సినీ తారల్లో ఎంతోమంది బరువు పెరగడం, తగ్గడం వంటివి చేశారు. కానీ, ఏకంగా 40 కిలోల బరువు తగ్గి హాట్ బ్యూటీగా క్రేజ్ సంపాదించుకుంది ఓ హీరోయిన్. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ గ్లామర్ బ్యూటీ భూమి పెడ్నేకర్. అయితే, భూమి పెడ్నేకర్ అనగానే ‘దమ్ లగా కే హైషా’ సినిమా గుర్తొస్తుంది.
ఆ ప్రచారం

‘దమ్ లగా కే హైషా’ మూవీ కోసం భారీగా బరువు పెరిగిన భూమి పెడ్నేకర్ ఆ తర్వాత కేవలం కొద్ది కాలంలోనే 30 కిలోలు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ప్రస్తుత కాలంలో సెలబ్రిటీలు బరువు తగ్గుతున్నారంటే చాలు.. వారు ‘ఓజెంపిక్’ (Ozempic) వంటి ఇంజెక్షన్లు వాడుతున్నారని ప్రచారం జరగడం సాధారణమైపోయింది.
భూమి పెడ్నేకర్ కూడా అలాంటి ఇంజక్షన్స్ వాడిందంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి వస్తున్న రూమర్లపై భూమి పెడ్నేకర్ చాలా ఘాటుగా స్పందించారు.
డెంగ్యూ వల్ల 12 కిలోలు తగ్గాను!
మరో బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న పాడ్‌కాస్ట్‌లో భూమి పెడ్నేకర్ తన ఆరోగ్య సమస్యల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. 2023 నవంబర్‌లో తాను డెంగ్యూ బారిన పడి ఆస్పత్రిలో చేరిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
"ఆ సమయంలో నేను పడ్డ నరకం అంతా ఇంతా కాదు. ఒకవైపు దీపావళి టపాసుల శబ్దాలు, మరోవైపు తల పగిలిపోయేంతగా తలనొప్పి. ఆ అనారోగ్యం వల్ల నేను 12 కిలోల బరువు తగ్గడంతో పాటు సగం జుట్టును కోల్పోయాను" అని భూమి పెడ్నేకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఒక పాత్ర కోసం తాను మరింత కష్టపడి బరువు తగ్గానని తెలిపారు.
ఇంజక్షన్స్ వాడుతున్నారా?
ఇంజెక్షన్లు వాడకుండా బరువు తగ్గడం అసాధ్యమనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని భూమి పెడ్నేకర్ అసహనం వ్యక్తం చేశారు. "నేను పదేళ్ల పాటు జిమ్‌లో చెమటోడ్చాను. పద్ధతిగా ఆహారం తీసుకున్నాను. కానీ, ప్రజలు మాత్రం ‘మీరు పక్కటెముక తొలగించుకున్నారా?’ అని అడుగుతున్నారు" అని భూమి తెలిపారు.
{{/usCountry}}ఇంజెక్షన్లు వాడకుండా బరువు తగ్గడం అసాధ్యమనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని భూమి పెడ్నేకర్ అసహనం వ్యక్తం చేశారు. "నేను పదేళ్ల పాటు జిమ్‌లో చెమటోడ్చాను. పద్ధతిగా ఆహారం తీసుకున్నాను. కానీ, ప్రజలు మాత్రం ‘మీరు పక్కటెముక తొలగించుకున్నారా?’ అని అడుగుతున్నారు" అని భూమి తెలిపారు.
{{/usCountry}}"ఢిల్లీలో అయితే మహిళలు నేరుగా నా దగ్గరకు వచ్చి ‘మీరు కూడా ఓజెంపిక్ లేదా మౌంజారో ఇంజెక్షన్లు తీసుకున్నారా?’ అని అడిగేశారు. నిజానికి నేను 40 కిలోల కంటే ఎక్కువ బరువు తగ్గాను, అది కూడా ఎలాంటి ఇంజెక్షన్లు లేకుండానే" అని భూమి పెడ్నేకర్ స్పష్టం చేశారు.
వైద్యపరమైన అవసరం ఉండి ఆ మందులు వాడేవారిని తాను తప్పుపట్టనని, కానీ తన కష్టాన్ని గుర్తించకపోవడం బాధ కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు బ్యూటిపుల్ హీరోయిన్ భూమి పెడ్నేకర్.
ఏమిటీ ఓజెంపిక్?
అయితే, ఓజెంపిక్, మౌంజారో అనేవి ప్రాథమికంగా టైప్-2 డయాబెటిస్ రోగుల కోసం ఇచ్చే ఇంజక్షన్ మందులు. ఇవి ఆకలిని తగ్గించి, కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. ఈ లక్షణం వల్ల చాలామంది వీటిని బరువు తగ్గడానికి వాడుతున్నారు. అయితే, వైద్యుల పర్యవేక్షణ లేకుండా వీటిని వాడటం వల్ల తీవ్రమైన దుష్ప్రభావాలు (Side effects) కలిగే ప్రమాదం ఉంది.
భూమి కెరీర్ ముచ్చట్లు
కాగా, భూమి పెడ్నేకర్ చివరిగా 2025లో విడుదలైన ‘మేరే హస్బెండ్ కీ బీవీ’ సినిమాలో కనిపించారు. అర్జున్ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది.
ప్రస్తుతం ఇషాన్ ఖట్టర్‌తో కలిసి ‘ది రాయల్స్’ సీజన్ 2లో భూమి పెడ్నేకర్ నటిస్తున్నారు. అయితే, ది రాయల్స్ 2 ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఓటీటీ సిరీస్ ది రాయల్స్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.