...
...
Next Story

Brahmamudi November 9 Episode: బ్రహ్మముడి- ఇందు ప్లేసులో శేషు- ఇందు కంపెనీలో వెంకీకి జాబ్-సిస్టర్ కంపెనీగా ఐశ్వర్య సంస్థ

Brahmamudi Serial November 9th Episode: బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 9వ ఎపిసోడ్‌‌లో ఇందు దగ్గరికి వెళ్లేందుకు రాజు సాకులు చెబుతుంటాడు. ఇందు ప్లేసులో శేషు బెడ్‌పై ఉంటాడు. రాజు రొమాంటిక్‌గా మాట్లాడుతాడు. సీతారామయ్య, ఇంద్రాదేవి ఫొటో ఫ్రేమ్ తెప్పిస్తాడు రాజు. రుద్రాణి, రాహుల్ ఫొటోల ప్లేసులో అది పెడతాడు.

Published on: Nov 9, 2026, 10:15:07 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అపర్ణ చెప్పడంతో రాజు సోఫాలో పడుకుంటాడు. అది చూసి ఐశ్వర్య నవ్వుకుంటుంది. సక్సెస్ అనుకుంటుంది. అది రేఖ, భ్రమరాంబ చూస్తారు. వాళ్లు అలా వేరువేరుగా పడుకునేలా చేసిందే తను అని ఐశ్వర్య చెబుతుంది. దాంతో ఇద్దరు షాక్ అవుతారు.

నట్టింట్లో పడుకునేలా చేశా

బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 9 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ నవంబర్ 9 ఎపిసోడ్

ఆ పంతులుతో చెప్పి శోభనం పోస్ట్‌పోన్ చేయించానని పంతులుకు డబ్బులు ఇచ్చింది చెబుతుంది ఐశ్వర్య. ఇందును పెళ్లి చేసుకున్నానని ఎంత పొగరు చూపించాడు. ఇప్పుడు నట్టింట్లో పడుకోబెట్టాను అని ఐశ్వర్య అంటుంది. నువ్వు చేయించింది కేవలం 3 రోజులే కదా. ఆ తర్వాత కలుస్తారుగా. ఆ మాత్రం ఎందుకు అని రేఖ, భ్రమరాంబ అంటారు.

ఈ 3 రోజులు పూర్తయ్యేలోపు ఆ రాజును ఇందు గెంటేస్తుందని మీకు తెలియదని ఐశ్వర్య అంటుంది. వాళ్ల మధ్య చిచ్చుపెట్టడం కష్టమని భ్రమరాంబ అంటుంది. నాకు ఏదైనా సాధ్యమే. కేవలం చూస్తూ ఉండండని ఐశ్వర్య వెళ్లిపోతుంది. నన్ను మెంటల్‌గా డిస్టర్బ్ చేసిన నిన్ను వదల బొమ్మాళి అంటూ ఇందు గదిలోకి వెళ్తాడు రాజు. డోర్ తీయమని తలుపు తడతాడు.

ఇందు తీస్తే దాహంగా ఉంది వాటర్ కావాలని రాజు అడుగుతాడు. వంట గదిలో ఫ్రిజ్ ఉందిగా అక్కడికి వెళ్లొచ్చుగా అని ఇందు అంటుంది. కాసేపటికి తీసుకొచ్చి రాజును ముట్టుకోకుండా వాటర్ బాటిల్ ఇస్తుంది ఇందు. వరద బాదితులకు పులిహార పొట్లాలు ఇచ్చినట్లు ఇచ్చిందని, ఈ ప్లాన్ వర్కౌట్ కాలేదని, ఇంకోటి ట్రై చేయాలనుకుంటాడు రాజు.

రాజు సాకులు

ఇందు కళ్లముందే ట్యాబ్లెట్ వెనక్కి పడేసి నీళ్లు తాగుతాడు రాజు. అది ఇందు చూస్తుంది. వెళ్లి ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇదేంటని అడుగుతుంది. ఇంకోసారి ఇక్కడికి వచ్చావంటే కాళ్లు విరగ్గొడతా అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తుంది ఇందు. రాజు వెళ్లిపోతాడు. శేషు వచ్చి డోర్ కొడతాడు. రాజుకు నువ్వు దొరక్కుండా ఉండాలంటే నా దగ్గర ఐడియా ఉందంటాడు.

