బుల్లితెర అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్-9' గ్రాండ్ ఫినాలే ఆదివారం (డిసెంబర్ 21) రాత్రి అట్టహాసంగా ముగిసింది. గత 15 వారాలుగా కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ఈ షో విజేతగా సామాన్య కంటెస్టెంట్, మాజీ సైనికుడు కల్యాణ్ పడాల నిలిచాడు.
టైటిల్ విజేతగా

ఆరంభంలో అంచనాలు లేకపోయినా, తనదైన శైలిలో ఆడుతూ 'మొదటి ఫైనలిస్ట్'గా రికార్డు సృష్టించిన కల్యాణ్ చివరికి టైటిల్ ఎగరేసుకుపోయి 'జై జవాన్' అనిపించుకున్నారు. రన్నరప్‌గా సీరియల్ హీరోయిన్ తనూజ పుట్టస్వామి నిలిచింది.
సూట్‌కేస్ ట్విస్ట్!
టాప్-3 కంటెస్టెంట్లుగా కల్యాణ్ పడాల, తనూజ, డీమాన్ పవన్ మిగిలిన సమయంలో బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మాస్ మహారాజా రవితేజ హౌస్‌లోకి అడుగుపెట్టి రూ. 15 లక్షల సూట్‌కేస్ ఆఫర్ ప్రకటించారు. చాలా సేపు ఆలోచించిన తర్వాత డిమాన్ పవన్ ఆ మొత్తాన్ని తీసుకుని రేసు నుంచి తప్పుకున్నాడు.
దీనివల్ల విజేతకు దక్కాల్సిన రూ. 50 లక్షల ప్రైజ్ మనీ నుంచు 15 లక్షలు పోగా రూ. 35 లక్షలు మిగిలాయి. అంటే టైటిల్ విజేతకు ప్రైజ్ మనీగా రూ. 35 లక్షలు మాత్రమే వచ్చాయన్నమాట.
కల్యాణ్ పడాల అందుకున్న బహుమతులు ఇవే:
విజేతగా నిలిచిన కల్యాణ్ పడాలకు హోస్ట్ నాగార్జున ట్రోఫీతో పాటు భారీ బహుమతులను అందజేశారు.
నగదు బహుమతి: రూ. 35 లక్షలు (సూట్‌కేస్ ఆఫర్ పోను).
లగ్జరీ కారు: మారుతి సుజుకి వెక్టోరిస్ (Maruti Suzuki Vectoris).
{{/usCountry}}లగ్జరీ కారు: మారుతి సుజుకి వెక్టోరిస్ (Maruti Suzuki Vectoris).
{{/usCountry}}అదనపు బోనస్: రాఫ్ టైల్స్ వారి నుంచి మరో రూ. 5 లక్షల నగదు.
కల్యాణ్ పడాల రెమ్యూనరేషన్
బిగ్ బాస్ హౌజ్‌లో పాల్గొన్నందుకు కల్యాణ్ పడాలకు రోజుకు రూ. 10 వేల పారితోషికం ఇచ్చారు. అంటే, అందరిలాగే వారానికి రూ. 70 వేల రెమ్యూనరేషన్. ఈ లెక్కన 15 వారాలకు రూ. 10 లక్షల 50 వేలు బిగ్ బాస్‌లో పాల్గొన్నందుకు సంపాదించాడు కల్యాణ్ పడాల.
కారు ధర
బిగ్ బాస్ ప్రైజ్ మనీ, రెమ్యూనరేషన్‌తో కలిపి రూ. 45 లక్షల 50 వేలు అవుతుంది. మారుతి సుజుకి వెక్టోరిస్ ధర సుమారుగా రూ. 10 నుంచి 20 లక్షల మధ్య ఉంటుంది. దాంతోపాటు రాఫ్ టైల్స్ వారి నుంచి రూ. 5 లక్షల నగదు కూడా కల్యాణ్ పడాలకు అందింది.
కల్యాణ్ పడాల సంపాదన
ఇవన్నీ లెక్కేస్తే బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ద్వారా కల్యాణ్ పడాల సుమారుగా రూ. 60 నుంచి 70 లక్షల వరకు సంపాదించినట్లు సమాచారం. ఆర్మీ జవాన్‌గా సేవలు అందించి, కామనర్‌గా బిగ్ బాస్‌లోకి అడుగుపెట్ట ఈ రేంజ్‌లో పేరు, మనీ సంపాదించడం కల్యాణ్ పడాలకే దక్కిందని అభిమానులు పొగుడుతున్నారు.