Hero Real Story: బ్యాంక్ ఖాతాలో 18 రూపాయలు, రోజుకు 140 కిలో మీటర్ల సైక్లింగ్- ఫ్రూటీ, బిస్కెట్లతో లంచ్-హీరో రియల్ స్టోరీ

Rajkummar Rao Real Story On His Birthday: వెర్సటైల్ హీరో రాజ్ కుమార్ రావు తన 42వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకున్నారు. ముంబైలో తిండికి డబ్బుల్లేక రూ.4తోనే కడుపు నింపుకున్న రోజుల నుంచి జాతీయ అవార్డు గ్రహీతగా ఎదిగిన రాజ్ కుమార్ ఇన్సిపిరేషనల్ స్టోరీ.

Published on: Aug 31, 2026, 19:34:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Rajkummar Rao Real Story On His Birthday: బాలీవుడ్ స్టార్ హీరోల్లో రాజ్ కుమార్ రావు రూటే వేరు. కమర్షియల్ హంగులతో సంబంధం లేకుండా కథాబలమున్న సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ నేషనల్ అవార్డు విన్నర్.

బ్యాంక్ ఖాతాలో 18 రూపాయలు, రోజుకు 140 కిలో మీటర్ల సైక్లింగ్- ఫ్రూటీ, బిస్కెట్లతో లంచ్-హీరో రియల్ స్టోరీ
బ్యాంక్ ఖాతాలో 18 రూపాయలు, రోజుకు 140 కిలో మీటర్ల సైక్లింగ్- ఫ్రూటీ, బిస్కెట్లతో లంచ్-హీరో రియల్ స్టోరీ

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి, స్టార్‌డమ్ సొంతం చేసుకున్న రాజ్ కుమార్ రావు 42వ ఏట ప్రవేశించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రావు బాలీవుడ్ ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు, కన్నీటి గాథలు సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

రోజుకు 140 కిలోమీటర్ల సైక్లింగ్!

గురుగ్రామ్‌కు చెందిన రాజ్ కుమార్ రావుకు చిన్నప్పటి నుంచే నటనపై పిచ్చి ఉండేది. స్కూల్ రోజుల్లోనే థియేటర్ ఆర్టిస్ట్‌గా రాణించిన ఆయనలోని ప్రతిభను గుర్తించిన తల్లి, నటన వైపు వెళ్లమని ప్రోత్సహించారు. 18 ఏళ్ల వయసులో ఢిల్లీలోని 'శ్రీరామ్ సెంటర్'లో యాక్టింగ్ క్లాసులకు వెళ్లేందుకు ప్రతీరోజూ గురుగ్రామ్ నుంచి ఢిల్లీకి సైకిల్‌పై వెళ్లేవారు.

అటు ఇటు కలిపి రోజుకు ఏకంగా 140 కిలోమీటర్లు ప్రయాణించేవారు. ఆ సమయంలో వాక్‌మెన్‌లో "లక్ష్య", "పాపా కహ్తే హై" పాటలు వింటూ ప్రయాణం సాగించేవారని, అది వినడానికి కాస్త సినిమాటిక్‌గా అనిపించినా, అప్పట్లో తన అసలు నిజ జీవితం అదేనని రాజ్ కుమార్ రావు వెల్లడించారు.

బ్యాంక్ ఖాతాలో 18 రూపాయలు

దిబాకర్ బెనర్జీ దర్శకత్వంలో వచ్చిన 'లవ్ సెక్స్ ఔర్ ధోకా' సినిమాతో రాజ్‌ కుమార్ రావు వెండితెరకు పరిచయమయ్యారు. ఆ సినిమాకు ఆయనకు లభించిన రెమ్యూనరేషన్ కేవలం రూ.11,000 మాత్రమే.

ఆ డబ్బుతోనే నెల రోజులు గడిపిన రాజ్‌ కుమార్, ఎంతటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా డబ్బుల కోసం నాసిరకం పాత్రలను ఒప్పుకోలేదు. ముంబై మహానగరం ఆయనకు ఎన్నో చేదు అనుభవాలను మిగిల్చింది. ఒకానొక దశలో బ్యాంకు ఖాతాలో కేవలం 18 రూపాయలు మాత్రమే మిగిలాయి.

రూ.4తో మధ్యాహ్న భోజనం!

"జీవితంలో అత్యంత కష్టమైన సమయం అంటే ఆర్థిక ఇబ్బందులు రావడం, చేతిలో ఒక్క సినిమా కూడా లేకపోవడమే. నా తల్లి నన్ను ఎంతో ఆదుకుంది. డబ్బులు లేనప్పుడు ఆమె సర్దుబాటు చేసి పంపించేది" అని రాజ్ కుమార్ రావు చెప్పాడు.

"ముంబై లాంటి నగరంలో నా ఖాతాలో కేవలం 18 రూపాయలు ఉన్న రోజులు గుర్తున్నాయి. ముగ్గురం కలిసి ఒకే ఫ్లాట్‌లో ఉండేవాళ్లం. మధ్యాహ్నం భోజనం మానేసి రూ.2ల పార్లే-జి బిస్కెట్ ప్యాకెట్, రూ.2ల ఫ్రూటీతో కడుపు నింపుకునేవాడిని" అని రాజ్ ‌కుమార్ రావు తన పాత రోజులను గుర్తుచేసుకున్నారు. ఆ కష్ట కాలంలో ఎఫ్‌టీఐఐ (FTII) స్నేహితులు, సీనియర్లు ఆయనకు భోజనం పెట్టి ఆదుకున్నారట

జాతీయ అవార్డు నుంచి రాబోయే ప్రాజెక్టుల వరకు..

ఇదిలా ఉంటే.. 'గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్ 2', 'కై పో చే', 'క్వీన్', 'షైతాన్', 'అలీఘర్' వంటి సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న రాజ్‌ కుమార్ రావు 'షాహిద్' చిత్రానికి గానూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును ముద్దాడారు.

హీరోగా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించినా, సాధించకపోయినా ప్రతీ పాత్రలోనూ తన నటనతో జీవించేశారు రాజ్ కుమార్. ఇటీవల సాన్యా మల్హోత్రాతో కలిసి 'టోస్టర్' చిత్రంలో మెరిసిన ఆయన, త్వరలోనే 'ప్రహార్: ది ఉజ్జ్వల్ నికమ్ స్టోరీ'తో అలరించనున్నారు.

కోర్ట్ రూమ్ డ్రామాతో

ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్జ్వల్ నికమ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ కోర్ట్ రూమ్ డ్రామాలో రాజ్ కుమార్ రావు కీలక పాత్ర పోషిస్తున్నారు. 26/11 ముంబై తీవ్రవాద దాడి కేసులో కసబ్ విచారణ సహా పలు సంచలనాత్మక కేసుల నేపథ్యాన్ని ఇందులో చూపించనున్నారు. అవినాష్ అరుణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్ నిర్మిస్తున్నారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More