బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో పసరు మందు వీరయ్య కోసం రుద్రాణి ఎదురుచూస్తుంటుంది. ఇంతలో వస్తాడు. రెండో పసరు మందు ఇస్తాడు వీరయ్య. ఇది కడుపులోకి వెళితే పేగులతో సహా బయటకు వచ్చేయాల్సిందే అని వీరయ్య చెబుతాడు. ఆ మందు తీసుకుంటుంది రుద్రాణి. వీరయ్య వెళ్లిపోతాడు.
పసరు మందుతో దొరికిన రుద్రాణి

పసరు మందు పట్టుకుని రుద్రాణి కంగారుగా వస్తుంటుంది. ఇంతలో కనకం ఎదురు వస్తుంది. ఏంటది అని అడుగుతుంది. దేని గురించి అని రుద్రాణి అంటే.. నీ కొంగుచాటున దాచి ఉంచింది అని నిలదీస్తుంది కనకం. అలా పసరు మందుతో కనకంకు రుద్రాణి దొరికిపోతుంది. ఇదిగో చూడు. పసరు మందు. అజీర్తిగా ఉంది. అందుకు పసరు మందు తాగమన్నారు. అందుకే అని వెళ్లిపోతుంది రుద్రాణి.
అజీర్తికి అయితే పొద్దున, మధ్యాహ్నమమో, సాయంత్రమో తెప్పించుకోవాలి కానీ ఇంత రాత్రి పూట తెప్పించుకోవడం ఏంటీ. ఇదేదో తేడాగా ఉందే. తెలుసుకుని తీరాల్సిందే అని కనకం డౌట్ పడుతుంది. మరుసటి రోజు ఉదయం కావ్య, అప్పులకు సీమంతం ఏర్పాట్లు చేస్తుంటారు.
మట్టి గాజుల గొప్పతనం గురించి
ఇంతలో రాజ్ వచ్చి అప్పు, కావ్యకు స్పెషల్‌గా బంగారు గాజులు తయారు చేయించినట్లు చెప్పి చూపిస్తాడు. అవి చూసి అంతా సంతోషిస్తారు. మట్టి గాజులు ఏవి కనకం అడుగుతుంది. బంగారు గాజులు అలంకరణ కోసం, మట్టి గాజులు ఆరోగ్యం కోసం. గర్భవతికి వేసే మట్టి గాజులు సాంప్రదాయానికి సంబంధించి ఉంటుందని అని కనకం అంటుంది.
మట్టి గాజుల వల్ల వచ్చే ఉపయోగాలను కనకం చెబుతుంది. ఇందులో ఇంత సైన్స్ ఉందని తెలియకా బంగారు గాజులు తెప్పించాను. అరగంటలో మట్టి గాజులు తెప్పిస్తాను అని రాజ్ అంటాడు. మరోవైపు కావ్యకు రాజ్ సాంబ్రాణి తీసుకొచ్చి ఇస్తాడు. మీరు ఎందుకు వచ్చారో తెలుసు. ఈ టైమ్‌లో హద్దులు దాటితే కష్టం అని కావ్య అంటుంది. తర్వాత కావ్యను రాజ్ రెడీ చేస్తాడు.
లేడి ప్రవచనకర్తగా కనకం
{{/usCountry}}మట్టి గాజుల వల్ల వచ్చే ఉపయోగాలను కనకం చెబుతుంది. ఇందులో ఇంత సైన్స్ ఉందని తెలియకా బంగారు గాజులు తెప్పించాను. అరగంటలో మట్టి గాజులు తెప్పిస్తాను అని రాజ్ అంటాడు. మరోవైపు కావ్యకు రాజ్ సాంబ్రాణి తీసుకొచ్చి ఇస్తాడు. మీరు ఎందుకు వచ్చారో తెలుసు. ఈ టైమ్‌లో హద్దులు దాటితే కష్టం అని కావ్య అంటుంది. తర్వాత కావ్యను రాజ్ రెడీ చేస్తాడు.
లేడి ప్రవచనకర్తగా కనకం
{{/usCountry}}మరోవైపు అప్పును కల్యాణ్ రెడీ చేస్తాడు. కల్యాణ్ దూస్తే పాపిడి తీయొద్దు. మా అమ్మ చెప్పిందని అప్పు అంటుంది. మీ అమ్మ లేడి ప్రవచనకర్తగా ఉన్నట్లు ఉందే అని కల్యాణ్ అంటాడు. ఇంతలో ధాన్యలక్ష్మీ ఇలా చేస్తే ఇక రెడీ అయినట్లే అని కల్యాణ్‌ను పంపిస్తుంది. ధాన్యలక్ష్మీ చూపించే ప్రేమకు అప్పు ఎమోషనల్ అవుతుంది. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నా. క్షమించండి అని అంటుంది.
మొదట నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా కదా. నువ్వే నన్ను క్షమించాలని ధాన్యలక్ష్మీ అంటుంది. అప్పును రెడీ చేసి కుందనపు బొమ్మల ఉన్నావ్ అని హగ్ చేసుకుంటుంది అత్త. అప్పు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు కావ్య సీమంతం జరిగే రోజే నీకు, నీ బిడ్డకు ఆఖరు రోజు. రాజ్ గాడి లైఫ్ అల్లకల్లోలం కాబోతుంది అని రుద్రాణి అనుకుంటుంది.
రుద్రాణి బాగోతం బయటపెట్టిన కనకం
ఇంతలో రేఖ వచ్చి త్వరగా కషాయంలో పసరు మందు కలిపేద్దాం అని చెబుతుంది. కావ్య గదిలోనే ఉంటుంది. ఇది ఇంకా సింగారించుకుంటూనే ఉందని రుద్రాణి, రేఖ అనుకుంటారు. ఇంతలో కనకం వచ్చి కావ్య అత్తింటికి వచ్చిన మొదట్లో జరిగిన విషయాల గురించి తలుచుకుని ఏడుస్తుంది. అత్తింటి వారి గురించి గొప్పగా చెబుతుంది కావ్య.
కావ్య, అప్పుకు సీమంతం చేస్తారు. కావ్యకు రుద్రాణి బొట్టు పెడుతుంటే కనకం వచ్చి అడ్డుకుంటుంది. పసరు మందు వీరయ్యను కూడా లాక్కొచ్చి కావ్య తాగే కషాయంలో విషం కలిపే ప్రయత్నం చేసిందని రుద్రాణి బాగోతం అంతా చెబుతుంది. దానికి అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.