బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాహుల్‌ను అప్పు డౌట్ పడితే స్వప్న రచ్చ చేస్తుంది. ఆపమని అరుస్తుంది ఇందిరాదేవి. ఇంతలో నర్స్ వచ్చి సైలెంట్‌గా ఉండమని చెబుతుంది. మరోవైపు ధర్మేంద్ర భార్యను డాక్టర్ చక్రవర్తి టెస్ట్ చేస్తాడు. కడుపులో బిడ్డ గురించి మాట్లాడుకుంటారు.
ఎన్ని ఆశలు ఉంటాయో

ఇదివరకు కడుపులో ఉన్న బిడ్డ కడుపులోనే చనిపోయింది. ఇప్పుడు ఈ బిడ్డ మీద ఎలాంటి ఆశలు ఉంటాయో ఆలోచించు అని ధర్మేంద్ర అంటాడు. ఈసారి బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందని చక్రవర్తి అంటాడు. హాస్పిటల్ మీది. గతంలో రెండుసార్లు మీకు బిడ్డను అందించలేదని చాలా బాధపడ్డాం. కానీ, ఈసారి త్వరగానే హాస్పిటల్‌లో జాయిన్ చేయించండి అని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు.
మినిస్టర్ ధర్మేంద్ర భార్య వచ్చి భయంగా ఉందంటే భర్త ఓదారుస్తాడు. ఇప్పుడు ఇది ఆఖరుసారి అని డాక్టర్స్ చెప్పేశారు. ఈసారి బిడ్డను చూసుకోకపోతే నేను బతకను అని తులసి అంటుంది. అలా అనకు అని ధర్మేంద్ర ఓదారుస్తాడు. నా బిడ్డకు ఏదైనా జరిగితే మీరే నాకు విషమిచ్చి చింపేయండి అని తులసి అంటుంది. మరోవైపు రాజ్ గురించి కావ్య అడుగుతుంది.
కంగారు తగ్గించుకోమ్మని అపర్ణ అంటుంది. శని, ఆది వారాలు కావడంతో రెండు రోజులు బెయిల్ రాదు. అది నీకు తెలుసు. కానీ, కల్యాణ్ ప్రయత్నిస్తున్నాడు అని సుభాష్ అంటాడు. కాబట్టి ఆపరేషన్‌కు ఒప్పుకో. రేపు రాజ్‌కు ఏమని సమాధానం చెబుతావ్ అని ఇంటిల్లిపాది నచ్చజెపుతారు. ఎంత చెప్పిన కావ్య ఒప్పుకోదు. ఆయన నాకు మాట ఇచ్చారు. ఆయన లేకుండే ఆపరేషన్ అంటే అని కావ్య కంగారు పడుతుంది.
రాజ్ చుట్టు బిగుసుకున్న ఉచ్చు
సోమవారం నాటి కల్ల బావను తీసుకొస్తా అని అప్పు అంటుంది. లేదు అప్పు. ఇదంతా కుట్రల జరిగింది. ఆయన చుట్టు ఉచ్చు బిగుసుకుంటున్నట్లు అనిపిస్తుంది అని కావ్య అంటుంది. ఇంతలో కల్యాణ్ వచ్చి లేదు వదినా. అన్నయ్య బయటకు రాబోతున్నాడు. నీకు ఆపరేషన్ జరిగే టైమ్‌కు నీ పక్కనే ఉంటాడు. నేను చాలా పెద్ద వాళ్లతో రికమండ్ చేయించాను అని కల్యాణ్ అబద్ధం చెబుతాడు.
{{/usCountry}}సోమవారం నాటి కల్ల బావను తీసుకొస్తా అని అప్పు అంటుంది. లేదు అప్పు. ఇదంతా కుట్రల జరిగింది. ఆయన చుట్టు ఉచ్చు బిగుసుకుంటున్నట్లు అనిపిస్తుంది అని కావ్య అంటుంది. ఇంతలో కల్యాణ్ వచ్చి లేదు వదినా. అన్నయ్య బయటకు రాబోతున్నాడు. నీకు ఆపరేషన్ జరిగే టైమ్‌కు నీ పక్కనే ఉంటాడు. నేను చాలా పెద్ద వాళ్లతో రికమండ్ చేయించాను అని కల్యాణ్ అబద్ధం చెబుతాడు.
{{/usCountry}}దానికి కావ్య సంతోషిస్తుంది. రాహుల్, రేఖ షాక్ అవుతారు. కావ్య ఆపరేషన్ చేయించుకుంటాను అంటుంది. బేబీ కాస్టా అండర్ వెయిట్‌లో ఉంది. డెలివరీ అవ్వగానే బేబీని ఇంక్యూబేటర్‌లో పెడతాం. రెండు రోజుల్లో బరువు పెరుగుతుంది. ఇక పేషంట్‌కు రెస్ట్ ఇవ్వండి అని డాక్టర్ అందరిని పంపిస్తుంది. కల్యాణ్‌ను అప్పు సీరియస్‌గా చూస్తుంది.
అసలు నువ్వు ఏం చెప్పావ్. బావ బయట రాడానికి ఎవరిని రికమండ్ చేశావ్. అక్కకు ఎందుకు అంత నమ్మకంగా చెప్పావ్ అని అప్పు నిలదీస్తుంది. నేను వదినకు అబద్ధం చెప్పాను. వదినకు ఆ మాట చెప్పడం తప్పా ఇంకోదారి కనిపించలేదని కల్యాణ్ అంటాడు. ఆ మాటలు కావ్య వింటుంది. కావ్యను మోసం చేసినట్లు అవుతుంది కదా అని అపర్ణ అంటుంది.
పకడ్బందీగా ఇరికించారు
వదిన, బిడ్డ ప్రాణాల ముందు ఈ అబద్ధం చాలా చిన్నది. అన్నయ్య పరిస్థితి చూశాను. చాలా పకడ్బందీగా ఇరికించారు. బెయిల్ దొరుకుతుందనే నమ్మకం లేదు. ఈ రెండు రోజుల వరకు ఆపరేషన్ ఎలా చేయిస్తాం. అప్పటికి అన్నయ్య రాకుంటే వదిన పరిస్థితి ఏంటి. నేను మోసం చేశాను. కానీ, వదిన ప్రాణం కాపాడుకోవాలి. ఈ ఒక్కరోజు వదినకు నిజం తెలియకుండా చాలు. తర్వాత ఏం జరిగినా సరే అని కల్యాణ్ అంటాడు.
ఆ మాటలన్నీ విన్న కావ్య కుమిలిపోతుంది. మరోవైపు పోలీస్ స్టేషన్‌లో మర్డర్స్, మాన బంగాలు చేసిన రౌడీని పోలీసులు అరెస్ట్ చేస్తారు. నన్ను అరెస్ట్ చేస్తారా అని గొడవ చేస్తాడు. రాజ్ ఉన్న సెల్‌లోనే అతన్ని వేస్తారు. తర్వాత వీడు చాలా డేంజర్. చాలా జాగ్రత్తగా ఉండాలి వీడికి చాలా పెద్దవాళ్ల సపోర్ట్ ఉంది. ఎలాగైనా తప్పించాలని చూస్తారు అని ఇతర కానిస్టేబుల్‌తో మరొకతను అంటాడు.
రాజ్ మాత్రం కావ్యకు ఇచ్చిన మాట గురించి ఆలోచిస్తాడు. మరుసటి రోజు ఉదయం హాస్పిటల్‌కు కానిస్టేబుల్ హడావిడి చేస్తాడు. ఏమైందని సుభాష్ అడిగితే మినిస్టర్ ధర్మేంద్ర భార్య డెలివరికి వస్తున్నారు అని నర్స్ చెబుతుంది. తర్వాత హాస్పిటల్‌లో కావ్య ఉండదు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రాజ్‌ను కలుస్తుంది. అక్కడ నొప్పులు ఇంకా ఎక్కువ అవుతాయి.
చావు అంచుల్లో కావ్య
కావ్యను హాస్పిటల్‌కు కల్యాణ్ తీసుకొస్తాడు. డాక్టర్ ఆపరేషన్‌కు రెడీ చేయిస్తుంది. ప్రమాదం, చావు అంచుల మీద కళావతి కొట్టుమిట్టాడుతుందని అపర్ణ వాళ్లతో డాక్టర్ చెబుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.