బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో మంత్రి భార్య తులసి హాస్పిటల్‌కు వస్తుందని తెలిసిన రాజ్, కావ్య కూడా ఆస్పత్రికి వెళ్తారు. డాక్టర్ అనురాధను కలిసిన తులసి తనకు పాలు రావట్లేదని, బిడ్డకు డబ్బా పాలు పట్టడం ఇష్టం లేదని, ఎలాగైనా తన పాపకు తనే పాలు పట్టాలని చెబుతుంది.
మీకు పురుడు పోసింది

ఇంతలో కావ్య వస్తుంది. తులసి, కావ్య పలకరించుకుంటారు. తనకు పాలు రావట్లేదని తులసి చెబుతుంది. డాక్టర్ చక్రవర్తి గారే కదా మీకు పురుడు పోసింది. ఆయనే మీకు ట్రీట్‌మెంట్ ఇస్తే బాగుంటుంది అని కావ్య, రాజ్ అంటారు. నిజమే కానీ, ఆయన నాకు డెలివరి చేసినప్పటి నుంచి హాస్పిటల్‌కు రావట్లేదని తులసి చెబుతుంది.
అదేంటండి, హాస్పిటల్ మీదే కదా. మీ ఆయనను డాక్టర్ చక్రవర్తి గురించి అడగండి. ఆయనే ఏదోటి చేస్తారు అని కావ్య అంటుంది. దానికి సరే అన్నట్లుగా సైలెంట్‌గా ఉంటుంది తులసి. ఇంతలో పాప ఏడుస్తుంది. పని మనిషి ఇచ్చిన డబ్బా పాలు పడుతుంది తులసి. కానీ, పాప తాగదు. ఎంత ఆలించిన పాప ఊరుకోదు. ఏడుస్తూనే ఉంటుంది.
తన పాప తన కళ్లముందే గుక్కపెట్టి ఏడవటం చూసి తట్టుకోలేకపోతుంది కావ్య. ఇక తల్లి ప్రేమను పక్కన పెట్టలేక పాప తల్లి పాల కోసమే ఏడుస్తుంది, అందుకే డబ్బా పాలు తాగట్లేదు. మీరు ఏమనుకోనంటే పాపకు నేను నా పాలు పడతాను అని కావ్య అంటుంది. దానికి తులసి షాక్ అవుతుంది.
సొంత బిడ్డకు పాలు పట్టిన కావ్య
మీరు నా పాపకు పాలు పట్టడం ఏంటని తులసి అంటుంది. ఈ సమయంలో పిల్లలకు తల్లి పాలే రక్ష. నా బిడ్డకు నేను ఎలాగు పాలు పట్టలేను. కనీసం మీ పాప ఆకలినైనా నా తల్లి ప్రేమ తీర్చని అని కావ్య అంటుంది. తులసి ఆలోచనలో పడుతుంది. పక్కనే ఉన్న డాక్టర్ అనురాధ కూడా అలా పాలు పట్టడం వల్ల బిడ్డకు ఏం కాదని, ఏ తల్లి పాలు అయిన బిడ్డకు మంచిదే అని చెబుతుంది.
{{/usCountry}}మీరు నా పాపకు పాలు పట్టడం ఏంటని తులసి అంటుంది. ఈ సమయంలో పిల్లలకు తల్లి పాలే రక్ష. నా బిడ్డకు నేను ఎలాగు పాలు పట్టలేను. కనీసం మీ పాప ఆకలినైనా నా తల్లి ప్రేమ తీర్చని అని కావ్య అంటుంది. తులసి ఆలోచనలో పడుతుంది. పక్కనే ఉన్న డాక్టర్ అనురాధ కూడా అలా పాలు పట్టడం వల్ల బిడ్డకు ఏం కాదని, ఏ తల్లి పాలు అయిన బిడ్డకు మంచిదే అని చెబుతుంది.
{{/usCountry}}డాక్టర్ చెప్పడంతో కావ్య పాలు పట్టేందుకు ఒప్పుకుంటుంది తులసి. కావ్యకు పాపను ఇస్తుంది తులసి. కన్నబిడ్డను చేతుల్లోకి తీసుకుంటూ కావ్య మురిసిపోతుంది. పక్కన ఉన్న గదిలోకి పాపను తీసుకెళ్తుంది. జరిగినవన్నీ తలుచుకుంటూ కావ్య కుమిలిపోతుంది. మంత్రి చేసిన తప్పు వల్ల నువ్వు నాకు దూరం అయ్యావని ఏడుస్తుంది కావ్య.
తప్పు ఎవరు చేసిన ఈ అమ్మకు దూరమై నువ్వు శిక్ష అనుభవిస్తున్నావ్ అని కావ్య అంటుంది. గదిలో సొంత బిడ్డకు పాలు ఇస్తుంది కావ్య. గది బయటి నుంచి కావ్యను, కావ్య మాటలు, బాధను చూసిన రాజ్ తలదించుకుంటాడు. ఏం చేయలేకపోతున్నానని బాధపడుతాడు. మరోవైపు తన బిడ్డను ఎత్తుకుని ఆడిస్తుంది తులసి.
కావ్య చెప్పినట్లే చేసిన తులసి
పాప ఏడవడం ఆపాక తులసికి ఇస్తుంది కావ్య. అప్పుడు కూడా కావ్య చాలా ఎమోషనల్ అవుతుంది. తర్వాత ఇంటికెళ్లిన తులసి కావ్య చెప్పినట్లుగానే భర్తను డాక్టర్ చక్రవర్తి గురించి అడుగుతుంది. నాకు డెలివరి చేసినప్పటి నుంచి డాక్టర్ చక్రవర్తి ఎందుకు రావట్లేదు అని తులసి అంటుంది. దాంతో మంత్రి ధర్మేంద్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు.
ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తాడు. కావ్య గురించి ఏం చేశారు, ఇవాళ హాస్పిటల్‌కి కావ్య వాళ్లు వచ్చారు, నాతో మాట్లాడారు. డాక్టర్ చక్రవర్తి గురించి కూడా నన్ను అడిగారు అని తులసి చెబుతుంది. దాంతో ఒక్కసారిగా ఖంగుతిన్న ధర్మేంద్ర బెంబేలెత్తిపోతాడు.
మరోవైపు కావ్య మారిందని అంతా ఇంట్లో సంతోషంగా ఉంటారు. అది చూసిన రేఖ కోపంతో తల్లికి ఫోన్ చేస్తుంది. రాజ్ బావకు కావ్యను దూరం చేస్తానన్నావ్. కావ్యను పిచ్చిదానిలా చూపిస్తానన్నావ్. కానీ, ఇప్పుడు ఆ కావ్య అందరిని గెలుచుకుంది అని తల్లి రుద్రాణితో గొడవ పడుతుంది. కావ్య ఇలా ట్విస్ట్ ఇస్తుందని నాకేం తెలుసు అని రుద్రాణి కూడా రివర్స్ అవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.