నువ్వెళ్లి నానమ్మ గదిలో పడుకో. నీ గదిలో నేను పడుకుంటా. రాజు వస్తే నేను చూసుకుంటానంటాడు శేషు. ఇందు వెళ్లిపోతుంది. శేషు డోర్ తెరిచే వెళ్లి పడుకుంటాడు. రాత్రి 12 అవుతుంది. రొమాంటిక్ టైమ్, చివరి ప్రయత్నం అనుకుంటూ రాజు వెళ్తాడు. డోర్ తెరిచే ఉండటంతో సంతోషంగా లోపలికి వెళ్తాడు. శేషు దుప్పటి కప్పుకుని ఉంటాడు.

రా రాజా.. రా..

ఇందు అని రాజు పిలిస్తే.. హుమ్.. అంటూ ఇందు వాయిస్‌తో శేషు మాట్లాడుతాడు. ఇద్దరు రొమాంటిక్‌గా మాట్లాడుకుంటారు. నీ బుగ్గలు ఒక్కసారి పట్టుకోనా అని దుప్పటిలోనుంచి పట్టుకుంటాడు. నీ మూతి మీద మీసాలు ఉన్నాయేంటని రాజు అడుగుతాడు. మగాడికి మీసాలేగా అందమని శేషు దుప్పటి తీస్తాడు. దాంతో రాజు ఉలిక్కిపడతాడు.

హాయ్ రాజా.. నీకోసమే చూస్తున్నా రాజా. రాత్రి అయితే ఇలాగే మాట్లాడతా రాజా.. నేను బేసిక్‌గా ఇదే.. పైకి మాత్రం అలా కనిపిస్తాను.. రాజా రా.. రాత్రంతా కబుర్లు చెప్పుకుందాం అని తేడాగా మాట్లాడుతాడు శేషు. మావయ్య నువ్వు అదా అని భయపడిపోతాడు రాజు. దాంతో శేషు నవ్వుతాడు. నన్ను చూసి అలా భయపడతావేంటీ అల్లుడు. ఇందును నేనే పంపించి పడుకున్నా అని చెబుతాడు.

అలా బిహేవ్ చేస్తే భయపడరా అంటాడు. నేను ఇక్కడ పడుకునే బదులు దోమలతో కుట్టించుకోవడమే నయమంటాడు రాజు. శాస్త్రం ప్రకారం రావద్దంటే ఎందుకురా వచ్చావ్. పో మూసుకుని.. బయటకు వెళ్లిపో అని దబాయిస్తాడు శేషు. దాంతో రాజు వెళ్లిపోతాడు. మరుసటి రోజు ఉదయం కిచెన్‌లో నిద్రతో కునుకులు తీస్తుంది ఇందు.

ఇందు కంపెనీలో వెంకీకి జాబ్

నందు చూసి వచ్చి వాడిపోయిన కొత్తిమీరలా ఉన్నావేంటీ. రాత్రంతా ఫీల్ అయ్యావా అని అడుగుతుంది. రేపు పెళ్లయితే తెలుస్తుందని ఇందు అంటుంది. దాంతో వెంకీ గుర్తొచ్చి ఓ చిన్న హెల్ప్ చేస్తావా అని వెంకీకి జరిగింది చెబుతుంది నందు. ఐశ్వర్య వల్ల వెంకీ బలి అయ్యాడని ఇందు అంటుంది. మన కంపెనీలోనే వెంకీకి జాబ్ ఎందుకు ఇవ్వకూడదని సలహా ఇస్తుంది నందు.

మన దగ్గర జాబ్ అంటే చలపతి అంకుల్ ఒప్పుకుంటాడో లేదో అని ఇందు అంటుంది. బావతో అడిగిద్దామని నందు అంటుంది. అసలు దానికి మీ బావ ఒప్పుకుంటాడో లేదో అని పెద్ద క్వశ్చన్ మార్క్ అని ఇందు అంటుంది. రాజు కోతి విన్యాసాలు చేశాడని చెబుతుంది ఇందు. తర్వాత ఇంటికి కొరియర్ వస్తుంది. ఎవరు బుక్ చేశారంటే రాజు అని చెబుతాడు.

రాజు సంతకం చేసి కొరియర్ తీసుకుంటాడు. అదేంటని శేషు అడుగుతాడు. అది వీళ్ల ఫొటో అయి ఉంటుందని రేఖ అంటుంది. 2 రోజుల్లో వీళ్లిద్దరిని దూరం చేస్తానని ఐశ్వర్య మనసులో అనుకుంటుంది. సుభాష్, అపర్ణలతో అది ఓపెన్ చేయిస్తాడు రాజు. అందులో సుభాష్ తల్లిదండ్రులు సీతా రామయ్య, ఇంద్రాదేవి ఉండటంతో తెగ సంతోషిస్తాడు.

సీతారామయ్య, ఇంద్రాదేవి ఫొటో

మా అమ్మ నాన్న అని ఇందుకు చెబుతాడు సుభాష్. మా అమ్మ పేరే నీకు పెట్టావమ్మా అంటాడు. అక్క సేమ్ నీలాగే ఉన్నారని నందు అంటుంది. ఇందు చూస్తుంది. ఇన్నేళ్లలో ఇలాంటి ఫొటో పెట్టే ధైర్యం మేము ఎవరం చేయలేదు. కానీ, నువ్వు వచ్చిన రెండో రోజే చేశావని, నా మనవడు అనిపించుకున్నావురా అని అపర్ణ మెచ్చుకుంటుంది.

బావ మజాకా అని ఇందు అనుకుంటుంది. వాళ్ల ఇంప్రెషన్ కొట్టేసేందుకు పెద్ద ఫ్రేమే కట్టించావ్. కానీ, అది ఎక్కడ పెడతావ్. అది పెట్టే ప్లేస్ లేదే అని రేఖ, ఐశ్వర్య, భ్రమరాంబ వెటకారంగా మాట్లాడుతారు. వీళ్ల గురించి తప్పుడు మాటలు మాట్లాడితే పళ్లు రాళతాయ్. అక్కవని కూడా చూడను అని ఐశ్వర్యకు వార్నింగ్ ఇస్తుంది ఇందు.

ఐశ్వర్య నోరు తెరిస్తే.. ఏయ్.. ఏంటీ నోరు లేస్తుంది. నేనైతే దవడలు కూడా వాచేలా చేస్తానంటుంది నందు. ఇచ్చి పడేశావ్ నందు అని రాజు మెచ్చుకుంటాడు. ఫొటో ఎక్కడ పెడతావని రేఖ అంటుంది. రాజు నీకు నచ్చిన చోట పెట్టు అని సుభాష్ అంటే స్టోర్ రూమ్‌లో సేఫ్‌గా ఉంటుందేమో అని రేఖ అంటుంది. కరెక్టుగా చెప్పావ్ పిన్ని. తీసుకెళ్లి నీ అమ్మ, అన్న ఫొటో స్టోర్ రూమ్‌లో సేఫ్‌గా పెట్టుకో అని రాజు అంటాడు.

ఉలిక్కిపడిన రేఖ బ్యాచ్

దాంతో రేఖ బ్యాచ్ ఉలిక్కిపడుతుంది. వాళ్లు దేశం కోసం పోరాటం చేశారా. ఇల్లు నాశనం చేయాలనుకున్నోళ్లు. దిష్టి బొమ్మలా ఎందుకు అక్కడ తీసిపడేయండని రాజు అంటాడు. వాళ్ల గురించి ఏం తెలుసని రేఖ కోప్పడుతుంది. తెలుసుకోవాల్సినంత గొప్ప బతుకులు కాదు వాళ్లవి. అయ్యో పాపమని జాలి చూపించిన మా నాన్నకే వెన్నుపోటు పొడిచారు. ఈ ఆస్తి మొత్తం కాజేయాలని చూసింది అని రుద్రాణి రాక్షసత్వం గురించి చెబుతాడు సుభాష్.

దాంతో సీతారామయ్యల ఫొటో పెట్టి రుద్రాణి, రాహుల్ ఫొటోలను స్టోర్ రూమ్‌లో పెట్టిస్తాడు రాజు. అనంతరం స్వరాజ్ గ్రూఫ్ ఆప్ కంపెనీకి ఐశ్వర్య జ్యూవెలరీ సిస్టర్ కంపెనీ అని అప్రూవ్ చేస్తున్నట్లు సంతకం పెట్టండని డాక్యుమెంట్ పేపర్ విసిరేస్తుంది ఐశ్వర్య. సంతకం చేయడం కుదరదని రాజు అంటాడు. నా భర్త మాటే నా మాట అని ఇందు అంటుంది.

నువ్వు లేకపోతే నేను ఎక్స్‌పోకి వెళ్లలేను అనుకున్నావా. వెళ్లి చూపిస్తాను చూడు అని ఐశ్వర్య ఛాలెంజ్ చేస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks