బిగ్ బాస్ 9 తెలుగు చివరి అంకానికి చేరుకుంది. మహా అయితే మరో రెండు, మూడు వారాలు మాత్రమే బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ కొనసాగనుంది. అంటే మరో రెండు వారాల్లో బిగ్ బాస్ తెలుగు 9 టైటిల్ విన్నర్‌ను ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే, గత వారం నో ఎలిమినేషన్ కారణంగా ఎవరు బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇంటికి వెళ్లలేదు.
దివ్య నిఖిత ఎలిమినేట్

కానీ, ఈ వారం ఎలిమినేషన్ చోటు చేసుకుంది. అందరూ ఊహించినట్లుగానే బిగ్ బాస్ తెలుగు 9 పన్నెండో వారం దివ్య నిఖిత ఎలిమినేట్ అయింది. గత వారమే ఎలిమినేట్ కావాల్సిన దివ్వ సీరియల్ హీరోయిన్ తనూజ గౌడతో గొడవ కారణంగా సేఫ్ అయింది. కానీ, ఈ వారం మాత్రం దివ్యను ఆడియెన్స్ ఎలిమినేట్ చేశారు.
బిగ్ బాస్ ఓటింగ్
బిగ్ బాస్ 9 తెలుగు పన్నెండో వారం నామినేషన్స్‌లో 8 మంది ఉన్నారు. వీరికి నిర్వహించిన బిగ్ బాస్ ఓటింగ్‌లో టాప్ 1, 2 స్థానాల్లో కల్యాణ్, తనూజ ప్లేసులు మారుతూ కొనసాగుతూ వచ్చారు. తర్వాత మూడో స్థానంలో ఇమ్మాన్యూయేల్, నాలుగో ప్లేసులో డిమాన్ పవన్, ఐదో స్థానంలో భరణి శంకర్, ఆరో ప్లేసులో సంజన ఉన్నారు.
మారిపోయిన గేమ్
అలాగే, ఏడో స్థానంలో కమెడియిన్ సుమన్ శెట్టి ఉండగా.. చివరి 8వ ప్లేసులో ఆఖరున దివ్య నిఖిత ఉంది. దాంతో దివ్య నిఖిత ఎలిమినేట్ అయింది. సెప్టెంబర్ 25న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా దివ్య నిఖిత హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఎంట్రీతో మిగతా కంటెస్టెంట్స్ గేమ్ మారిపోయింది.
రూలింగ్‌లా దివ్య బాండింగ్
మొదటి రెండు వారాల పాటు దివ్య నిఖిత గేమ్, అనాలిసిస్, స్ట్రాటజీస్, బాండింగ్స్ అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. దివ్యకు మంచి క్రేజ్ వచ్చింది. కానీ, ఆ తర్వాత దివ్య ప్రవర్తన మారుతూ వచ్చింది. ముఖ్యంగా భరణి శంకర్ విషయంలో చెల్లిగా ఉన్న దివ్య బాండింగ్ రూలింగ్‌లా మారిపోయింది.
భరణి శంకర్‌పై పెత్తనం
{{/usCountry}}మొదటి రెండు వారాల పాటు దివ్య నిఖిత గేమ్, అనాలిసిస్, స్ట్రాటజీస్, బాండింగ్స్ అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి. దివ్యకు మంచి క్రేజ్ వచ్చింది. కానీ, ఆ తర్వాత దివ్య ప్రవర్తన మారుతూ వచ్చింది. ముఖ్యంగా భరణి శంకర్ విషయంలో చెల్లిగా ఉన్న దివ్య బాండింగ్ రూలింగ్‌లా మారిపోయింది.
భరణి శంకర్‌పై పెత్తనం
{{/usCountry}}వయసులో పెద్ద అని తెలిసిన కూడా భరణి శంకర్‌పై పెత్తనం చూపించడం, తనూజతో భరణి క్లోజ్‌గా ఉంటే కోప్పడటం, తనూజపై గ్రడ్జ్ పెంచుకోవడం వంటివి చాలా చేసిందని రివ్యూవర్స్ చెప్పేవారు. ఇలా నెగెటివిటీ మూటగట్టుకుని ఫైనల్‌గా ఎలిమినేషన్‌కు గురి అయింది దివ్య నిఖిత.
దివ్య నిఖిత రెమ్యూనరేషన్
20 ఏళ్ల వయసున్న దివ్య నిఖితకు బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు వారానికి రూ. 1.5 లక్ష రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన 9 వారాల పాటు ఉన్న దివ్య నిఖిత బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ద్వారా రూ. 13.5 నుంచి రూ. 14 లక్షల వరకు సంపాదించి ఉండొచ్చని తెలుస్తోంది.