుకుంది. అయితే, గత రెండు వారాలు బిగ్ బాస్‌లో డబుల్ ఎలిమినేషన్స్ జరిగాయి.
నామినేషన్స్‌లో ఆరుగురు

కానీ, బిగ్ బాస్ తెలుగు 9 పదకొండో వారం మాత్రం ఎలాంటి ఎలిమినేషన్ జరగలేదు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ శనివారం (నవంబర్ 22) నాడే పూర్తయిపోయింది. ఈ వారం బిగ్ బాస్‌లో భరణి శంకర్, ఇమ్మాన్యూయేల్, కల్యాణ్ పడాల, సంజన గల్రాని, డిమాన్ పవన్, దివ్య నిఖితా ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు.
ఐదు, ఆరు స్థానాల్లో వారిద్దరు
వీరిలో టాప్ 1లో కల్యాణ్, టాప్ 2లో ఇమ్మాన్యూయెల్, 3వ స్థానంలో భరణి శంకర్, నాలుగో ప్లేసులో డిమాన్ పవన్ ఉన్నారు. వీరందరిని తమ ఫ్యామిలీ మెంబర్స్‌తోపాటు పలువురు సెలబ్రిటీలతో సేవ్ చేశారు. అయితే, ఐదో స్థానంలో హీరోయిన్ సంజన, ఆరో స్థానంలో దివ్య నిఖితా ఉన్నారు.
తనూజ గౌడతో దివ్య గొడవ
ఈ లెక్కన వీరిలో నుంచి దివ్య నిఖిత ఇవాళ ఎలిమినేట్ కావాల్సింది. కానీ, శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో సీరియల్ హీరోయిన్ తనూజ గౌడతో దివ్య నిఖితాకు పెద్ద గొడవ జరిగింది. దాదాపు తనూజను దివ్య కొట్టేంత పని చేసింది. ఈ గొడవ కారణంగా, షోకి మరింత హైప్ పెరుగుతుందన్న ఉద్దేశంతో దివ్య నిఖిత ఎలిమినేషన్‌ను క్యాన్సిల్ చేశారని రివ్యూవర్స్ చెబుతున్నారు.
శివాజీ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ
అంతేకాకుండా ఈ వారం ఎలిమినేట్ కంటెస్టెంట్ దివ్య నిఖితా అని, హీరో శివాజీ హోస్ట్‌గా చేసే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేశారని సమాచారం. చివరి నిమిషంలో ఎలిమినేషన్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుందట బీబీ టీమ్.
దివ్యకు బదులుగా
{{/usCountry}}అంతేకాకుండా ఈ వారం ఎలిమినేట్ కంటెస్టెంట్ దివ్య నిఖితా అని, హీరో శివాజీ హోస్ట్‌గా చేసే బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేశారని సమాచారం. చివరి నిమిషంలో ఎలిమినేషన్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు నిర్ణయం తీసుకుందట బీబీ టీమ్.
దివ్యకు బదులుగా
{{/usCountry}}అయితే, ఎలిమినేషన్ ప్రాసెస్‌ను మాత్రం కంటిన్యూ చేసింది బీబీ టీమ్. దివ్యకు బదులు చివరి ఆరో స్థానంలో హీరోయిన్ సంజన గల్రాని ఉందని, జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యూయెల్ దగ్గర ఉన్న పవర్ ఆస్త్రాను వాడుకునేలా బీబీ స్కెచ్ వేసిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇవాళ లేని ఎలిమినేషన్
సంజనను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసేందుకు ఇమ్మాన్యూయెల్ పవర్ ఆస్త్రా వాడినట్లు సమాచారం. ఇలా ఇవాళ అంటే బిగ్ బాస్ తెలుగు 9 ఈ వారం ఎలిమినేషన్ లేదని సమాచారం. కాబట్టి, ఈ వారం బిగ్ బాస్‌లో నో ఎలిమినేషన్ అని తెలుస్తోంది.