...
...
Next Story

బిగ్ బాస్ ఓటింగ్‌లో హిస్టరీ బ్రేక్ చేసిన ఇమ్మాన్యూయెల్- ఈ వారం ఇద్దరికి డేంజర్- కానీ, ఆమెకు బదులు హీరోయిన్ ఎలిమినేట్!

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ 9 తెలుగు పదకొండో వారం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. అయితే, బిగ్ బాస్ ఓటింగ్‌లో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యూయెల్ దూసుకుపోతున్నాడు. ఈ వారం ఇద్దరు లేడి కంటెస్టెంట్స్ డేంజర్ జోన్‌లో ఉండగా ఆమెకు బదులు హీరోయిన్‌ను ఎలిమినేటర్ చేయనున్నారని సమాచారం.

Published on: Nov 22, 2025, 12:31:17 IST
Advertisement

బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ బాగానే సాగుతోంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు 9 పదకొండో వారంలో ఫ్యామిలీ వీక్ నడిచింది. కంటెస్టెంట్స్‌కు సంబంధించిన తల్లిదండ్రులు, ఇతర బంధువులు ఇలా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో హౌజ్‌మేట్స్ అంతా బావోద్వేగానికి లోనయ్యారు.

పదకొండో వారం నామినేట్

బిగ్ బాస్ ఓటింగ్‌లో హిస్టరీ బ్రేక్ చేసిన ఇమ్మాన్యూయెల్- ఈ వారం ఇద్దరికి డేంజర్- కానీ, ఆమెకు బదులు హీరోయిన్ ఎలిమినేట్! (Star Maa/YouTube)
బిగ్ బాస్ ఓటింగ్‌లో హిస్టరీ బ్రేక్ చేసిన ఇమ్మాన్యూయెల్- ఈ వారం ఇద్దరికి డేంజర్- కానీ, ఆమెకు బదులు హీరోయిన్ ఎలిమినేట్! (Star Maa/YouTube)

ఇక వీకెండ్ రానే వచ్చేసింది. ఈ వారం కూడా బిగ్ బాస్ నుంచి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. అయితే, బిగ్ బాస్ ఈ వారం ఓటింగ్‌లో జబర్దస్త్ కమెడియన్ ఇమ్మాన్యూయెల్ దూసుకుపోవడం విశేషంగా మారింది. ఈ సీజన్‌లో ఎక్కువగా నామినేషన్స్‌లోకి రాని ఇమ్మాన్యూయెల్ పదకొండో వారం నామినేట్ అయ్యాడు.

హిస్టరీని బ్రేక్ చేస్తూ

ఎక్కువగా నామినేషన్స్‌లో ఉన్నవారికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండరనేది బీబీ హిస్టరీ. అయితే ఆ హిస్టరీని బ్రేక్ చేస్తూ నామినేషన్స్‌లోకి చాలా కాలం తర్వాత వచ్చి కూడా అదిరిపోయే ఓటింగ్ సంపాదించుకుంటున్నాడు ఇమ్మాన్యూయెల్. ఇకపోతే ఈ వారం బిగ్ బాస్ నామినేషన్స్‌లో ఆరుగురు ఉన్నారు.

నామినేషన్స్‌లో ఆరుగురు

ఇమ్మాన్యూయెల్, కల్యాణ్ పడాల, సంజన గల్రాని, దివ్య నిఖితా, డీమన్ పవన్, భరణి శంకర్ ఆరుగురు బిగ్ బాస్ 9 తెలుగు పదకొండో వారం నామినేట్ అయ్యారు. వీరిలో 35.03 శాతం ఓటింగ్ (55,358 ఓట్లు)తో కల్యాణ్ పడాల మొదటి ప్లేసులో ఉంటే.. 23.59 శాతం ఓటింగ్ (37,276 ఓట్లు)తో రెండో స్థానంలో ఇమ్మాన్యూయెల్ నిలిచాడు.

కల్యాణ్ మొదటి ప్లేసులో ఉన్నా

అలాగే, 14.97 శాతం ఓటింగ్ (23,651 ఓట్లు)తో భరణి శంకర్ 3వ ప్లేసులో, 10.4 శాతం ఓటింగ్ (16,437 ఓట్లు)తో డీమన్ పవన్ నాలుగో స్థానంలో, 8.67 శాతం ఓటింగ్ (13,699 ఓట్లు)తో బుజ్జిగాడు హీరోయిన్ సంజన గల్రాని ఐదో ప్లేసులో ఉన్నారు. ఇక చివరి ఆరో స్థానంలో దివ్య నిఖితా 7.35 ఓటింగ్ (11,614 ఓట్లు)తో ఉంది.

డేంజర్ జోన్‌లో ఇద్దరు

వీరిలో హీరోయిన్ సంజన, దివ్య నిఖితా ఇద్దరు లేడి కంటెస్టెంట్స్ ఈ వారం డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఓటింగ్ ప్రకారం చివరిలో ఉన్న దివ్య ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కానీ, ఆమె అరుపులు, గొడవల వల్ల కంటెంట్ ఎక్కువ వస్తుందనే ఉద్దేశంతో దివ్యను ఎలిమినేట్ నుంచి బీబీ టీమ్ తప్పించే అవకాశం కూడా ఉందని రివ్యూవర్స్ అంచనా వేస్తున్నారు.

ఎలిమినేషన్ షూటింగ్ తర్వాత

దివ్య నిఖితాకు బదులుగా ఆమె కంటే ముందు, అతి తక్కువ ఓటింగ్‌లో ఐదో స్థానంలో ఉన్న హీరోయిన్ సంజన గల్రానిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. మరి వీటిలో ఏది నిజమవుతుందో ఇవాళ (నవంబర్ 22) జరిగే బిగ్ బాస్ ఎలిమినేషన్ షూటింగ్ తర్వాత తెలుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe