బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నువ్వు బిడ్డను కంటే చచ్చిపోతావన్న నిజం అక్క అని కావ్యకు రహస్యం చెబుతుంది అప్పు. బావగారికి నిజం చెప్పి మా గుండెబారం దించుకున్నారు. కానీ, ఆ క్షణం నుంచే నీ ప్రాణాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియక నరకం అనుభవించారు అని అప్పు అంటుంది.
నిన్ను కాపాడుకోవడం కోసమే

నీకు నిజం చెప్పమని అన్నయ్యను ఎంత బతిమిలాడిన చెప్పలేదు. నీ ప్రాణాలను లెక్కచేయవని, బిడ్డకే జన్మనిస్తావని చెప్పలేదు. అందరూ తిడుతున్న అన్ని భరించాడు అని కల్యాణ్ అంటాడు. కల్యాణ్, అప్పు రాజ్ చేసిదంతా, అనుభవించంది చెబుతారు. బావ గారు చేసింది నిన్ను కాపాడుకోవడం కోసం మాత్రమే. అలాంటి బావను తప్పు పట్టకు. నిందించకు అని అప్పు అంటుంది.
ఇలా చేస్తూ పోతే నువ్వు వదినకు దూరమైపోతావ్ అని చెబితే దూరమైన పర్వాలేదురా. అది ప్రాణాలతో బతికి ఉంటే చాలు అన్నాడు అని కల్యాణ్ చెబుతాడు. ఇప్పటికీ నీకు నిజం చెప్పేవారు కాదు. నువ్వు అన్నావని నోరు జారారు. లేకుంటే నీకు శత్రువులా మారి అయిన సరే బిడ్డను తీయించేవారు అని అప్పు అంటుంది. రాజ్‌ను నిందించినందుకు సుభాష్, ఇందిరాదేవి అంతా క్షమించమంటారు.
మనసులో ఇంత బాధ దాచుకుని పైకి ఎలా నవ్వుతు ఉన్నావురా అని అపర్ణ, నీ బాధను అర్థం చేసుకోలేక అజ్ఞానంలో ఉండిపోయాను అని సీతారామయ్య అంటాడు. కావ్య ఏడుస్తూ మొహం చాటేసి వెళ్లిపోతుంది. ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ రాజ్ చేసిందంతా గుర్తు చేసుకుంటుంది. అక్కడికి రాజ్ వస్తాడు. కన్నబిడ్డను కూడా నాకోసం వదులుకునేంత ప్రేమ ఉందా అని కావ్య అంటుంది.
కుప్పకూలిపోయిన రాజ్
నిన్ను కాపాడుకోడానికి ఆ దేవుడుని ఎంతలా వేడుకున్నానో నీకు తెలియదు అని ఓ పాటను ఎమోషనల్‌గా పాడుతాడు రాజ్. పాట పాడి కుప్పకూలిపోతాడు రాజ్. స్పృహలో ఉండడు. దాంతో కంగారుపడిన కావ్య ఏవండి, లేవండి అంటుంది. కట్ చేస్తే.. ఈ ట్విస్ట్ నేను ఊహించలేదురా. రాజ్ మూర్ఖుడిలా ఆలోచించాడని అనుకున్నాం. ఇంత పెద్ద నిజం భలే దాచాడురా అని రుద్రాణి అంటుంది.
{{/usCountry}}నిన్ను కాపాడుకోడానికి ఆ దేవుడుని ఎంతలా వేడుకున్నానో నీకు తెలియదు అని ఓ పాటను ఎమోషనల్‌గా పాడుతాడు రాజ్. పాట పాడి కుప్పకూలిపోతాడు రాజ్. స్పృహలో ఉండడు. దాంతో కంగారుపడిన కావ్య ఏవండి, లేవండి అంటుంది. కట్ చేస్తే.. ఈ ట్విస్ట్ నేను ఊహించలేదురా. రాజ్ మూర్ఖుడిలా ఆలోచించాడని అనుకున్నాం. ఇంత పెద్ద నిజం భలే దాచాడురా అని రుద్రాణి అంటుంది.
