...
...
Next Story

Chandrabose: హీరో హీరోయిన్‌గా భార్యాభర్త- ధర్మస్థల నియోజకవర్గం నుంచి న్యాయం చేయరా దేవుడా సాంగ్- రిలీజ్ చేసిన చంద్రబోస్!

Nyayam Cheyara Devudaa Song Release: భార్యాభర్త అయిన వరుణ్ సందేశ్, వితికా షేరు హీరో హీరోయిన్‌గా నటించిన పొలిటికల్ డ్రామా మూవీ ధర్మస్థల నియోజకవర్గం. ఈ సినిమా నుంచి న్యాయం చేయరా దేవుడా పాటను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబోస్, డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ తోట కామెంట్స్ చూద్దాం.

Published on: Mar 18, 2026, 15:43:27 IST
Advertisement

హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్, ఆయన భార్య వితికా షెరు కలిసి నటించిన లేటెస్ట్ తెలుగు మావీ ‘ధర్మస్థల నియోజకవర్గం’. భార్యాభర్త హీరో హీరోయిన్‌గా చేస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరోలు సుమన్, సాయి కుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

పోస్ట్ ప్రొడక్షన్ పనులు

హీరో హీరోయిన్‌గా భార్యాభర్త- ధర్మస్థల నియోజకవర్గం నుంచి న్యాయం చేయరా దేవుడా సాంగ్- రిలీజ్ చేసిన చంద్రబోస్!
హీరో హీరోయిన్‌గా భార్యాభర్త- ధర్మస్థల నియోజకవర్గం నుంచి న్యాయం చేయరా దేవుడా సాంగ్- రిలీజ్ చేసిన చంద్రబోస్!

మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మేరుం భాస్కర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహించారు. టాలీవుడ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ధర్మస్థల నియోజకవర్గం సినిమా ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఇటీవలే మేకర్స్ ప్రారంభించారు. ‘న్యాయం చేయరా దేవుడా..’ డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ డ్యాన్స్ నెంబర్‌‌తో ప్రేక్షకులను అలరించబోతున్నట్లుగా సాంగ్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు తాజాగా న్యాయం చేయరా దేవుడా ఫుల్ లిరికల్ సాంగ్‌ను ఆస్కార్ విజేత చంద్రబోస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

చంద్రబోస్‌తో సాంగ్ రిలీజ్

ఈ కార్యక్రమానికి దర్శకనిర్మాతలతో పాటు చిత్రానికి సంబంధించిన పలువురు హాజరయ్యారు. న్యాయం చేయరా దేవుడా పాట ఆవిష్కరణ అనంతరం లిరిసిస్ట్ చంద్రబోస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

"‘ధర్మస్థల నియోజకవర్గం’ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో ‘న్యాయం చేయరా దేవుడా..’ అనే లిరికల్ సాంగ్‌ని విడుదల చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ పాటకు నేనే సాహిత్యం అందించాను. సునీత గారు ఆలపించారు" అని చంద్రబోస్ తెలిపారు.

సాహిత్యంపై మంచి పట్టు

చిత్ర దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ.. "‘న్యాయం చేయరా దేవుడా..’ పాటకు లిరిక్స్ అందించడమే కాకుండా, మేము అడగగానే ఆవిష్కరించిన ఆస్కార్ విజేత చంద్రబోస్ గారికి మా టీమ్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సినిమాకు ఆయన ఎంతగానో ప్రోత్సాహం అందించారు" అని అన్నారు.

యంగ్ హీరోలు కూడా

"ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘ధర్మస్థల నియోజకవర్గం’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఈ చిత్రంలో సీనియర్ నటులైన సాయి కుమార్, సుమన్‌లతో పాటు యంగ్ హీరోస్ కూడా నటిస్తున్నారు" అని జై జ్ఞానప్రభ తోట చెప్పారు.

"ఇండియన్ స్క్రీన్‌పై ఇప్పటి వరకు లేని విధంగా.. డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ ఈ చిత్రంలో ఓ ఐటెమ్ సాంగ్ తో ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నారు. ఈ సాంగ్‌‌తోనే మ్యూజిక్ ప్రమోషన్స్‌ని మొదలు పెట్టబోతున్నాం. ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చేలా ఉత్కంఠ భరితమైన సన్నివేశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది" అని పేర్కొన్నారు డైరెక్టర్.

స్పెషల్ అట్రాక్షన్

"చంద్రబోస్ గారి లిరిక్స్, స్టార్ సింగర్ సునీత ఆలపించిన పాటలు ఈ చిత్రానికి మరో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. అన్ని హంగుల‌తో ఈ చిత్రాన్ని త్వరలోనే రిలీజ్ చేయనున్నాం. మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తామని తెలిపారు" అని దర్శకుడు జై జ్ఞానప్రభ తోట తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks