Suneel Darshan On Priyanka Chopra Surgery Fail: గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా నేడు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ స్టార్లతో కలిసి గ్లోబల్ వేదికలు పంచుకోవడమే కాకుండా తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.
తీవ్ర పోరాటం

అయితే, ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న కొత్తలో ప్రియాంక చోప్రా చిత్రసీమలో తీవ్ర పోరాటం చేయాల్సి వచ్చింది. కెరీర్ ప్రారంభంలో ఒక సర్జరీ వికటించి ప్రియాంక చోప్రా ముఖం పూర్తిగా మారిపోవడం, ఆ కారణంగా అవకాశాలు చేజారడం నటి జీవితంలో పెను సవాలుగా మారింది.
సర్జరీ సలహా ఇచ్చింది ఆ నిర్మాతే!
2003లో అక్షయ్ కుమార్, లారా దత్తాతో కలిసి నటించిన 'అందాజ్' చిత్రంతో ప్రియాంక బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా నిర్మాత సునీల్ దర్శన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆనాటి పరిణామాలను పంచుకున్నారు. అందాజ్ సినిమా షూటింగ్ ప్రారంభానికి ముందే ప్రియాంకకు ముక్కు సర్జరీ గురించి తాను సలహా ఇచ్చానని తెలిపారు.
"అందాజ్ సినిమా ప్రారంభించే ముందు ప్రియాంక ముక్కు దూలం సరిచేసుకోవాలని చెప్పాను. ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ప్రసిద్ధ వైద్యులు కావడంతో వెంటనే శస్త్రచికిత్స చేయించారు" అని సునీల్ దర్శన్ గుర్తుచేసుకున్నారు. సాధారణంగా సౌందర్యం కోసం చేసే ప్లాస్టిక్ సర్జరీలు చాలా ప్రమాదకరమని, ప్రతి చిన్న లోపాన్ని సరిచేసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
డిప్రెషన్.. ముంబై వదిలేసి వెళ్దామనుకుని!
ప్రియాంక ఈ సర్జరీని కేవలం అందం పెంచుకోవడానికి మాత్రమే చేయించుకోలేదు. ముక్కులో పాలిప్ (Polyp) అనే సమస్య రావడంతో దాన్ని తొలగించేందుకు శస్త్రచికిత్స చేయించుకోగా, వైద్యుల పొరపాటు వల్ల ఆమె రూపురేఖలు మారిపోయాయి. ఈ చేదు అనుభవాన్ని ప్రియాంక గతంలో 'ది హోవార్డ్ స్టెర్న్ షో'లో వెల్లడించారు.
{{/usCountry}}ప్రియాంక ఈ సర్జరీని కేవలం అందం పెంచుకోవడానికి మాత్రమే చేయించుకోలేదు. ముక్కులో పాలిప్ (Polyp) అనే సమస్య రావడంతో దాన్ని తొలగించేందుకు శస్త్రచికిత్స చేయించుకోగా, వైద్యుల పొరపాటు వల్ల ఆమె రూపురేఖలు మారిపోయాయి. ఈ చేదు అనుభవాన్ని ప్రియాంక గతంలో 'ది హోవార్డ్ స్టెర్న్ షో'లో వెల్లడించారు.
{{/usCountry}}"సర్జరీ సమయంలో డాక్టర్లు పొరపాటు చేశారు. దాంతో నా ముఖం పూర్తిగా మారిపోయింది. ఆ సమయంలో నేను తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను" అని ప్రియాంక చోప్రా ఆవేదన వ్యక్తం చేశారు. రూపురేఖలు మారడంతో వరుసగా సినిమాలు చేజారిపోయాయి. చాలామంది నిర్మాతలు ఆమెను ప్రాజెక్టుల నుంచి తొలగించారు.
ధైర్యాన్నిచ్చిన అనిల్ శర్మ.. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన తీరు
తీవ్ర మనస్తాపానికి గురైన ప్రియాంక, ముంబై నగరాన్ని వదిలేసి తన సొంత ఊరైన బరేలీకి తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ క్లిష్ట సమయంలో 'ది హీరో: లవ్ స్టోరీ ఆఫ్ ఏ స్పై' చిత్ర దర్శకుడు అనిల్ శర్మ ప్రియాంకకు అండగా నిలిచారు. సినిమా వదిలేసి బరేలీకి వెళ్లిపోతానని, అడ్వాన్స్ డబ్బులు వెనక్కి తీసుకోమని ప్రియాంక అడిగినప్పటికీ ఆయన అంగీకరించలేదు.
ఆమెకు ధైర్యం చెప్పి, ఒక ప్రతిభావంతుడైన మేకప్ ఆర్టిస్ట్‌ను పరిచయం చేసి ముఖంలో వచ్చిన మార్పులను కవర్ చేసేలా తోడ్పాటునందించారు. "చిన్న చిన్న విషయాలకు కంగారు పడొద్దు. మనం సరిదిద్దలేని సమస్య అంటూ ఏదీ ఉండదు" అని ప్రియాంక తండ్రి డాక్టర్ అశోక్ చోప్రా కూడా ఆమెలో ధైర్యం నింపారట.
తిరుగులేని హీరోయిన్‌గా
ఎదురైన అడ్డంకులను అధిగమించి, ఆ తర్వాత బాలీవుడ్‌లో తిరుగులేని హీరోయిన్‌గా అవతరించడమే కాకుండా, హాలీవుడ్‌లో సైతం తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని నేడు అంతర్జాతీయ స్టార్‌గా రాణిస్తున్నారు ప్రియాంక చోప్రా. ప్రస్తుతం రాజమౌళి, మహేశ్ బాబు కాంబో ప్రతిష్టాత్మక చిత్రం వారణాసిలో ప్రియాంక హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.