{{/usCountry}}కావ్య బిడ్డను దూరం చేయాలని మనం ప్లాన్ చేస్తే ఏకంగా పైకే పోవాలని దేవుడు రాశాడు అని రాహుల్ అంటాడు. ఇప్పటివరకు బిడ్డను దూరం చేయాలని ప్లాన్ చేశాం. ఇప్పుడు బిడ్డను కాపాడాలని చూడాలి. రాజ్ చెప్పిన నిజమే మనకు అస్త్రంగా మారుతుంది. కావ్యను చంపేసింది. దాన్ని రాజ్ వైపు నుంచి నిజం చేయిద్దాం. తను చచ్చి అయిన బిడ్డ కావాలనే అంటుంది కావ్య. వారసుడినే ఇస్తానంటుంది అని రుద్రాణి అంటుంది.
ఇంట్లోవాళ్లను కూడా సెంటిమెంట్‌తో కొట్టాలి. ఇంట్లో వాళ్లకు గిల్టీ ఫీలింగ్ తీసుకురావాలి. కావ్యను బతికిస్తే బిడ్డ చచ్చిపోతుంది. ఈ ప్రపంచాన్నే చూడని పసికందును చంపేస్తారా అని నిలదీసామంటే గింజుకుని చస్తారు. ఇప్పుడు అదే చేయాలి అని రుద్రాణి అంటుంది. మరోవైపు రాజ్‌ను చూసి బాధపడతారు అత్తమామలు. వెళ్లి మాట్లాడుతారు.
విశ్వాసం చూపించలేదంటూ
మీ వ్యక్తిత్వం తెలిసిన తప్పుబట్టాం. క్షమించండి అని కృష్ణమూర్తి అంటాడు. మీరు కన్నెర్ర చేస్తే తెల్లారిపోయే బతుకులు. మీరు మాకు ఎన్నో చేశారు. ఆ విశ్వాసం కూడా చూపించకుండా మిమ్మల్ని అన్నాం అని కనకం అంటుంది. రాజ్ కాళ్లు పట్టుకుని క్షమించమని కృష్ణమూర్తి అంటాడు. మీరు పెద్దవాళ్లు ఇలా చేయకండి అని రాజ్ అంటాడు. మా కన్నీళ్లతో కాళ్లు కడిగితే కానీ మా పాపానికి ప్రాయిశ్చిత్తం ఉండదని కృష్ణమూర్తి అంటాడు.
మీరు మీ బిడ్డకోసం చేశారు. ఇప్పుడు నా భయమంతా కళావతిని ఎలా కాపాడుకోవాలి. తనతోపాటు నేను చావడం తప్పా ఇంకేం లేదు. అన్ని ప్రయత్నాలు చేశాను. కానీ, ఏది కళావతిని కాపాడలేకపోతున్నాయి అని బాధపడుతాడు రాజ్. ఇంతలో కావ్య లగేజ్‌తో వచ్చి మనింటికి వెళ్దాం అని అంటుంది. తర్వాత రాజ్, కావ్య ఇద్దరు వెళ్లిపోతారు.
మరుసటి రోజు ఉదయం అందరికి సంతోషంగా కాఫీ, టీలు ఇస్తుంది కావ్య. అప్పును ఎలా ఉందని, ట్లాబ్లెట్స్ గురించి, బిడ్డ ఆరోగ్యం చెబుతుంది కావ్య. కావ్య ప్రవర్తన చూసి అంతా షాక్ అవుతారు. నువ్వు బిడ్డను తీసేసుకో అని అంతా చెబుతారు. నాకు మాత్రం బిడ్డే ముఖ్యం అని చనిపోడానికే సిద్ధపడుతుంది కావ్య. ఆ మాటలు రాజ్ వింటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.