హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఏఐ టెక్నాలజీ సంస్థ బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ సొల్యూషన్స్ డిజిటల్ హెల్త్‌కేర్ రంగంలో కీలక మైలురాయిని చేరుకుంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్ ఘట్టమనేని నేతృత్వంలోని 'మహేష్ బాబు ఫౌండేషన్'తో ఈ స్మాల్ క్యాప్ ఐటీ కంపెనీ వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
గౌతమ్ పుట్టినరోజున 'GMB Life' యాప్ అందుబాటులోకి

ఈ రెండు సంస్థల భాగస్వామ్యంలో మొదటి ప్రాజెక్ట్‌గా 'జిఎమ్‌బి లైఫ్' (GMB Life) అనే ప్రివెంటివ్ స్క్రీనింగ్ యాప్‌ను ఆవిష్కరించారు. సూపర్‌స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ ఘట్టమనేని పుట్టినరోజును పురస్కరించుకుని ఈ యాప్‌ను ఆపిల్ యాప్ స్టోర్, గూగుల్ ప్లే స్టోర్‌లలో అందుబాటులోకి తెచ్చారు.
బ్లూ క్లౌడ్ సొంతంగా అభివృద్ధి చేసిన 'బ్లూహెల్త్' (BluHealth) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేదిక ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుంది. స్మార్ట్‌ఫోన్ కెమెరా సహాయంతో సాధారణ స్కానింగ్ ద్వారానే గుండె స్పందనల రేటు, రక్తపోటు (బిపి), శ్వాసక్రియ రేటు, స్ట్రెస్ ఇండెక్స్, బాడీ మాస్ ఇండెక్స్ (బిఎమ్‌ఐ), వాస్కులర్ ఏజ్ వంటి పలు ప్రాథమిక ఆరోగ్య వివరాలను ఒక్క నిమిషంలోనే ఈ యాప్ అంచనా వేస్తుంది. దీని కోసం ఎలాంటి మెడికల్ డివైజ్‌లు లేదా సూదుల అవసరం లేదు.
గ్రామీణ ప్రాంతాల్లో హెల్త్‌కేర్ కియోస్క్‌లు
ఈ యాప్ ద్వారా మహేష్ బాబు ఫౌండేషన్ నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలు, హెల్త్ క్యాంప్‌ల వివరాలు తెలుసుకోవడంతో పాటు నేరుగా రిజిస్టర్ చేసుకోవచ్చు. మలి విడత ప్రాజెక్ట్‌లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక హెల్త్‌కేర్ కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని ఇరు సంస్థలు నిర్ణయించాయి. ఈ కియోస్క్‌ల ద్వారా స్థానిక వైద్యులు ప్రత్యక్షంగా లేదా టెలీ-కన్సల్టేషన్ విధానంలో రోగుల నివేదికలను పరిశీలించి తగిన వైద్య సలహాలు అందిస్తారు.
"సమయానికి వైద్యం దక్కక ఏ తల్లిదండ్రులూ తమ బిడ్డను కోల్పోకూడదనే స్పష్టమైన లక్ష్యంతోనే మా ఫౌండేషన్ మొదలైంది. జిఎమ్‌బి లైఫ్ యాప్‌లోని బ్లూహెల్త్ ఏఐ టెక్నాలజీ ద్వారా స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ చాలా సులభంగా తమ ఆరోగ్య స్థితిని ప్రాథమికంగా పరీక్షించుకోవచ్చు" అని మహేష్ బాబు తెలిపారు.
{{/usCountry}}"సమయానికి వైద్యం దక్కక ఏ తల్లిదండ్రులూ తమ బిడ్డను కోల్పోకూడదనే స్పష్టమైన లక్ష్యంతోనే మా ఫౌండేషన్ మొదలైంది. జిఎమ్‌బి లైఫ్ యాప్‌లోని బ్లూహెల్త్ ఏఐ టెక్నాలజీ ద్వారా స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ చాలా సులభంగా తమ ఆరోగ్య స్థితిని ప్రాథమికంగా పరీక్షించుకోవచ్చు" అని మహేష్ బాబు తెలిపారు.
{{/usCountry}}"చిన్నారుల ప్రాణాలు కాపాడుతూ సామాజిక సేవలో ముందంజలో ఉన్న మహేష్ బాబు గారు, నమ్రత గారితో కలిసి పనిచేసే అవకాశం రావడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం. స్మార్ట్‌ఫోన్ సాంకేతికత ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి ఉచిత ప్రాథమిక ఆరోగ్య పరీక్షలను అందించడమే మా ప్రధాన ఉద్దేశం" అని బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ గ్రూప్ ఛైర్మన్ తేజేష్ కుమార్ కొడాలి వెల్లడించారు.
స్టాక్ మార్కెట్ తీరు.. షేరు ప్రయాణం
మరోవైపు అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలు, దలాల్ స్ట్రీట్‌లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి మధ్య బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ షేరు ఈరోజు బీఎస్ఈలో రూ.20.25 వద్ద ప్రారంభమై స్వల్ప నష్టాల్లో ముగిసింది. గత శుక్రవారం ఈ షేరు క్రితం ముగింపు రూ.20.21 వద్ద ఉంది. పశ్చిమాసియాలో పెరిగిన ఆందోళనలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల వైఖరి కారణాలతో దేశీయ సూచీలు సైతం పతనమయ్యాయి. సెన్సెక్స్ 284.52 పాయింట్లు క్షీణించి 76,979.99 వద్ద, నిఫ్టీ 58.10 పాయింట్లు పడిపోయి 24,117.55 వద్ద ముగిశాయి.
బ్లూ క్లౌడ్ సాఫ్ట్‌టెక్ స్మాల్ క్యాప్ షేరు గత వారంలో 12.43% క్షీణించగా, గత నెల రోజుల్లో 3% పైగా లాభపడింది. ఏడాది కాల పరిమితిలో 32% మేర పడిపోయినప్పటికీ, గడిచిన ఐదేళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు 242% మల్టీబ్యాగర్ రాబడిని అందించింది.
(గమనిక: ఈ సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. స్టాక్ మార్కెట్‌లో ఎలాంటి పెట్టుబడులు పెట్టేముందు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్లను సంప్రదించడం శ్రేయస్కరం.)