...
...
Next Story

Bobby Deol: జనాలకు పనేమీ లేనట్టుంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 90 శాతం అవే ఉంటాయి- అలియా భట్‌తో గొడవపై యానిమల్ విలన్ బాబీ డియోల్

Bobby Deol Denies Fight With Alia Bhatt: స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆల్ఫా షూటింగ్ సెట్స్‌లో స్టార్ హీరోయిన్ అలియా భట్, యానిమల్ విలన్ బాబీ డియోల్ మధ్య గొడవలు జరిగాయాంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన ఘాటుగా స్పందించారు. దాంతో నటుడు బాబీ డియోల్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: Jun 1, 2026, 09:26:56 IST
Advertisement

Bobby Deol Slams Fight With Alia Bhatt: టాలీవుడ్‌లో 'హరిహర వీరమల్లు', 'కంగువ' 'యానిమల్' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన బాలీవుడ్ సీనియర్ స్టార్ బాబీ డియోల్ తాజాగా సోషల్ మీడియా రూమర్లపై ఘాటుగా స్పందించారు.

విలన్ పాత్రలతో

జనాలకు పనేమీ లేనట్టుంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 90 శాతం అవే ఉంటాయి- అలియా భట్‌తో గొడవపై యానిమల్ విలన్ బాబీ డియోల్
జనాలకు పనేమీ లేనట్టుంది, ఇన్‌స్టాగ్రామ్‌లో 90 శాతం అవే ఉంటాయి- అలియా భట్‌తో గొడవపై యానిమల్ విలన్ బాబీ డియోల్

'యానిమల్' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి లార్జర్ దాన్ లైఫ్ విలన్ పాత్రలతో దూసుకుపోతున్నారు బాబీ డియోల్. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ అలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న క్రేజీ స్పై యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఆల్ఫా' (Alpha)లో బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

అయితే గత కొన్ని రోజులుగా ఆల్ఫా సినిమా సెట్స్‌లో అలియా భట్, బాబీ డియోల్ మధ్య తీవ్రమైన గొడవలు జరిగాయని, వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయంటూ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌ (ట్విట్టర్) వేదికలుగా జోరుగా ప్రచారం సాగుతోంది. తాజాగా ప్రముఖ టాక్ షో 'ఆప్ కీ అదాలత్'లో పాల్గొన్న బాబీ డియోల్ ఈ పుకార్లకు పూర్తిగా చెక్ పెట్టారు.

జనాలకు ఖాళీ ఎక్కువైంది.. బాబీ డియోల్ ఆగ్రహం

ఈ వివాదంపై బాబీ డియోల్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలపై మండిపడ్డారు. "నా స్నేహితుడు ఒకరు ఈ రూమర్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ పంపినప్పుడు నేను షాక్ అయ్యాను. జనాలకు పనేమీ లేనట్టుంది, అందుకే కూర్చుని ఇలాంటి కథలు అల్లేస్తున్నారు" అని బాబీ డియోల్ ఘాటుగా స్పందించారు.

అలియా భట్ అంకితభావాన్ని బాబీ డియోల్ ఎంతగానో ప్రశంసించారు. "అలియాతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభూతి. తను చాలా కష్టపడుతుంది. ఈ సినిమాలో ఉండే యాక్షన్, ఫైట్ సీక్వెన్స్‌ల కోసం తను ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేసింది" అని చెప్పారు బాబీ డియోల్.

"అంతా సవ్యంగా సాగుతుంటే ఇలాంటి అబద్ధాలు ఎందుకు రాస్తారో అర్థం కావడం లేదు. పైగా నన్ను కూల్ చేయడానికి నిర్మాత ఆదిత్య చోప్రా మరో సినిమా ఆఫర్ చేశారంటూ కొత్త కథలు మొదలుపెట్టారు. ప్రతి ఒక్కరికీ నేను నిజాలు నిరూపించుకుంటూ కూర్చోలేను. ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చే వార్తల్లో 90 శాతం అబద్ధాలే ఉంటాయి" అని బాబీ డియోల్ తేల్చి చెప్పారు.

వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో 'ఆల్ఫా'

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న 'ఆల్ఫా' చిత్రానికి శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్నారు. యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. గతంలో వచ్చిన ఏక్ థా టైగర్, వార్, పఠాన్, టైగర్ 3 వంటి బ్లాక్ బస్టర్ల సరసన ఈ సినిమా చేరనుంది.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' సినిమా చివర్లో (పోస్ట్ క్రెడిట్ సీన్) ఈ ఆల్ఫా సినిమా ఫస్ట్ లుక్‌ను చూపించి అంచనాలు పెంచేశారు. ఈ సినిమాలో అలియా భట్, బాబీ డియోల్‌తో పాటు మరో హాట్ బ్యూటూ శార్వరి వాఘ్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ స్పై యాక్షన్ డ్రామా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

జూన్ 5న బాబీ డియోల్ 'బందర్'

ఆల్ఫా సినిమా కంటే ముందే బాబీ డియోల్ నటించిన మరో వైవిధ్యమైన చిత్రం 'బందర్' విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన ఈ క్రైమ్ డ్రామాలో సాన్యా మల్హోత్రా కీలక పాత్ర పోషించారు.

గతేడాది టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమై ప్రశంసలు అందుకున్న ఈ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే ఈ రెండు విభిన్నమైన పాత్రలతో బాబీ డియోల్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks