80వ దశకంలో బాలీవుడ్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జంటల్లో గోవిందా, నీలం కొఠారి జోడీ ఒకటి. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడమే కాకుండా, వారి కెమిస్ట్రీ చూసి వీరిద్దరూ నిజ జీవితంలోనూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
పుకార్లపై నీలం కొఠారి

స్వయంగా గోవిందా కూడా ఒకానొక సందర్భంలో తాను నీలం పట్ల ఆకర్షితుడనయ్యానని, ఆమెను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నానని గతంలో గోవిందా వెల్లడించారు. అయితే, తాజాగా ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సీనియర్ హీరోయిన్ నీలం కొఠారి పాత జ్ఞాపకాలు, పుకార్లపై స్పందించారు.
గోవిందాతో ఎఫైర్? నీలం సమాధానం ఇదే!
ఉషా కాకడే ప్రొడక్షన్స్ పాడ్‌కాస్ట్‌లో గోవిందాతో లవ్ ఎఫైర్ గురించి నీలం కొఠారి మాట్లాడుతూ.. "బాబోయ్! ఈ మాట ఎవరు చెప్పారు? గోవిందా గారు చాలా మంచి వ్యక్తి. ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. మేమిద్దరం కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించాం. ఆయన అద్భుతమైన మనిషి, కానీ మా మధ్య ఎలాంటి సంబంధం లేదనేది వాస్తవం. సారీ.. కానీ ఈ వార్తలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను" అని స్పష్టం చేశారు.
ఏదో ఉందనే ముద్ర వేసేవారు
ఆ కాలంలో మీడియా పోకడల గురించి వివరిస్తూ.. "అప్పట్లో ఒక హీరో హీరోయిన్ కలిసి వరుసగా రెండు మూడు సినిమాలు చేశారంటే చాలు, వారిద్దరి మధ్య ఏదో ఉందనే ముద్ర వేసేవారు. పత్రికల్లో వారికి నచ్చింది రాసేవారు. నిజం చెప్పాలంటే అప్పట్లో మాకు ప్రెస్ (మీడియా) అంటే భయం వేసేది. ఎందుకంటే అప్పుడు పెన్నుకున్న శక్తి అలాంటిది. వివరణ ఇచ్చే అవకాశం కూడా ఉండేది కాదు" అని నీలం కొఠారి ఆనాటి రోజులను గుర్తు చేసుకున్నారు.
మనసు పారేసుకున్నానని చెప్పిన గోవిందా
నీలం కొఠారి ఇప్పుడు ఈ వార్తలను కొట్టిపారేసినప్పటికీ, గతంలో గోవిందా మాత్రం తన మనసులోని మాటను బహిరంగంగానే చెప్పారు. అప్పట్లో ఒక సినిమా మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోవిందా మాట్లాడుతూ.. "మేము కలిసి చాలా సినిమాలు చేశాం. తరచూ కలుస్తుండటంతో ఆమె (నీలం కొఠారి) గురించి తెలిసే కొద్దీ నాకు ఇష్టం పెరిగింది. ఏ మగాడైనా మనసు పారేసుకునే అందం, వ్యక్తిత్వం నీలం సొంతం. నేను కూడా ఆమెను చూసి ఫ్లాట్ అయ్యాను" అని పేర్కొన్నారు.
వెండితెరపై అలరించిన ఈ జోడీ
{{/usCountry}}నీలం కొఠారి ఇప్పుడు ఈ వార్తలను కొట్టిపారేసినప్పటికీ, గతంలో గోవిందా మాత్రం తన మనసులోని మాటను బహిరంగంగానే చెప్పారు. అప్పట్లో ఒక సినిమా మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోవిందా మాట్లాడుతూ.. "మేము కలిసి చాలా సినిమాలు చేశాం. తరచూ కలుస్తుండటంతో ఆమె (నీలం కొఠారి) గురించి తెలిసే కొద్దీ నాకు ఇష్టం పెరిగింది. ఏ మగాడైనా మనసు పారేసుకునే అందం, వ్యక్తిత్వం నీలం సొంతం. నేను కూడా ఆమెను చూసి ఫ్లాట్ అయ్యాను" అని పేర్కొన్నారు.
వెండితెరపై అలరించిన ఈ జోడీ
{{/usCountry}}కాగా, గోవిందా, నీలం కొఠారి కలిసి దాదాపు డజనుకు పైగా చిత్రాల్లో నటించారు. 1986లో వచ్చిన 'లవ్ 86', 'ఇల్జామ్' చిత్రాలతో మొదలైన వీరి ప్రయాణం.. 'ఖుద్‌గర్జ్', 'సిందూర్', 'ఫర్జ్ కీ జంగ్', 'బిల్లూ బాద్‌షా', 'తాకత్వర్', 'ఘరానా' వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల వరకు కొనసాగింది. వీరిద్దరి డ్యాన్స్, ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి ఇప్పటికీ ప్రత్యేకమైన అభిమాన గణం ఉంది.