...
...
Next Story

Rohit Shetty Threat: యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి చంపేస్తామని బెదిరింపులు- 20 కోట్ల రౌడీ మాములు ఇవ్వాలని డిమాండ్!

Death Threats To Rohit Shetty: బాలీవుడ్ మాస్ యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి మరోసారి ప్రాణాపాయ బెదిరింపులు వచ్చాయి. శనివారం ఆయన ముంబై కార్యాలయానికి ఫోన్ చేసిన గుర్తుతెలియని దుండగుడు రూ. 20 కోట్ల డబ్బు డిమాండ్ చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Published on: Jun 28, 2026, 21:45:25 IST
Advertisement

Death Threats To Director Rohit Shetty: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుస యాక్షన్ హిట్స్‌తో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి మరోసారి చావు బెదిరింపులు ఎదురయ్యాయి. జూన్ 27 శనివారం నాడు ముంబైలో ఉన్న ఆయన కార్యాలయానికి ఒక అజ్ఞాత ఫోన్ కాల్ వచ్చింది.

20 కోట్లు ఇవ్వాలని డిమాండ్

యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి చంపేస్తామని బెదిరింపులు- 20 కోట్ల రౌడీ మాములు ఇవ్వాలని డిమాండ్!
యాక్షన్ డైరెక్టర్ రోహిత్ శెట్టికి చంపేస్తామని బెదిరింపులు- 20 కోట్ల రౌడీ మాములు ఇవ్వాలని డిమాండ్!

ఫోన్ చేసిన వ్యక్తి రోహిత్ శెట్టిని ఘోరంగా చంపేస్తామని హెచ్చరిస్తూ ఏకంగా రూ. 20 కోట్ల రౌడీ మామూలు (ఫిరోతీ) డిమాండ్ చేశాడు. ఈ హఠాత్పరిణామంతో షాకైన రోహిత్ శెట్టి సిబ్బంది ఆలస్యం చేయకుండా ముంబై పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.

'సింగం', 'గోల్‌మాల్' సిరీస్ చిత్రాలతో పాటు తెలుగు సూపర్ హిట్ 'టెంపర్' సినిమాను హిందీలో 'సింబా'గా రీమేక్ చేసిన రోహిత్ శెట్టికి ఇలాంటి బెదిరింపులు రావడం చిత్రసీమలో సంచలనం సృష్టిస్తోంది. అయితే, ఈ యాక్షన్ డైరెక్టర్ హత్య బెదిరింపులపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఆఫీస్‌కు ఫోన్ కాల్.. రంగంలోకి ముంబై పోలీసులు

దర్శకుడి కార్యాలయానికి వచ్చిన ఈ బెదిరింపు కాల్‌పై రోహిత్ శెట్టి బృందం వెంటనే పోలీసులకు రాతపూర్వక ఫిర్యాదు అందించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఫోన్ నంబర్ ఆధారంగా లోకేషన్‌ను ట్రాక్ చేసే పనిలో పడ్డారు.

గతంలో బాలీవుడ్ ప్రముఖులకు వచ్చిన బెదిరింపు కాల్స్ వాయిస్ శాంపిల్స్‌తో ఈ కొత్త కాల్ ఆడియోను సరిపోల్చుతున్నారు. నిందితుడు వాడిన ఫోన్ నెట్‌వర్క్, మాట్లాడిన విధానాన్ని బట్టి ఇది లారెన్స్ బిష్ణోయ్ ముఠా పనే అయి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే ఈ బెదిరింపుకు సంబంధించి ఇప్పటివరకు ఏ గ్యాంగ్ కూడా అధికారికంగా బాధ్యత ప్రకటించలేదు.

రోహిత్ శెట్టికి ఇలాంటి బెదిరింపులు రావడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ముంబైలోని ఆయన నివాసం వెలుపల ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు బైక్‌పై వచ్చి కాల్పులు జరిపారు. ఆ సమయంలో జరిగిన సుదీర్ఘ దర్యాప్తులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు లభించాయి. ఆ కేసులో పోలీసులు ఇప్పటివరకు 15 మందిని అరెస్ట్ చేశారు.

ప్రస్తుతం 'ఖత్రోన్ కే ఖిలాడీ 14' ఓటీటీ రియాలిటీ షోతో బిజీగా ఉన్న రోహిత్ శెట్టిని ఈ ముఠా నిరంతరం టార్గెట్ చేయడం బాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఈ ముఠా నుంచి యంగ్ హీరో రణ్‌వీర్ సింగ్‌కు కూడా ఇలాంటి హెచ్చరికలు వచ్చాయి.

సల్మాన్ ఖాన్ ఇల్లు మార్పు.. బాలీవుడ్‌ను వణికిస్తున్న గ్యాంగ్స్

గత కొన్నేళ్లుగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌ను లారెన్స్ బిష్ణోయ్ ముఠా వేధిస్తోంది. సల్మాన్ ఇంటిపై గతంలో దుండగులు తుపాకులతో కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. తనతో పాటు కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని సల్మాన్ ఖాన్ తన పాత నివాసాన్ని మారుస్తున్నారు.

ముంబైలో కొత్తగా నిర్మిస్తున్న అత్యంత సురక్షితమైన భవనంలోకి ఆయన త్వరలోనే షిఫ్ట్ కాబోతున్నట్లు సమాచారం. ఉత్తరాది చిత్ర పరిశ్రమను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ సంస్కృతి ఇప్పుడు అగ్ర దర్శకులను సైతం భయభ్రాంతులకు గురిచేస్తోంది. రోహిత్ శెట్టి తాజా కేసును ఛేదించేందుకు సైబర్ క్రైమ్ విభాగం రాత్రింబవళ్లు శ్రమిస్తోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks