...
...
Next Story

బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్‌గా కల్యాణ్ పడాల- సామాన్యుడిగా గెలుపు- ఆర్మి జవాన్ సరికొత్త రికార్డ్!

ఉత్కంఠ భరితంగా సాగిన బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలేలో కల్యాణ్ పడాల విజేతగా నిలిచారు. 105 రోజుల పాటు హోరాహోరీగా సాగిన పోరులో బిగ్ బాస్ 9 తెలుగు ట్రోఫీని గెలుచుకుని సామాన్యుడిగా కల్యాణ్ పడాల సత్తా చాటాడు. బిగ్ బాస్ తెలుగు 9లో కల్యాణ్ పడాల జర్నీపై ఇక్కడ లుక్కేద్దాం.

Published on: Dec 21, 2025, 22:28:56 IST
Advertisement

తెలుగు బుల్లితెరపై అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ 9 ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 105 రోజుల పాటు సాగిన ఈ రణరంగంలో ఎందరో సెలబ్రిటీలను దాటుకుని, ఒక సామాన్యుడిగా హౌస్‌లోకి అడుగుపెట్టిన కల్యాణ్ పడాల (Kalyan Padala) టైటిల్ విజేతగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆదివారం రాత్రి జరిగిన గ్రాండ్ ఫినాలేలో హోస్ట్ అక్కినేని నాగార్జున సమక్షంలో కల్యాణ్ పడాల బిగ్ బాస్ ట్రోఫీని అందుకున్నారు.

ఆర్మీ సోల్జర్‌గా

బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్‌గా కల్యాణ్ పడాల- సామాన్యుడిగా గెలుపు- ఆర్మి జవాన్ సరికొత్త రికార్డ్!
బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్‌గా కల్యాణ్ పడాల- సామాన్యుడిగా గెలుపు- ఆర్మి జవాన్ సరికొత్త రికార్డ్!

బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభంలో ఒక ఆర్మీ సోల్జర్‌గా, సామాన్యుల కోటాలో ఎంట్రీ ఇచ్చిన కల్యాణ్ మొదటి నుంచి తన ఆట తీరుతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. టాస్కుల్లో చూపిన తెగువ, తోటి కంటెస్టెంట్లతో వ్యవహరించిన తీరు ఆయనకు సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ బేస్‌ను తెచ్చిపెట్టాయి.

హోరాహోరీగా ఫైనల్ పోరు

ముఖ్యంగా ఫైనల్ రేసులో తనూజ, ఇమ్మాన్యుయేల్ వంటి బలమైన సెలబ్రిటీలు ఉన్నప్పటికీ కల్యాణ్ ఓటింగ్‌లో అందరికంటే ముందు నిలవడం విశేషం. గ్రాండ్ ఫినాలేలో టాప్-5 కంటెస్టెంట్లలో తొలుత సంజన, ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ ఎలిమినేట్ అయ్యారు. ఇక చివరకు రన్నరప్‌గా తనూజ పుట్టస్వామి నిలవగా, కల్యాణ్ పడాల విజేతగా ఎంపికయ్యారు.

అగ్నిపరీక్షను దాటిన యోధుడు

"ఇది నా ఒక్కడి గెలుపు కాదు, నన్ను నమ్మిన ప్రతి సామాన్యుడి గెలుపు" అని ఈ సందర్భంగా కల్యాణ్ ఉద్వేగానికి లోనయ్యారు. ఈ సీజన్ మధ్యలో కల్యాణ్ ఒక టాస్క్ సందర్భంగా తలకు తీవ్ర గాయమైనా వెనకడుగు వేయకుండా పోరాడటం అందరినీ కదిలించింది.

22 మంది కంటెస్టెంట్లతో

ఆ పట్టుదలే ఆయనను ఈరోజు విజేతగా నిలబెట్టిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం 22 మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ కల్యాణ్ గెలుపుతో ఒక మధురమైన ముగింపును అందుకుంది.

ఆర్మీ జవాన్ రికార్డ్

ఇదిలా ఉంటే రన్నరప్‌గా సీరియల్ హీరోయిన్ తనూజ గౌడ నిలిచింది. కల్యాణ్ పడాల, తనూజ పుట్టస్వామి మధ్య గట్టి పోటీ ఏర్పడింది. తొలిసారిగా ఓ లేడి టైటిల్ విన్నర్ అవుతుందని చాలా మంది ఫిక్స్ అయ్యారు. కానీ, అతి తక్కువ ఓటింగ్ శాతంతో కల్యాణ్ పడాల విజేతగా నిలిచాడు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks